| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
భూచరఖేచరాద్భుతవేగుఁడగుచు నా చందమునఁబోవ నా మధ్యరాత్రి భామిత్రమిత్రు2074లు భరతుస్వప్నమున రామసౌమిత్రులు రణభూమిలోనఁ దల నూనియలతోడఁదనువులు డస్సి బలహీనులై 2075క్రుస్సి పంకమధ్యమునఁ బడి పలవించుచు బహురోదనంబు లుడుగక కావించుచున్న బిట్టులికి భరతుండు మేల్కని పాపంపుఁగలకుఁ బరితపించుచు వెలుపలి కేఁగుదెంచి కలలోన రామలక్ష్మణులున్న తెఱఁగుఁ దలపోసి తలపోసి తలఁకుచు నుండఁ, దొడఁగి దానికిఁదోడు దుర్నిమిత్తములు గడఁగి పెక్కులు దోపఁగా భీతినొంది: “యిది యేమిపాపమో! యిదియేమి తెఱఁగొ! యిది యింక నిటమీఁద నేమిగాఁగలదొ! రామసౌమిత్రు లరణ్యమధ్యమున నేమైరొ! జానకి యేమైనయదియొ! యెన్నంగఁబదునాలుగేండ్లును నిండు చున్నవి; వినఁగరా దొక వార్తయైన. నా సత్యధనులకు నా యుదారులకు నా సదాచారుల కా కృతార్థులకు నే కీడు రాకుండ నేను నా సుకృత పాక మిచ్చితి.”నని భరతుండు పలికి భావించి వేదతత్పరుల భూసురుల వేవేగ రావించి వేదోక్తయుక్తి సకలదానంబుల సకలధర్మముల సకలహోమంబుల శాంతి చేయించె. నా లోన హనుమంతుఁడాకాశవీథి నా లోన బాలార్కుఁడై వచ్చి వచ్చి బలిసిననిష్ఠతో భరతేశుఁ2076డున్న పొలుచు నందిగ్రామపురిఁజేర వచ్చి ఘనజటాభారవల్కలములతోడ ఘనఘనశ్యాముఁడై కమలాప్తకులుఁడు భరతుఁడా రఘురాముభంగిఁదోచుటయుఁ గర మద్భుతంబంది కపిముఖ్యుఁడపుడు: “సౌమిత్రి మృతుఁడైన జానకి డించి రాముఁడొక్కరుఁడిటురాఁబోలు.”ననుచు “నడుగుదునో!”యంచు,“నడుగఁబొ.”మ్మనుచు గడఁకతోఁదలపోసికపికులోత్తముఁడు శరణాగతత్రాణ 2077సద్ధర్మనిరతుఁ డరయఁగ రఘురాముఁడభిరామబలుఁడు తన సూనృతము డించి తన పేరుడించి తన కులసతి డించి తమ్ముని డించి యంగదుసుగ్రీవు లాదిగాఁబ్లవగ పుంగవకోటులఁ బోరిలో డించి మొనసి రావణుఁబ్రాణములతోడ డించి తన మేనుఁదెచ్చునే దశరథాత్మజుఁడు? మానవసామాన్యమతిఁజేసి రాము నే నేల చూచితి నీ పిన్నచూపు? ఒలసి రామునిఁబోలు నొక తపోధనుఁడు కలిగినాఁ; డింతియకాఁబోలు!”ననుచు నతివేగమున లంక కరిగెడుత్రోవ నతులబలో2078దాత్తుఁడై పోవఁబోవఁ గలగన్న భరతుఁడాకాశంబుఁజూచి యలఘుఁడై చనుచున్న హనుమంతుఁగాంచి “యిట తోప నేలకో యీ దుర్గ్రహంబు పటుబాణముల దీనిఁబడనేయవలయు.’ నని శరచాపంబు లాటోప మొప్ప ఘనసత్త్వుఁడప్పుడు కైకొన్నఁజూచి. కాకుత్థ్సతిలకుఁడాకర్ణించుకొలఁది నాకాశమున నొక్క యశరీరి పలికె: “నితనిదిక్కున నీవు హితబుద్ధి సేయు; మీతఁడు మీ బంధుఁ; డీ వల్గ వలవ.” దని యొప్పఁబలికిన యశరీరిపల్కు విని శరచాపముల్ విడిచె2079నా ఘనుఁడు. |