| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
“నీ వింక లంకలోనికిఁబోయి పుణ్య భావు విభీషణుఁబట్టంబుఁగట్టి[వా.రా. సర్గ 115] రమ్ము;పొ.”మ్మనవుడు రాఘవానుజుఁడు నెమ్మితో లంకలోనికిఁ2392బోయి యపుడు తడయక తరుచరోత్తములను బనిచి కడఁక సముద్రోదకములఁదెప్పించి వారి పురోహితవరుల రప్పించి వారి సజ్జనమంత్రివరుల రప్పించి భూరిమంగళతూర్యములు మ్రోయ నతని నారూఢనియతితో నభిషిక్తుఁజేసి సంచితమంగళాచారముల్ మెఱయ నంచితసింహాసనాసీనుఁజేసి కరమొప్ప నతని లంకారాజ్యమునకుఁ బరమసమ్మదమునఁబట్టంబు గట్టి: “యెందాఁక రవిచంద్రు, లెందాఁక ధరణి, యెందాఁకఁగులగిరు, లెందాఁక నభము, నెందాక జలనిధు, లెందాఁక దిశలు, నెందాఁక రాఘవాధీశుకీర్తనము నారూఢముగఁజెల్లు నందాఁక నేలు మీ రాజ్య.”మని యప్పుడెలమి దీవించి: “పరగ రక్షోరాజ్యభరణ మెవ్వరికిఁ బరికించి నడపుట పరమ దుర్లభము. దీని నేమఱక వర్తింపుము; నిత్య మైన ధర్మము సేయు;”మని యొప్పఁబలికె. నంత విభీషణుం డక్షీణరాజ్య సంతోషమును బొంది చతురమానసుఁడు తడయక మంగళద్రవ్యముల్ మంచి తొడవు లంబరములు2393ఁదోరంపుమణులుఁ గొని లక్ష్మణునిఁగొల్చి కొమరొప్ప వచ్చి జననాథునకు నిచ్చి సద్భక్తిమ్రొక్కె. నల2394రుచు రఘురాముఁడవియెల్లఁబుచ్చి యెలమితో మాతలి కిచ్చి వీడ్కొలుప మాతలి రథమెక్కి మహనీయమహిమ నాతతరథవేగుఁడై పోయె దివికిఁ. దదనంతరంబ యద్ధరణివల్లభుఁడు మదిలో విచారించి మారుతిఁజూచి: “జనకపుత్త్రికి మనజయము సేమంబు వినుపింపు లంకకు వేగఁబొ.”మ్మనుడుఁ |