ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
రావణుఁడు రామునిపై శూలము ప్రయోగించుట
గలుషించి యప్పుడు కల్పాంతవహ్ని
తులితమై మంటలు దొలఁకాడుచుండ
నా లోకలోకభయంకరాకార
శూలంబుఁగొని రాముఁ జూచి రావణుఁడు[వా.రా. సర్గ 104]
వసుమతి గంపింప వారిధుల్‌ గలఁగ
దెసల నెల్లందుఁబ్రతిధ్వనుల్‌ సెలఁగ
బిట్టుల్కి భూతముల్‌ బెదరఁగట్టల్క
దట్టించి సింహనాదము సేసి పల్కెఁ:
“2257బన్నుగా రామ! యీ పటుశూలవహ్ని
నిన్ను నీ తమ్ముని నీఱు గావించి
పోర నన్నెదిరించి పోరాడి చన్న
వారినారుల బాష్పవారి వారింతుఁ
జూడుము నీ.” వంచు శూల మంకించి
యోడక రాముపై నుంకించి వైవ
దానిపై రాముఁడుదగ్రుఁడై కినిసి
వానలు కల్పాంతవహ్నిపైఁగురియు
వురుహూతుపగిది నద్భుతశితాస్త్రములు
గురియంగ నది దానఁగుదియక వాని
నుఱక నీఱుగఁజేసి యుగ్రవేగమునఁ
బఱతెంచుగతిఁజూచి భానువంశజుఁడు
దేవేంద్రుఁడర్థిఁబుత్తెంచిన శక్తి
వావిరిఁగైకొని వైచె; వైచుటయు
నది నిర్గళద్ఘంటికారావ మగుచు
నది విస్ఫురత్పావకారంభ మగుచు
నది యక్షసురఖేచరానంద మగుచు
నది రాక్షసాలోకనాభీల మగుచు
వఱలు మనోవేగవాయువేగములఁ
బఱ2258తెంచు శూలంబు భస్మంబు సేసె.
నప్పుడు రావణుండలుక చిత్తమున
ముప్పిరిగొనఁగఁ గార్ముకదశకంబు
ధరియించి పేర్చి యుదగ్రుఁడై యార్చి
శరవృష్టి ముంచిన జననాథ 2259సుతుఁడు
తా నేక కోదండధరుఁడయ్యుఁదునిమె
వాని యస్త్రములెల్ల వారనికడిమి.
మదము మత్సరమును మానంబుఁ2260జలముఁ
గదురఁగన్నుల నిప్పుకలు నివ్వటిల్ల
రావణుఁడెంతయు రఘురాముమీఁద
వావిరి నమ్ములవానలు గురిసి
కుదియనికోపంబు కొలఁదికి మిగులఁ
బదియింట మాతలిఁబదియింట హరుల
విక2261లసత్త్వులఁజేసి విషమాస్త్రమొకటఁ
బ్రకటంబుగాఁద్రుంచెఁబటుకేతనంబు.
విపులచింతాభరవివ2262శులై తూలి
కపులు నా కపులు 2263నొక్కట విన్ననైరి.
భువనముల్‌ శంకించె; బుధుఁడు వేధించె
జవమున రోహిణీశకటంబునందుఁ;
బటుతరతేజంబు భయదంబుగాఁగ
నట విశాఖకు వచ్చె నంగారకుండు;
చటులోగ్రతరభంగి జలధు లుప్పొంగ
నటదూర్మిమాలికల్‌ నభమంది పొరలె;
నెగయు నౌర్వానలనిష్ఠురశిఖలు
పొగలచందము గాఁగఁ బొగయంగఁదొడఁగె;
నుగ్రాంశుబింబంబు నొరయుచు వచ్చి
యుగ్రదీప్తులతో మహోల్కలు డుల్లె;
నవిరళతరతేజ మటు2264మాఱుపడఁగ
రవియును గడుమందరశ్మియై తోచె.

  1. ↑బ న్నిరా
  2. ↑చి యాశూలం
  3. ↑వరుఁడు
  4. ↑గడిమి-గ
  5. ↑లత్వ మొనరించి
  6. ↑శతఁదూలి
  7. ↑ను గడుఖిన్నులైరి
  8. ↑మాఁగు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )