| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నా రాముశర2290హతి నవశుఁడై దనుజుఁ డా రథమధ్యంబునందు వ్రాలుటయుఁ గనుఁగొని భీతుఁడై కాలకేతుండు గొనిపోయె నరదంబు ఘోరాజి వెడల. సుర లప్పు2291డెంతయుఁజూచి యార్వంగఁ దరుచరయూధ2292ముల్ దగ నుత్సహింప నొలసినలావుమై నొక కొంతవడికి బలశాలి రాక్షసపతి మూర్ఛ2293దెలిసి ప్రథనవిక్రమసమప్రారంభుఁడగుచు రథముపై నిలిచి సారథిఁజూచి పలికె: “నోరి! రాముఁడు నవ్వ నురుకీర్తి ద్రెవ్వఁ దే రింత2294యెడ దవ్వు! దెత్తురే?”యనిన “నోడినవాఁడ2295నైయొండె నీ పగతుఁ గూడినవాఁడనై కొనిరాక గాదు; రథికుసంకటము సారథి గన్నచోట రథము మరల్చుట రణధర్మ మెందు; నటుగాన తెచ్చితి.” ననవుడు వాని పటువివేకమునకుఁ బలుమాఱు మెచ్చి పరమసమ్మదమునఁ బసదనంబిచ్చి సురవైరి యప్పుడు సూతు నీక్షించి: “రాముఁడున్నాఁడదె రణమధ్యవీథి; రాముని రథముపై రథముఁ బోనిమ్ము.” నావుడు నరద మన్నరనాథుఁ గదియఁ ద్రోవ నక్కాలకేతుఁడు బిట్టు పఱపె: దశకంఠునరద ముద్ధతి రాఁగఁజూచి దశరథసుతుఁడు మాతలిఁ జూచి పలికె:[వా.రా. సర్గ 108] “నదె రావణునిరథ మరుదెంచుచున్న; దదె మన రథమును నట పోవనిమ్ము; దృష్టి చలింపక తీవ్రబాణముల దృష్టించి వెఱవక తిరుగుడువడక వదలక కుదియక వరుసఁబగ్గములు పదిలంబుగాఁ బట్టి పఱపు రథ్యముల. మాతలి! హయముల మనసు నీ వెఱుఁగు; దాతతరథవేగ మతిచిత్ర2296ముగను సారథ్య మొనరింపు; సకలంబు నీవు నేరనియది లేదు2297 నీ కేమిచెప్ప?” ననవుడు నపసవ్యమగు త్రోవ నాతఁ డనిమిషారాతిపై నరదంబు వఱప, లోకకంటకుఁడు త్రిలోకభీకరుఁడు భూకంప మెసగ నద్భుతశితాస్త్రములు రథముపైఁగప్పి సారథిఁజిక్కువఱచి రథవాహముల నొంచి రౌద్రంబు మించి కాండ మొక్కట విల్లు ఖండించి పెక్కు కాండంబు లేసి రాఘవుని నొప్పించె. నొప్పింప నొచ్చి మనోవీథి నలుక ముప్పిరిగొన నుగ్రమూర్తియై కడఁగి దేవేంద్రుఁడర్థిఁ బుత్తెంచినవిల్లు వావిరి రామభూవరుఁ డెక్కువెట్టి నెఱసిన ఘనశింజినీ నినాదములఁ బఱియలై బ్రహ్మాండభాండంబు వగుల దానవగర్వాంధతమసం2298బు లణఁప భానుభాసురములై పరగుబాణములు శతములు వేలు లక్షలుఁగోట్లు మఱియు శతకోటు లర్బుదసంఖ్యలు గడ2299చి వాసవప్రముఖగీర్వాణు లుప్పొంగ నీసున నింద్రారి నేసె; నేయుటయుఁ, గడుఁబాపకర్ముండుఁగష్టుఁ డస్థిరుఁడు వెడమాయములప్రోవు; వీనిలో నునికి ధర్మప్రయుక్తిమైఁదనరెడు2300మనకు ధర్మంబు గాదని తలపోసి రోసి పోవుపోలిక నుచ్చిపోవుచునుండు రావణుఁగొని కాఁడి రాముబాణమ్ము. “లెడ2301లేదు; రావణుండిటఁగూలునింక; నడలకుండిటమీఁద.”నని ముద2302మొదవ ధరణికి సురలకు ధరణినందనకుఁ బొరిఁబొరి నెఱిఁగింపఁబోవుచందమున నొక కొన్ని ధరణికి నొక కొన్ని దివికి నొక కొన్ని లంకకు నురువడిఁబోవుఁ బావకోగ్రప్రభాభాసమానములు రావ2303ణుఁగొని కాఁడి రాముబాణములు. నెఱసి యిత్తెఱఁగున నిబిడంబు లగుచు నఱిమురి జడిగొన్న యంపసోనలకుఁ దెరలక మరలక దివిజారి తివిఱి ధరణీశు నురుశరోత్కరముల నొంచె. ఘన2304బాహువిక్రమక్రమకలాపములఁ బెనఁగి రిబ్భంగి నభేద్యవిక్రములు సమసత్త్వసమవేగసమబాణవిభవ సమసమరారంభచతురులై కదిసి. నెఱసిన 2305కినుకలు నిండి యొండొండ చెఱవిడి పోరాడు సింగంబు లనఁగ నేడహోరాత్రంబు లేపు దీపింప రూడిఁబోరాడి రారూఢవిక్రములు. అత్తఱి రావణునరదంబుమీఁద నెత్తురు వర్షించె నిలిచి మేఘములు; ఘనరథాశ్వములతోఁకల నిప్పు లురిలె; నినరుచిచ్ఛాయ లనేకంబు లయ్యె; “నిలువవు; చచ్చెదు నేఁడు నీ.” వనుచుఁ బలికె రావణుఁజూచి2306బలిసి భూతములు; “గెలిచెదు రాఘవక్షితిప! నీ.”వనుచుఁ బలుమాఱు నశరీరి భాషించె మింటఁ. దనకైన దుర్నిమిత్తములటు సూచి యనిమిషా2307రాతియు నాస వోవిడిచి ధృతిపెంపు దీపింపఁదివిరి కాకుత్స్థు నతిశాతశరముల నడరి నొప్పించి కరవాలములు మహాగదలు 2308శూలములుఁ బరిఘలు2309శక్తులుఁబ్రాసముల్ వైచె. వైచిన వానిపై వజ్రసన్నిభము లై చండకాలానలాకృతులైన సాంద్రార్ధచంద్రాస్త్రచయ మేసి రామ చంద్రుండు నడుమన చక్కుగావించె. నా రావణుండప్పు డత్యుదగ్రతను ఘోరనారాచముల్ గురియించె మఱియుఁ జలమున రాఘవేశ్వరుఁడును వాని నలి నర్థచంద్రబాణము లేసి త్రుంచె. నా రీతి నిద్దఱు నన్యోన్యసమర ధీరులై జయకాంక్షఁ దెగి పోరుచుండ[వా.రా. సర్గ 109, 110] సమరంబులో నద్రిచరనిశాచరులు తమ తమ యుద్ధసాధనములు2310గొనుచు రణవిచక్షణులైన రామరావణుల రణకేళిఁ గనుఁగొంచు రణకేళి మఱచి పరువడిఁజిత్రరూపంబులో యనఁగ నరుదంది చూడంగ, నద్దశాననుఁడు తన చావు నిక్కంబు దా నెఱింగియును, గినిసి రాముఁడు తన గెలుపెఱింగియును, నెంతయుఁదెగువతో నిరువురుఁజలము లంతకంతకు నెక్కుడై పోరుతఱిని గనలి కాలానలకల్పుఁడై రోష మునఁగన్నుఁగవల నిప్పుక లుప్పతిలఁగ నింద్రారిరథకేతు విలఁగూల్చె రామ చంద్రుండు నిశితార్ధచంద్రబాణమున; నా రావణుండును నధికరోషమున ఘోరబా2311ణముల నెక్కొ2312ని రథాశ్వముల మాతలినేయు నా మార్గణనిహతు లాతతాంబుజనాళహతులచందమున నా రాఘవేంద్రుని నా తురంగముల సారథి నొప్పింపఁజాలక యుండ హాసంబులును నట్టహాసముల్ సెలఁగ వాసిగఁగపులు రావణుని మార్కొనినఁ దరుచరసేనపైఁదన మాయ మెఱసి సురకంటకుఁడు మహాశుగవృస్టి గురిసెఁ. గురిసినఁదద్బాణకోటులచేతఁ దరుచరుల్ జడిసి. రత్తఱి రామవిభుఁడు సారథి రథరథ్యసహితుఁగా దైత్యు భూరిమార్గణములఁబొదివి నొప్పింప దశరథసుతునిపై దశకంధరుండు విశిఖజాలంబులు వృష్టిగా నపుడు కురిసినఁగనుఁగొని ఘోరబాణముల నరుదుగా సంధించి యమరులు వొగడ నతని నాకాశంబు నవనీతలంబు నతిరయంబున రాముఁడమ్ములఁగప్పెఁ. దనరు మహేంద్రమందరమహీధరము లొనరుధైర్యంబున నొప్పుచందమున నలిఁదిరంబై నిల్చి నభముతో నభము జలధితోజలధియు సరిఁబోరుకరణి ‘రామరావణుల సంగ్రామంబుతోడ రామరావణుల సంగ్రామంబెపోలు;’ ననుటకుఁదగి మహోదగ్రకోపములు దనరార నిరువురుఁదమకించి పోర జలదగర్జితధనుర్జ్యాఘోషములను గలహనిష్ఠురశరఘట్టనధ్వనుల జితవర్మసమరోగ్రసింహనాదములఁ జతురరథాశ్వహేషావిరావముల నుదధులు ఘూర్ణిల్లె; నుల్కలు డుల్లెఁ; ద్రిదశు లుప్పొంగిరి; దిక్కు లల్లాడె బెగడె భూతంబులు; పృథివి గంపించె; దిగిభంబు లూటాడెఁ; దిరిగె లోకములు; నగములు వడఁకెఁ; బన్నగభర్త దలఁకె నగణితప్రౌఢి నిట్లఱిమి పోరా2313డి కడఁకలు విడిచి యుగ్రత2314లుడ్గి కొంత దడ విద్దఱును బాహుదర్పముల్ సడలి ఘనబాణసంధానగతు లుజ్జగించి కనుఁగొ2315నుచుండిరి కలయ నొండొరులఁ. దెమలి పై పయిని ఫూత్కృతులు నార్పులును జెమటల వఱదలుఁజిఱుతహుంకృతులు నలయికయును ఘటికార్ధానఁ దేఱి మలుఁగనిచలములు మఱియుఁబ్రేరేప |