ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
రావణుని తృతీయయుద్ధ ప్రస్థానము
యంత దశగ్రీవుఁ2209డాహవోద్యోగ
సంతోషపోషితోత్సాహుఁడై మెఱసి,
యాదిత్యు లడర, బ్రహ్మాండభాండంబు
భేదిల్లఁ బటురణభేరి వేయించి
కలహవిక్రమకళాకలితుఁడై తివిఱి
బలములఁబన్నింపఁబడవాళ్లఁబనిచి
యుదయార్కబింబసముజ్జ్వలప్రభలఁ
బదికిరీటంబులు పదిలమై యొప్ప,
నాయత భుజశాఖలన్నియు రత్న
కేయూరకంకణాంకితములై తనర,
నిరవొంద డాకాల నింద్రాదిభయద
బిరుదభీషణగండపెండేర మొప్పఁ,
గరము లన్నింట భీకరచంద్రహాస
శర శరాసన గదా చక్రాదు లమరఁ,
బటు రోషదృష్టి ప్రభావహ్ను లెందుఁ
జటులంబుపై పర్వఁజనుదెంచి యపుడు
స్ఫుటబంధ బంధురషోడశచక్ర
ఘటితకోటిద్వయఘంటికారావ
భయదోగ్రసంఫుల్ల భల్లూకచర్మ
హయసహస్రోదగ్రమగు రథంబెక్కి
కాకుత్స్థుశరములఁ గడతేఱి మీఁద
వైకుంఠ రథమెక్కువడువు దీపింప,
నెలకొని రథకళానిధి కాలకేతుఁ
డలఘుబలోదారుఁడా తేరు గడప,
దీపించువెన్నెలతేటలై మీఁద
నేపారుగొడగు లనేకంబు లొప్ప,
మండితమార్తాండమండల చంద్ర
మండలకబళనోన్మదసముద్యోగ
రాహుత్రయముఁబోలె రహి మిన్నుముట్టి
సాహసరాహుమస్తక సుప్రశస్త
బిరుదధ్వజంబు లాభీలమై మూఁడు
దరలంగఁబటపటధ్వనులతో వెడలె.
భేరీమృదంగాది భీమగంభీర
భూరిభాంకృతుల నంభోధులుప్పొంగ
నుప్పొంగు కడఁకల నుర్వి గంపింప
నప్పుడు కరులును హరులుఁదేరులును
బలసముద్భటమహాభట కదంబములు
బలువిడి వెడలె దిగ్భాగంబు నిండఁ.
బ్రళయకాలమునాఁటి భానులభంగిఁ
దలకొని వెడలి రుదగ్రులై ఖడ్గ
రోముండు వృశ్చికరోముండు సర్ప
రోముండు నగ్నివర్ణుఁడుఁగయ్యమునకు.
నప్పుడంభోనిధు లన్నియుఁగలఁగె;
నప్పుడు లోకంబు లన్నియు బెదరె;
నప్పుడు దిగ్దంతులన్నియు మ్రొగ్గె;
నప్పుడు కులగిరు లన్నియు వడఁకె.2210
నెడపనికడఁకతో నిబ్భంగి వెడల
నుడువీథి సురలు దా రొండొండ నిండి
రావణోద్యోగసంరంభంబుఁజూచి:
“దేవారి యిటక్రింద దేవ దేవారి
యోధులపైఁబేర్చి యుద్వృత్తి నెత్తి
క్రోధించి మించి 2211పేర్కొని పోవునాఁడు
నీ రీతి యీ భావ మీ రణోద్యోగ
మీ రోష మీ వేష మెన్నఁడు లేదు.
నేఁడు లక్ష్మణసమన్వితుని రాఘవునిఁ
బోఁడిమితోఁ దాఁకి పోరాడకున్నె?”
యని రత్నమయ విమానారూఢులగుచు
ననిమిషు లనిమిషులై చూచుచుండ
రాసి వానరబలారణ్యంబుఁగాల్పఁ
గా సొంపుతో వచ్చు కార్చిచ్చు పగిది
నడతెంచు నసురసేనాసహస్రములఁ
బొడగని కపివీరపుంగవులెల్ల
నంగదుతోఁగూడి యట్టహాసములు
పొంగ నుప్పొంగి యార్పులు నింగిముట్టఁ
దరమైన తరులు నుద్ధతమైన గిరులు
గిరిశృంగములుఁగొని గిరిసమాకృతులఁ
దరమిడి బలువడి దనుజసైనికులఁ
దరుమ నయ్యిరువాఁగుఁ దాఁకె నొండొంటి
నక్షీణబలము లేపారంగఁదాఁకు
దక్షిణోత్తరసముద్రములచందమున.
నప్పుడు దానవు లా సేనమీఁద
ముప్పిరిగొని రోషములు మండుచుండ
నార్పులు జంకెలు నతులుహుంకృతులు
నేర్పులుఁగడఁకలు నిండ నొండొండ
కటమదోత్కటదంతిఘటల డీ కొల్పి,
పటుజవాశ్వంబుల బలువడిఁదోలి,
యలవొప్ప నరదంబు లఱిముఱిఁబఱపి,
నలుగడఁగాల్వుర నలిఁగవియించి,
కరవాల ముసల ముద్గర భిండిపాల
పరశు తోమర శర ప్రాస చక్రములఁ
గనుకని వైచియుఁగాఁడఁ బొడిచియుఁ
దునిమియు మెఱమియుఁ దూలనేసియును
వ్రచ్చియు మోఁదియు వసుధఁగూల్చియును
గ్రుచ్చియుఁగపులఁబేర్కొని విదళింప,
మొనసి వానరవీరముఖ్యులుఁగడిమిఁ
గినిసి యుద్భటరణక్రీడమై2212ఁగదిసి
యుఱికి సమీపమందున్న శైలములుఁ
దఱచైన గిరిశృంగతతు2213లు వృక్షములు
శిలలు మెండుగఁబట్టి చెలరేఁగ వ్రేసి
తలమీఱి గుఱ్ఱపుదళముల కుఱికి
యుదితోగ్రసత్త్వంబు లొప్పఁగుప్పించి
కుదియంగ రౌతులఁగూలఁదన్నియును,
గర ముగ్రులై కరిఘటలపైఁగవిసి
సొరిది శైలము లెత్తి జోదులు బెలుచఁ
గుంభమధ్యంబులఁగ్రుంగ నేనుఁగులఁ
గుంభిని నొక్కటఁగూలనేయుదురు;
రథములతోడ సారథుల రథ్యముల
రథుల నొక్కట నెత్తి రణమధ్యవీథిఁ
బెలుకుఱ నందంద పృథివి గంపింప
నలువున నటు వ్రేసి నలియఁజేయుదురు;
ధరణీధరంబులఁదరుకదంబముల
నురువడిఁగాల్వుర నుఱక మోఁదుదురు;
కఱతురు పండ్లను; గరతలాగ్రములఁ
జఱతురు; పదములఁజదియఁ బ్రాముదురు;
వ్రత్తు రుజ్జ్వలనఖావలుల; వాలముల
మొత్తుదు; 2214రలఁతురు ముష్టిఘట్టనలఁ.
బనస నీలాంగదప్రముఖులు మఱియు
వనచరవరులు దుర్వారులై యెగసి
తనియని కడిమి నుద్దండదానవుల
మొనలపై నాకసంబున నుండి నిండి
భూరి ధారాధరంబులు లయవేళ
ఘోరనిర్ఘాతముల్‌ గురియుచందమున
గురుశైలపాషాణకోటు లందంద
కురియ నుద్భటరణక్షోణి నెల్లెడలఁ
గూలునేనుంగులుఁ, గుంభమధ్యముల
వ్రాలు మావుతులుఁ,బైవ్రాలు 2215టెక్కెములు,
విఱుగువిండ్లునుఁ; గూలు వీరరాక్షసులు,
నొఱలునశ్వములుఁ, బై నొఱగురావుతులు
జదియు రథంబులు, సమయు సారథులుఁ
జిదియుపీనుంగులుఁ,జెదరుమాంసములుఁ
బడు కిరీటంబులుఁ, బగులు మస్తకము,
లడరు నెత్తురులుఁ, బెల్లవియు గాత్రములుఁ
దొలఁకాడు ప్రేవులుఁదునియుఖడ్గములుఁ
గలిగి యప్పుడు రణాంగణ మొప్పెఁజూడ
బహుభోగపర్జన్యభాగ్యంబపోలె
మహితాభ్రమాతంగమద 2216సిక్తమగుచు;
నతిరౌద్రరుద్రవిహారంబపోలె
హతగజాసురపిశాచానంద మగుచు;
నక్షీణ రామకటాక్షంబపోలెఁ
బ్రేక్షణహృష్టవిభీషణం బగుచుఁ;
గలియుగాంత్యోదగ్రకాలంబపోలె
బలశూన్యవిధ్వస్తబహుధర్మమగుచు;
గతదోషసంఫుల్ల కమలినివోలె
శ్రిత శిలీముఖపుండరీకౌఘ మగుచుఁ;
జారుశుభోదారసదనంబపోలె
నా2217రక్తఘనమార్గణాకీర్ణ మగుచు;
స్థిరపుణ్య2218మూలనదీభర్తవోలె
హరిసత్త్వనిర్మథితాభీల మగుచు;
ననఘక్రమాగమ యాగంబ పోలె
ననిమిషలోకచిత్తాభీష్ట మగుచు.
నొప్పునారణములో నుగ్రభావమున
కుప్పతిల్లుచు సుర లొగిఁజూచుచుండఁ
దొడ2219ఁగి నెత్తుటఁదొప్పఁదోఁగిలోఁ గలయఁ
బడియున్న ప్రేవులు పవడంపుఁబొదలు,
రథములు యానపాత్రము, లూడిపడిన
రథచక్రతతులు కూర్మములమొత్తములు,
మొగినున్న శవములు మొసళు2220లుఁ,గలయఁ
దెగిపడ్డ భుజములు దీర్ఘసర్పములు,
నాయుధరజ మిస్ము, హస్తిసమూహ
మాయతశైలంబు, లతులదంష్ట్రములు
తిమి తిమింగిలములు, దీర్ఘఘోటకము
గములు సముల్లోలకల్లోలతతులు,
వివిధాశ్వలాలలు వెలినుర్వు లందు,
ధవళాతపత్రసంతతులు హంసములు,
బహుకిరీటప్రభల్‌ బడబాగ్నిశిఖలు,
మహిమీఁదఁ జెదరినమాంసముల్‌ మణులుఁ,
బ్రీతనిశాచరప్రేతబేతాళ
భూతాట్టహాసముల్‌ భూరిఘోషములుఁ,
జంద్రుండు రఘురామచంద్రుఁ, డవ్విభుని
సాంద్రహాసద్యుతుల్‌ చంద్రికలగుచు
నడరెడు రక్తాబ్ధి యబ్ధితోఁదొరసి
యుడువీథితో రాసి యుప్పొంగుచుండె.

  1. ↑డాటోపకోప
  2. ↑నప్పుడు నభమెల్ల నల్లలనాడె; నప్పుడు రవిమండలాకృతి చెదరె
  3. ↑మా
  4. ↑దెసల-కు
  5. ↑లురుగండ -శిలలను వడివ్రేసి… మఱియుఁ-ద
  6. ↑రడఁతురు
  7. ↑దంచనలు
  8. ↑ర(యు)క్త
  9. ↑రత్న
  10. ↑లీల
  11. ↑రి
  12. ↑లగములు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )