| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
అనవుడు రఘురాముఁడభిరామశీలుఁ డనుజన్మయుక్తుఁడై యవనీశ్వరునకు నిండినప్రేమంబు నిష్ఠయు నిగుడ దండప్రణామముల్ దగఁజేయుటయును జిత్తసమ్మదమునఁజేనిండఁగ్రుచ్చి యెత్తి కౌఁగిటఁజేర్చి యినవంశుఁడనియెఁ: “గైకేయిమాట లాకర్ణించి నిన్ను లోకరక్షణకళాలోలుఁ గానలకుఁ బుచ్చితిఁ; దగ వింతపోలింపనైతి; నిచ్చలో శుభ2443కర్మ మెఱుఁగలే నైతి; నిన్నుఁబట్టముగట్టి నీవు రాజ్యంబు కన్నులపండువుగాఁజేయుచుండఁ జూచి లోకంబులు సుఖియించుచునికిఁ జూచు పుణ్యము నాకుఁజొప్పడదయ్యెఁ. బుత్త్రశోకంబునఁబోయిన నాకు సుత్రామలోకంబు సొరఁబూఁటగలదె! యా తాపమెప్పుడు నంతరంగమున నాతతస్ఫుటవహ్నియై మండుచుండు. నమరలోకంబున నాఱనిచిచ్చు శమియించె నేఁడు నీ సన్నిధిఁజేసి. కమలాప్తసమతేజ! కమలాభిరామ! కమలాప్తవంశ మక్షయకీర్తు లొప్ప నీ వయోధ్యకుఁబోయి నిఖిలధర్మములు భావించి 2444సామ్రాజ్య పట్టంబుఁబూని ‘రాముఁ2445డు లోకాభిరాముఁ’డ2446న్ నుతుల తో మహియేలు2447ము తుదముట్ట.”ననుచు సౌమిత్రిఁగనుఁగొని:“సౌమిత్రి! నీవు రామునివెనుక నరణ్యభూములకుఁ జనుదెంచి యుత్తమసాహసక్రియల ననఘుఁడై వర్తించి తతులపుణ్యుఁడవు. మెలఁకువ నిటమీఁద మీ యన్నమనసు నలఁగకుండఁగ నీవు నడవుమీ.”యనుచుఁ దన కర్థి2448తో మ్రొక్కి తలవాంచి యున్న జనకనందనఁజూచి జననాథుఁడనియెఁ: “బరమపాతివ్రత్యపదశుద్ధి నీకు సరి యెవ్వ?రుత్తమసాధ్వివి నీవు. నిను రాముఁడాడిననిష్ఠురోక్తులకుఁ గినియకు; నొవ్వకు;2449కీడ్పడకుండు; ఘనకీర్తియుతుల రాఘవుఁబోలు సుతులఁ గనుము; పుణ్యములెల్లఁగైకొని మనుము.” అని మువ్వురను2450నప్పు డర్థి దీవించి తనలోన మోదించె దశరథేశ్వరుఁడు. |