| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నలి నప్పు డమరారి నారి సారించి తలకొని దేవగంధర్వబాణములు పరువడి2251నేయంగఁబఱతెంచుచునికిఁ బరికించి చూచి యప్పరమాస్త్రవేది తడయక దేవగంధర్వబాణములు వడి నేసి పొడిసేసె వసుధేశుఁ. డంత, నలుకమై రావణుం డా రాముమీఁద బలువిడి రాక్షసబాణ మేయుటయు మిడిగ్రుడ్లు నిడుదలై మెఱయుకోఱలును సుడిగొన్న కఱకుజుంజుఱు వెండ్రుకలును నసదృశోన్నతి మించునట్టి కాయములుఁ బొసఁగ దానవరూపములతోడ నిగుడఁ గనుఁగొని రఘుకులాగ్రణి యల్క మదిని దనరంగ వైష్ణవాస్త్రముఁబ్రయోగించి తరణిదీధితి యంధతమసంబు నడఁచు కరణి రాక్షసబాణగౌరవం బడఁచె. నంత రావణుఁ డురగాస్త్రంబు వింట నెంతయు సంధించి యేసె; నేయుటయు నా మహాబాణంబునందు బాణములు భీమసర్పంబులై పేర్చి2252 యందంద పదియు నిర్వదియును బండ్రెండు రెండుఁ బదుమూఁడు మూఁడును బదునేను నేను దలలతోఁ దలలపైఁ దళతళరుచులు గల మహామణులతోఁగడఁకమైఁబేర్చి గరుడవాహనుఁడని కాకుత్స్థుమీఁద బరవసంబున వచ్చుపాఁపదండనఁగఁ జదల నత్యుజ్జ్వలజ్వాల లెల్లెడల వెదచల్లుచును వచ్చు విధము వీక్షించి కాకుత్స్థకులభర్త గారుడాస్త్రంబుఁ గైకొని సంధించి కడిమి నేయుటయుఁ, గడుకొని గారుడాకారబాణములు వడి నందుఁబ్రభవించి వసుధ గంపింప 2253వరపక్షసంఘాతవాతవిధూత ధరణీధరంబులై తడయక నిగుడి నడుమన త్రుంచె నన్నాగబాణముల నుడువీథి సురలుండి యుప్పొంగి యార్వ. వెండియు నా దైత్యవిభునిపై నగ్ని కాండంబు నిగుడించెఁగాకుత్స్థుఁడలిగి. యది ధూమవిస్ఫులింగాక్రాంతదిశము, నది శిఖాదగ్ధసురాధీశవనము నగుచు నేతేర సురారాతి యుగ్ర మగువారుణాస్త్ర ముద్ధతి నేయుటయును ఘనసమూహంబు లాకసమెల్లఁగప్పి పొనర2254నంపాజాలముగ వాన గురిసి యనల సాయకము పెం పడఁచి గర్జిల్లఁ గనుఁగొని రాముఁడా కాండంబు మీఁద వాయవ్యశర మేసి వారించె. దనుజుఁ డాయెడ దంతిముఖాస్త్రంబుఁ బఱపె. దానఁబెక్కగుదంతి 2255తతి గళద్బహుళ దానజంబాలితధాత్రియై కదియ శ్రీరాముఁడును నారసింహాస్త్ర మేసె. బోరనఁదద్బాణమున సింహచయము దారుణతర సటాదారిత సకల నీరదనివహమై నిజఘోరనాద చలితదిగ్ద్విరదమై చటులత నిగుడి కులిశోగ్రనఖములఁగుంభముల్ 2256వ్రచ్చి హస్తిసంతతిఁద్రుంచె. నయ్యెడ సురలు ప్రస్తుతి చేసి రా పార్థివోత్తమునిఁ. |