| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
“శుకవాణి! జానకి! చూచితే లంక యకలంకలక్ష్ముల నమరుచున్నదియుఁ; గమలాక్షి! యిది విశ్వకర్మ నిర్మి2465ంపఁ గొమరుదీపిం2466చెఁద్రికూటమధ్యమున. నీ లంక నిమ్ముల నేలుపుణ్యంబు చాలక పొలిసె దుర్జనుఁడు రావణుఁడు” అని రక్తమాంస2467మజ్జాస్థితండముల ఘనమైన సమరభాగముఁజూపి విభుఁడు “కదనవిక్రమశక్తిఁగడఁగి యేతెంచి మదిరాక్షి! యిక్కడ మడిసె రావణుఁడు. ఘనసత్త్వుఁడై కుంభకర్ణుఁడు దొడరి యని ఘోరముగఁజేసి యక్కడఁగూలె. నహితుఁడై నీలుఁబ్రహస్తుండు దాఁకి బహుసత్త్వుఁడిక్కడ2468భగ్నమై 2469పొలిసె. శూరతఁబవమానసుతుఁడు ధూమ్రాక్షు నారూఢబలుఁద్రుంచె నతివ! యిక్కడను. భేదించి యిచట నభేద్యుఁడై మేఘ నాదుండు మముఁగట్టె నాగపాశముల. ధృతియు లావును బేర్చి తెగువమైఁబోరి యతికాయు సౌమిత్రి యక్కడఁ2470గూల్చె. నలఘుఁడు మకరాక్షుఁడక్షీణబలుఁడు బలమేది యిక్కడఁబడియెఁబోరాడి. భగ్నారివీరుఁ డభగ్నప్రతాపుఁ డగ్నివర్ణుఁడు గూలె నయ్యెడ నతివ. కడిమిమైఁబోరాడి గర్వంబు లావు నెడలి యకంపనుండిక్కడఁగూలె. నలుకమై సౌమిత్రి యా యింద్రజిత్తు నలవొప్పఁదెగటార్చె నయ్యెడ నతివ. యనుపమబలుఁడగు నమ్మహాకాయుఁ దునిమె నియ్యెడ నంగదుఁడు సరోజాక్షి! తఱిమి యియ్యెడ మహోదరమహాపార్శ్వు లఱిమి చచ్చిరి మహోదగ్రవిక్రములు. క్రూరులై దేవాంతకుఁడు నరాంతకుఁడు పోరాడి యిద్దఱుఁబొలిసి రిక్కడను. ఇదె పయోనిధిమీఁద నేపు దీపింపఁ గదిసి మా కట్టినఘనసేతు వబల! యిదె గంధమాదనం. బిదె పుణ్యతీర్థ. మిదె సదాశివసమాహితనివాసంబు. కమలాక్షి!2471యీ తోచుకాంచనాచలము రమణీయ మిదియె హిరణ్యనాభంబు. పవమానసూనుండు పడఁతి! నిన్‌వెదక జవమొప్ప లంకకుఁజనుదెంచునప్పు డతనికి నాతిథ్యమర్థిఁ గావించు మతి నబ్ధి వెడలె నీ మహితశైలంబు.” నని చెప్పుచును రాఁగ నా రాఘవునకు ఘనతర భీషణాకారంబు తోడ నేతెంచి దశకంఠుఁడెదుటఁదోచుటయు భీతిల్లి యపుడు విభీషణు కనియె:2472 “జలజజుం డాదిగా సకలదేవతలు పలుమాఱుఁగొనియాడఁబంక్తికంధరునిఁ దునిమితి ననిలోన దోర్బలశక్తి. నెనయ నా రావణుఁడేతెంచి యిచట కదియుచు నా కన్నుఁగవమ్రోల నిలిచె. నిది చిత్ర! మేర్పడ నెఱిఁగింపు”మనుడు: “జననాథ! యా బ్రహ్మసంతతియందు జనియించినట్టిదుర్జనుని రావణునిఁ దెగటార్చి;తటుగాన దేవ! యా హత్య దగిలి యేతెంచి ముందట దోచె మీకుఁ. గడఁక నీ పాప మిక్కడఁబాపి వేగ కడచిపోయినఁగాని కాదు గార్యంబు. అవనీశ! నీ యాత్మ నబ్జసంభవునిఁ దవిలి తలంపుము; తలఁచిన నతఁడు నతిముదంబున వచ్చి యమరులుఁదాను మత మెఱిఁగించెడు మనువంశతిలక!” యనవుడుఁబుష్పకంబవనికి డించి తన మదిలోపలఁదాత్పర్య మొప్ప భూమీశుఁడప్పు డంబుజభవు నెలమిఁ గామించి తలఁప నక్కడి కేఁగుదెంచె నఖిలదిక్పాలురు నఖిలదేవతలు నఖిలసంయములును నందంద కొలువఁ. బ్రేమ నట్లేతెంచి ప్రియపూర్వకముగ రాముతో ననియె నా రాజీవభవుఁడు: “దేవ! రాఘవ! యేమి తెఱఁగున నన్ను రావించి.”తనవుడు రఘురామవిభుఁడు తన మనంబునఁదోచు తత్క్రమంబెల్ల వినిపింప నాతఁడు విస్మయంబంది: “దేవ!2473దైత్యుఁడు నాదు తేజంబునందు నీ వసుమతిఁబుట్టి యిన్ని పాపములు నురుతరంబుగఁజేసి యుగ్రత మెఱసి 2474పరికింపఁబిదప నిష్పాపుఁడై పొలిసె. ధరణిపై విప్రుండు దనకులక్రమము లరసి తా నిలు2475వక యన్యవర్తనము లరయుచు నతులదోషాచరుండైన గురుదూషకుండైనఁగులశిక్షుఁడైన నారయ గోబ్రహ్మహత్యాదిఘోర దారుణకర్ముఁడై తనరువాఁడైన వధకు నర్హుఁడు కాఁడు వసుధపై నెన్ని విధములనైనను వివరించిచూడ. నట్టి దుర్జనునకు నట్టి క్రూరునకు నట్టి పాపాత్మున కాజ్ఞ యేమనిన: నతనికులంబున కంత్యంబు సేసి పతి దనభూమిలోపల నుండనీక తగ వెడలించుటే2476ధర్మంబు సుమ్ము. జగదీశ! యిపుడు విశ్రవసుపుత్త్రుండు మోక్షంబుఁగోరి నీ ముందఱ నిలిచె; మోక్షకామునిఁజేయు ముదము దీపింప. భావించి నీ పేర భవునిఁబ్రతిష్ఠ గావింపు మున్నీటికట్టపై నొప్ప రమణమై నొక ముహూర్తములోన.”ననుచుఁ గ్రమమొప్పఁదెలిపి యా కమలజుండరిగె. నా వేళ రఘురాముఁడాసన్నుఁడైన పావని వీక్షించి పలికె నిట్లనుచు: “సన్నుతబలశౌర్య! సాహసధుర్య! పన్నగాశనవేగ! పరమానురాగ! మా కార్యమీడేర్చి మము నుద్ధరించి మా కీర్తి నెగడించి మముఁబ్రోచి తీవు. వినయవిక్రమధైర్యవిఖ్యాతులందు నినుఁబోల రెవ్వరు నిఖిలలోకములఁ. గావున నిపుడొక్క కార్యమీడేర్పు. మా విధ మెట్లన నది యెఱిఁగింతు: నగచరాధీశ! యత్యంతవేగమున నగణితఫలరాశియగు కాశిడాసి కరమొప్ప నొక్కలింగముఁగొనితెమ్ము. 2477పరగంగ నిన్నూటపదియోజనములు గల దిచ్చటికి; రెండు గడియలలోన నిలువక చనుదెమ్ము. నీ వాహవమున ధరమీఁదఁబడిన నా తమ్ముని కొఱకు నిరుమూఁడులక్షలు నిఱువది వేలుఁ బదియోజనంబులఁబవనవేగమునఁ గదలి మందులకొండ గ్రక్కనఁదెచ్చి తిరుగ నెప్పటిచోటఁ దిరముగా నునిచి యరుగుదెంచితి వప్పు డరజాములోన. నదిగాన నీ కిది యధికమే?”యనిన ముదమున నుప్పొంగి మ్రొక్కి వీడ్కొనుచు నరిగి యప్పుడు మహేంద్రాచలంబెక్కి యురుతరశక్తిమై నుంకించి యెగసి ఘనతరంబగు కాశికాపురి డాసి యనఘతరంగిణి నా గంగఁగ్రుంకి కాశికానిలయుని ఘను విశ్వనాథు నీశు దయాలోలు హితపరిపాలుఁ గని మ్రొక్కి నుతి సేసి కదలి యా ఘనుఁడు ఘనబుద్ధి నొక్క లింగమును గైకొనుచు నధికవేగంబున నరుదెంచుచుండె. బుధజనవినుతుఁడా భూమీశుఁడపుడు హనుమంతురాకకు నటచూచి చూచి “తనరంగ నిట ముహూర్తము చేరవచ్చె; చనుదేఁడదేమొ? రాక్షసుఁడెవ్వఁడైనఁ జెనఁకిన జగడంబు సేయుచున్నాఁడొ? ఏమి కార్యమొ?” యని యిచ్చఁజింతించి “యీ ముహూర్తము దప్పకిట లింగమొకటి యెనయఁబ్రతిష్ఠింతు నిసుకచే.”ననుచు జననాథుఁడపుడు సుస్థలమున కరిగి కరమున నొక్కలింగము గాఁగ నిసుకఁ గరమొప్పఁజేసినఁగంజాక్షి సీత నందిఁగావించె నా నగజాధినాథు ముందర నిసుకచే. మొగి రామవిభుఁడు నాయెడఁ బూజసేయఁగడంగునంత వాయువేగంబున వాయునందనుఁడు నరుదెంచి రఘురామునడుగుల కెఱఁగి ధరణీశుఁడుంచిన దర్పకారాతిఁ గనుఁగొని ఖిన్నుఁడై కళవళంబంది తనువు గంపింప గద్గదకంఠుఁడగుచు నంజనాసుతుఁడప్పు డనియె రామునకుఁ “గంజాప్తకులనాథ! కాశికి నన్నుఁ బనిచినఁబనిపూని బ్రహ్మాదిసురలు గనుఁగొన నచటిలింగమును దెచ్చితిని. ననుఁబంచి యిచ్చట నగజాధినాథు ననుపంగ నీతియే యుర్వీశచంద్ర! యనువొంద నేను దే నర్హుండఁగానొ? మనమున నా మీఁద మక్కువలేదొ?” యనుడు రాముఁడు మందహాసంబు సేసి హనుమంతుఁజూచి యిట్లనియె:“నా కరయఁ దమ్ములలో నొక్క తమ్ముఁడ వీవు; నెమ్మితో నీ మీఁద నెయ్యంబు ఘనము ‘ఈ ముహూర్తముఁదప్ప నీ’నని శివునిఁ గామించి యిసుకచేఁ గావించి తేను. నంతలోనన నీవు నరుగుదెంచితివి. సంతోషమయ్యె. నీశర్వు నవ్వలికిఁ దెమలించి నీ తెచ్చుదేవుని నిలుపు మమరులు వొగడంగ.” ననిన వాయుజుఁడు ముదమంది తనవాలమున నీశుఁజుట్టి కదలించి కదలించి కదలింపలేక మదిలోన శంకించి మఱియు నుంకించి మెదలింపఁజాలక మిగులఁజింతించి “యక్కటా! మున్ను ద్రోణాచలంబేను దక్కక యగలించి తనరఁదెచ్చితిని. భుజగకంకణుతోడ భూతాళితోడ రజతాద్రి నెత్తిన రావణునకును ఎత్తంగ నలవిగా కెసగుసౌమిత్రి నెత్తితి నింద్రాదులెల్లఁగీర్తింపఁ. దటుకున మేరుమందరములనైన బొటవ్రేలఁజిమ్ముదు భూరిసత్త్వమున. నిది కడువ్రేగయ్యె నీ రీతి. నాకుఁ బదిలంబు దప్పెనో? భానువంశజునిఁ గినిసి యేఁ2478దూఱఁబల్కిన పాపముననొ? కనుఁగొన నిటుగాక కాశీశు నిటకుఁ జేకొని యేను దెచ్చిన2479కతంబుననొ? కాకున్న నిది యేల ఘనమయ్యె?”ననుచుఁ బదిలంబుగాఁదన బలమెల్లఁగూర్చి త్రిదశులు వెఱఁగందఁ దివిఱి వెండియును నగచరేశ్వరుఁడు దైన్యముతోడ నభవు నగలించలేక బాహాసత్త్వమెడలి పటురక్తముల్ గ్రక్కి ప్రాణముల్ గలఁగి యట మూర్ఛతోడ నయ్యవనిపైఁద్రెళ్లె. నా సమయంబున నా రామవిభుఁడు భాసురమృదుకరపద్మముల్ సాచి హనుమంతు నెత్త నొయ్యన మూర్ఛ దెలిసి జననాథవరునకు సాష్టాంగ మెఱఁగి “జయ భూమిజాస్వాంతజలజషట్చరణ! జయ ఘోరకుటిల రాక్షసచయహరణ! జయ ఖండితోద్దండ శర్వకోదండ! జయ శోషితాబ్ధి ప్రచండోరుకాండ! జయ రావణోన్నతశైలామరేంద్ర! జయ భక్తహితపూర్ణసత్కృపాసాంద్ర! జయ నిర్మలాత్మ! సజ్జన కల్పభూజ! జయ పద్మబాంధవ శతకోటి తేజ! నీ మహిమంబులు నేర్తురే తెలియ నా మహేశ్వరుఁడైన నమరేశ్యుఁడైన నాగేంద్రుఁడైన నా నాకేంద్రుఁడైన వాగీశుఁడైనను వసుధాతలేంద్ర! ఏ నిన్ను నెఱుఁగంగ నెంతటివాఁడ? నే నిన్నుఁగొనియాడ నెంతటివాఁడ? బేలనై మీరు నిల్పిన యీశు నెఱుఁగ కీ లీలఁదెమలింప నెంచినయట్టి నా తప్పు లోఁగొని నన్ను మన్నించి యీ తఱి మీ యాజ్ఞ నేఁదెచ్చినట్టి యీ యీశునకు వెర వెఱిఁగింపు”మనుచుఁ బాయనిభక్తితోఁబ్రణుతించుచున్న హనుమంతుఁజూచి యిట్లనియె రాఘవుఁడు: “మనమున నీ వేల మఱిఁగెద విట్లు? నీవు దెచ్చిన కాశినిలయు నిచ్చోట పావని! నిలుపు. మీ భవునకు మున్ను ప్రీతిఁబూజ లొనర్తుఁ; బిదప నా యీశు నాతతభక్తితో నర్చింతు; సకల భూజనంబులు నిట్లు పూజగావింతు. రాజాహ్నవీజలం బవనిలో జనము తెచ్చి నీ తెచ్చిన దేవున కర్థిఁ జెచ్చెర నిట యభిషేకంబు సేయ నతఁడొనర్చిన బ్రహ్మహత్యాదు లఘము లతనిఁబొందవు; కీర్తు లలర సిద్ధించు; నతులిత పుత్త్రపౌత్త్రాభివృద్ధియును నతులభోగంబులు నమరంగఁగల్గు.” నని పల్క హనుమంతుఁడతి ముదంబంది మనమున సంతోష మగ్నుఁడైపొంగెఁ. బరమాత్ముఁడట యుమాపతిఁబ్రతిష్ఠించి యురుభక్తిఁదగ షోడశోపచారములఁ గరమొప్ప మునుమున్ను గాశికావాసుఁ దరణివంశ్యుఁడు సొంపుదనరారఁబూజ గావించి పిదపఁదాఁ గావించు శివుని భావించి యర్చించెఁ బరమహర్షమున. రమణఁబూవుల వాన రఘురాముమీఁద నమరులు గురియించి రగచరుల్ చెలఁగ. నంత విభీషణుం డధిపతి కనియె సంతోష ముప్పొంగ:“జగతీశ! యిప్పు డీ కట్ట తెరువుగా నెవ్వరికైన రాకుండఁజేయు మో రామ! లంకకును’ నావుడు హర్షించి నలినాప్తకులుఁడు నా విభీషణుఁజూచి“యౌఁగాక!”యనుచు నడరంగ నట గొన్నియడుగులు మఱలి నడు సేతుమీఁద నున్నతితోడ నిలిచి కపులుగ్రముగ మున్ను కట్టినయట్టి విపులబంధములెల్ల వీడెనో యనఁగఁ దన సహోదరుచేతి ధనువందిపుచ్చు కొని వేగమున ధనుష్కోటి గావించి “పరదారగమనంబు బ్రహ్మహత్యయును గురుజనద్రోహంబు గోగణవధయు సోదరీ రతియును సురఁగ్రోలుటయును వేద దూషణమును విత్తాపహృతియు సుందరీచ్ఛేదంబుఁజోరసంగంబు మందిరదహనంబు మాంసభక్షణము మొదలైన పాతకంబులు సేసియైనఁ గదిసి యిచ్చట నవగాహంబు సేయఁ బురుషముఖ్యున కబ్బుఁ బుణ్యసంఘంబు నరుదార నాయువు నారోగ్య మెపుడుఁ బరహితాచారసౌభాగ్య సంపదలుఁ జిరకీర్తులును వేగ చేకూరు.”ననుచు నా రాఘవేశ్వరుండపుడు పుష్పకము నారూఢగతి నెక్కి యధికమోదమున నమరులు దీవింప నగచరుల్ వొగడ నమరంగ నెప్పటియట్ల పుష్పకము ఘనవేగమునఁజన గగనమార్గమున మనుకులేశ్వరుఁడంత మహిపుత్త్రి కనియె: “హిమకరబింబాస్య! యిదె విభీషణుఁడు మముఁగన్నచోటు సమ్మదమున వచ్చి. యిక్కడఁ గుశతల్ప మేను గైకొంటి; నిక్కడ నుండితి నేకతంబుగను. బూని బ్రహ్మాస్త్ర మద్భుతశక్తి మెఱసి యేను బయోధిపై నిక్కడఁదొడుగ, 2480నదులతో నన్నదీనాథుండు వచ్చి ముదముతో ననుఁగాంచి మ్రొక్కినచోటు. అలఘువిక్రమశక్తి నమ్ము సంధించి జలజాస్య! యిక్కడఁజంపితి వాలిఁ. బుష్క2481లబహుఫలాద్భుతకాననంబుఁ గిష్కింధఁగంటె సుగ్రీవుపట్టణము.” ననియని2482తెల్పుచో నా లోలనేత్ర జనకనందన రామచంద్రుతో ననియె: “జననాథ! సుగ్రీవు సతులతోఁగూడ వినుఁడయోధ్యకుఁబోవ వేడ్క పుట్టెడిని.’ ననవుడుఁబుష్పకంబయ్యెడ నిలిపి జనపతి పంచినఁజతురుఁడై యరిగి తారాధినాథుండు దారాద్రికీర్తి దారాపథంబునఁ దారాదిసతులఁ జెలువొందఁదోడ్తేర సీతకు మ్రొక్కి యెలమిఁబుష్పక మెక్కిరింపార వారు. నెంతయుఁబదిలమై యేపు దీపింప నంత నెప్పటిమాడ్కి నరిగెఁబుష్పకము. నా లోన రఘురాముఁడా ఋశ్యమూక శైలంబు డగ్గఱి జానకిఁజూచి: “హితవానరానీక మీ ఋశ్యమూక మతిలోక. మీ గిరి నర్థితోఁదొల్లి 2483యలవడ మర్మంబు లరసి లో2484మెఱసి చెలువ! సుగ్రీవుతోఁజెలిమి సేసితిని. ఆసన్నరవికిరణాసక్తకమల భాసురోద2485రముఁ బంపాసరోవరము నిదె చూచితే; యొప్పు నీ పుణ్యసరసి మృదులతీరంబున మెలఁత నిన్‌బాసి బహుదుఃఖములఁబొందఁబవమానసుతుఁడు మహితపుణ్యాత్ముండు మము వచ్చికాంచి హృదయపద్మమునకు నింపు పుట్టించి మదిరాక్షి!2486కాన్పించె మర్కటేశ్వరుని. నొదవు కాననముల నొప్పుచునున్న దదె శబర్యాశ్రమ మబ్జాయతాక్షి! యలిగి యిక్కడ మహాహవకేళి వ్రాలి బల2487శాలియైన కబంధుఁజంపితిని. నినుఁజెఱగొనిపోవు నీచు రావణునిఁ గనుఁగొని పోనీక కడిమిమైఁదాఁకి మిన్న కయ్యసురతో మెఱసి పోరాడి యున్న తాయువు జటాయువు గూలె నిచట. అదె యా జనస్థాన మబ్జాయతాక్షి! 2488పొదలువనంబులఁబొలుపొందెఁజాల. నదె శూర్పణఖ నుగ్రుఁడై ముక్కుసెవులు గుదియంగ సౌమిత్రి గోసినతావు. అదె చూడు ఖరదూషణాదిరాక్షసులు మదమెత్తి చనుదెంచి మడిసినచోటు. ఈ యెడ నన్నొగి నెలయించుచుండె మాయామృ2489గాకృతి మారీచుఁడేచి. మదిరాక్షి! యిక్కడ 2490మఱివాఁడు మడిసె నిదె పంచవటి సూడు. మిదె పర్ణశాల. పటుమాయ నిక్కడ పంక్తికంధరుఁడు కుటిలుఁడై మ్రుచ్చిలి కొనిపోయె నిన్ను. నదె సుతీ2491క్ష్ణాశ్రమ మాశ్రమరత్న. మదె యగస్త్యాశ్రమ మబ్జాయతాక్షి! యదె శరభంగుని యాశ్రమం బింతి! యదె యత్రిమౌని పుణ్యాశ్రమభూమి. యదె నీకు ననసూయ యంగరాగములు హృదయరాగముతోడ నిచ్చినచోటు. అదె చిత్రకూటాద్రి; యక్కడ నన్నుఁ బదిలుఁడై భరతుండు ప్రార్థించి చనియె. విమలకాననముల విలసిల్లుచున్న యమున యల్లదె కంటె యనతిదూరమున. ముదమొప్ప బహుదివ్యమునులు సేవింప నదె చూచితే గంగ యమలతరంగ. యొదవిన కొలఁకుల నుద్యానతతుల నదె శృంగిబేర మొప్పారుచున్నదియు. నదె గుహుండేతెంచి యర్థితో మనల గదిసి కాంచినయట్టి కమనీయభూమి. యదె సరయూనది యధికయూపములఁ బొదిగొన్నతటములఁబొదలుచున్నదియు. నదె యయోధ్యాపుర; మబ్జాక్షి! మ్రొక్కు మదె కానవచ్చె నాయతపుణ్యరాశి.” యని భూమిజకు రాముఁడర్థితోఁ2492జూప ఘనమైన వేడ్కలఁగపులు రాక్షసులు బహురత్న కాంచనప్రాసాదతతుల బహుతోరణంబుల బహుపతా2493కలను బహువారణంబుల బహుతురంగముల బహురథోత్కరముల భటకదంబముల నమితవైభవముల నతులమై యొప్పి యమరావతియుఁబోలె నమరునప్పురము నినిచిన వేడ్కల నెఱి నిక్కినిక్కి కనుఁగొనఁ దొడఁగిరి కడఁకతో. నంతఁ |