| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
చంద్రశీతలు రామజననాథచంద్రు నింద్రాదిదేవత లెల్ల వీక్షించి: “మనుజుండవై నీవు మాకుఁగా వచ్చి జనియించి రాక్షసక్షయము గావించి యీ భంగి దుఃఖంబులిన్నియు నోర్చి భూభారమెంతయుఁబుచ్చి పోవైచి మమ్మిట రక్షించి మా జీవనములు నెమ్మితో మాకిచ్చి నిలుకడ లొసగి పుచ్చుచున్నాఁడవు; పుణ్యాత్మ!వరము లిచ్చెద; మడుగు మభీష్ట2451ంబు లెలమి.” ననవుడు రాముఁడా యమరులఁజూచి తనలోనఁజిఱునవ్వు దళుకొత్తఁబలికె: “నింపొంద మీ కృపనెల్ల 2452కార్యములు సంపూర్ణములు మాకు జగములయందుఁ; దమతమభూములఁ దమమందిరములఁ దమబంధుజనములఁదమతనూభవులఁ దమకళత్రాదులఁదగ 2453వొప్ప విడిచి సమరంబులోపల సకలవానరులుఁ దెగి తమ్ముడాఁపక తివిరి నా కొఱకుఁ బగఱతోఁబోరాడి ప్రాణముల్ విడిచి యున్నారు; కపివీరు లున్న తాత్మకులు; నన్ను మన్నించుట నాకిండు వీరి.” ననవుడు విని దివ్యు“లౌఁగాక!”యనుచు: “వనచరప్రాణముల్ వచ్చుఁగా!”కనిరి. యని మహాదేవుండు నబ్జసంభవుఁడు ననఘు లయ్యింద్రాదులైన దిక్పతులు మునులును సురలు నిమ్ముల నుతించుచును జన దశరథుఁడును జనియె నద్దివికి. ననిలోనఁదెగిపడ్డ యగచరులెల్ల ఘననిద్రమేల్కను కైవడి దోప నమరులవరశక్తి నద్భుతంబెసగ సమరోర్వి నప్పుడు సప్రాణులగుచుఁ జనుదెంచి యా రామచంద్రుని వేడ్కఁ గనుఁగొని హర్షించి కలయ మ్రొక్కుటయుఁ దనరార నందఱ దయతోడఁజూచి జనలోకనాథుఁడు సంతోష మందె. నంత విభీషణుం డా రాముతోడ నెంతయు భక్తితో నేర్పడఁబలికె:[వా.రా. సర్గ 124] “దేవ! రాఘవధరాధిప! నీవు నింక వేవేగ లంకకు విచ్చేసి యచట నవిరళమతితోడ నభిషేక మిప్పు డవధరింపఁగ వేళ.”యనిన రాఘవుఁడు వరజటాఘనభారవల్కలయుతుఁడు భరతుఁడక్కడఁదపో2454భరమున నుండ నతనిఁజూడక మాకు ననుచితంబిచట చతురభోగక్రమసముచిత క్రియలు.” అనుటయు నుచితజ్ఞుఁడగు విభీషణుఁడు ఘనభక్తియుక్తిమైఁ గడఁక దీపింపఁ గనకపాత్రంబుల గంధాక్షతములు ఘనరత్నభూషణకనకాంబరములుఁ బుణ్యనాదములతోఁబుణ్యులతోడఁ బుణ్యచిహ్నములతోఁబుణ్యభామినులఁ బనిచి తెప్పించి నిర్భరభాగ్యధనుఁడు వినయాభిరతి వినువీథి నందంద సురదుందుభులు మ్రోయ సురలు నుతింప సర2455స నచ్చరలు సేసలు నిండఁజల్ల రామలక్ష్మణులకు రాజీవనేత్ర భూమినందనకు నప్పుడు గట్ట నిచ్చె. నంత రాముఁడు నిశ్చలానందుఁడగుచు నెంతయుఁబ్రియమంది యింపొందఁబలికెఁ. “గడుఁ2456బెద్ద కార్యముల్ గలవు మా;కింకఁ దడయుటగా;దయోధ్యకుఁబోవవలయు.” ననుటయు2457రాముని నా విభీషణుఁడు గనుఁగొని భక్తితోఁగరములు మొగిచి |