| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నా సమయంబున నర్క2125తనూజుఁ డా సుషేణునిఁజూచి యర్థి దీపింప: “నిక్కొండఁదడయక యీవు వానరులు నెక్కి మహౌషధు లేర్పడఁదెచ్చి భావించి లక్ష్మణుప్రాణముల్ వడయు వేవేగ.”ననవుడు విని సుషేణుండు పనిఁబూని యప్పుడు బరవసంబొప్ప వనచరసహితుఁడై వడిఁగొండ యెక్కి: “యమరేంద్రుఁడిక్కడ నర్థితోఁదొల్లి యమృతపానము సేసె నమరులుఁదాను; నిచట విష్ణుఁడు జగద్ధితవృత్తిఁబూని యచలుఁడై నిజచక్రహతిఁద్రుంచి వైచె నురురాహుమస్తకంబుగ్రుఁడై.”యనుచుఁ దరుచరవరులకుఁదవిలి చూపుచును నొగిఁబర్వతమున మహౌషధుల్ దెచ్చి తగఁబ్రయోగింప నంతన వానిశక్తి తగిలి నాటిన బాణతతు లోలి వెడలి మగుడెఁబ్రాణములు లక్ష్మణకుమారునకు. నప్పుడు వానరు లానందమంద నెప్పటి2126పేర్మితో నినవంశ్యుకడకుఁ జనుదేరఁగౌఁగిట సౌమిత్రిఁజేర్చి కనుఁగవ హర్షాశ్రుకణములు దొరుగ నా2127సమీరజుఁజూచి:“యతులపుణ్యాత్మ! యీ సుమిత్రాపుత్త్రు నిచ్చితినాకుఁ; 2128గాకుత్స్థకులమిత్రుఁ గమనీయగాత్రు నీ కతంబునఁగంటి 2129నేఁడు లక్ష్మణునిఁ. బడిన నా తమ్ముని ప్రాణంబు లెత్తి పడసితి 2130నిపుడు నా ప్రాణముల్ మగుడఁ; బ్రాణంబు లన నాకుఁబరికింప నితఁడె. ప్రాణబంధు2131ండవు; పరమబంధుఁడవు; తరుచరోత్తమ! 2132నీవ తలఁప;నీచేయు పురుషార్థ మొరులకుఁబోలునే చేయ. నుపకారమునకుఁబ్రత్యుపకార2133మెలమి గపివీర! చేయుట గడు నుత్తమంబు. నీకుఁబ్రత్యుపకృతి నేఁజేయనేర; నీ కాపదలు లేవు నిఖిలలోకముల.” నని పల్కి రఘురాముఁడంత2134సుషేణుఁ గనుఁగొని 2135కొనియాడికౌఁగిటఁజేర్ప ముదితాత్ముఁడగుచు నిమ్ముల సుషేణుండు నుదధిపొంగిన క్రియ నుబ్బి యా రాము ననుమతి రణములో నట పడియున్న వనచరోత్తముల జీవములును బడసె. నంత వానరవీరు లంతరంగముల సంతోష మెసగ నా శైలంబుఁగదిసి సకలరత్నోజ్జ్వల2136సానుశృంగముల నకలంకరుచి నొప్పు నా సొంపుఁజూచి యవనీశుననుమతి నగ్గిరి యెక్కి వివిధస్థలంబుల వేడ్కతోఁదిరిగి, పరిపక్వఫలములఁబరితృప్తి నొంది పెరల తేనియలాని పెన్నీరు గ్రోలి యవరోహణము సేసి రందఱు. నంతఁ బవననందనుఁజూచి పలికె రాఘవుఁడు: “నెప్పటిచోటనె యేర్పడఁబెట్టు మిప్పర్వతాధీశు నింక నీ.”వనుచు రాముఁడు వనుప సంరంభంబు మెఱసి యా మహాశైలంబు ననిలనందనుఁడు నలఘుఁడై కొనిపోవ నాకాశవీథి జలధిమధ్యమున రాక్షసులు వీక్షించి పఱచి యత్తెఱఁగెల్లఁ బరువడిఁదనకు నెఱిఁగింప నేర్పడ నెఱిఁగి కోపించి లంకాధిపతిజయాలంకారధనుల శంకుకర్ణస్థూలజంఘులతోడ నట మహానాదుని నట మహావక్త్రు నట చతుర్వక్త్రుని నట మేఘ2137జిత్తు నట హస్తికర్ణు2138మహావీరజైత్త్రుఁ గటు వాక్యశాలి నుల్కాముఖుఁబిలిచి: “యలవుసొంపున మీర లడ్డంబు దాఁకి బలియు నా హనుమంతుఁబట్టి తెండొండెఁ; గొనిపోవుచున్న యా కుధరంబు వుచ్చి వనధిలోపలఁబాఱవైచి రండొండె; నీ రెండు తెఱఁగుల నేర్పడ నొకటి ధీరులై చేసి యేతెంచినఁజాలు నచ్చుగా నతనికి నర్మిలి వెలయ నిచ్చమై సవరాజ్య మిచ్చెద నిపుడె.” నా విని విపులసేనాసహస్రముల తో వారు వెడలి బంధురసత్త్వధనులు దానవామరవేషధారులై కినుక నూని రణోదగ్రు లుగ్రవిక్రములు క్షురికాసి తోమర శూల కోదండ పరశు కుంతాయుధ ప్రముఖశస్త్రములు ధరియించి మించినదర్పంబు మెఱసి యురుత2139రహంకారహుంకారులగుచుఁ గనుకని గర్జించి కాలమేఘములు పొనుపడ సూర్యునిఁబొదువుచందమునఁ బొదివి యా హనుమంతుఁబోనీక 2140కదిసి మదమున2141ఁబేర్చి దుర్మతులు బిట్టార్చి “దేవాసురుల మమ్ము దృష్టింపకోరి, పోవుచున్నాఁడవు భుజశక్తి మెఱసి. యీ కొండఁగొనుచు; నీ వెట పోయె.”దనిన. నా కపివీరుఁ డా యసురులఁజూచి విలయకాలానలవిస్ఫులింగములు దొలఁకాడ నుజ్జ్వలదుర్జయాభీల కాలచక్రాకారఘనవజ్రకఠిన వాలచక్రముఁద్రిప్పి వడి వ్రేయఁదొడఁగె. నప్పుడు రాక్షసు లడరి యెంతయును నొప్పింప2142వాయుతనూభవుం డలిగి భంజించెఁగొందఱఁబదతాడనముల; భంజించెఁగొందఱబలవాల హతుల భంజించెఁ గొందఱఁబ్రకటోగ్రముష్టి; భంజించెఁ గొందఱఁబటు నఖప్రతతి; భంజించెఁగొందఱ భయదనాదముల; భంజించెఁగొందఱ 2143బరుషోగ్రదృష్టి; ఘనసత్త్వుఁడిబ్భంగిఁగయ్యంబు సేసి వినుతవిక్రమ 2144జయవృద్ధిఁబెంపొంది. తోయజాప్తుఁడు పేర్చి తుప్పలఁదూలఁ దోయదంబులఁ2145దొల్గఁద్రోచుచందమున రాక్షసవీరుల రణ2146మున నోర్చి నక్షత్త్రవీథి నున్నతశక్తి మెఱసి పోవుచు నుండ నా భుజశక్తిఁజూచి దేవగంధర్వులు దివినుండి 2147యపుడు పొరిఁబొరి నతనిపైఁబూవులవానఁ గురియించుచుండిరి కొలఁది కగ్గలము. నంతలో హనుమంతుఁడతివేగుఁడగుచు నంతరిక్షంబున నరిగి యక్కొండ మున్నున్నచోటనే ముదమొప్పఁబెట్టి క్రన్నన రఘురాముకడకు నేతెంచి వినతుఁడై తన 2148పూర్వవృత్తాంతమెల్ల వినుపింప శ్రీరామవిభుఁడు హర్షించి యా వాయునందను నాలింగనంబు గావింపఁ గనుఁగొని కపివీరు లపుడు వచ్చి లంకాపురవరమెల్లఁ2149గలయఁ జెచ్చెరఁ జేసిరి సింహనాదములు. భూరి దశాననుపుణ్యచిహ్నములు బోరన2150నందంద పోవుచందమునఁ దఱిగి యాకసమునఁదార లొండొండ యఱిగి పోవఁగఁజొచ్చె; నట వేగెఁబ్రొద్దు; దారుణస్ఫుటరోషదైత్యగర్వాంధ కారంబుతో నంధకారంబు విరిసె; నలి మీఱ వానరాననసరోజాత ములతో సరోజాతములు వికసించెఁ. 2151దమపెంపు2152పోఁదూలుదనుజాస్యకైర వములతో భువిఁగైరవమ్ములు మొగిడె. భానువంశాధీశబహుళప్రతాప భానుతో భానుండు ప్రాగ్దిశఁదోచె. జానకీవిభుఁడంత సౌమిత్రిఁజూచి యూనిన సంతోషముల్లంబు నిండ “సదమలగుణశీల! సౌమిత్రి! నీవు బ్రదికితి; నా పాలిభాగ్య మెట్టిదియొ!” యనియని కొనియాడు 2153నతులవాక్యములు విని లక్ష్మణుఁడు రామవిభు2154నకు మ్రొక్కి: దేవ! ప్రాకృతుఁడవె; దేవ! దీనుఁడవె; దేవ! 2155నిర్ధనుఁడవె; దేవ! యల్పుఁడవె; యీ భంగి నానతి యీనేల2156మీకుఁ బ్రాభవ2157ంబును బెంపుఁబరికింప మఱచి; మును దండకారణ్యమునులకు సాధు జనుల కిచ్చిన ప్రతిజ్ఞలు విచారించి, యిచ్చలో మిము నమ్మి యీ విభీషణుఁడు వచ్చిన నిచ్చినవరము చింతించి, యినుఁడస్తశిఖరికి నే2158ఁగకమున్న యని రావణునిఁజంపు మఖిలలోకేశ.!” యన విని రఘురాముఁ“డౌఁగాక!”యనుచు ఘన2159రణవిక్రమక్రమశక్తి మెఱసె. |