| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
బదునాలు2494గేండ్లును బరిపూర్ణమైన2495ఁ బదపడి యా శుద్ధపంచమినాఁడు[వా.రా. సర్గ 127] అశ్రాంతశుభతేజుఁడగు భరద్వాఁజు నాశ్రమోపరివీథి నా విమానంబు ధీయుక్తి రాముండు దివి నిల్పి డిగ్గి యా యాశ్రమంబున కర్థి నేతెంచి యమ్మునిపాదంబులందు మోదంబు గ్రమ్మఫాలస్థలి గది2496యించి మ్రొక్కి మునిచేత దీవనల్ ముదమొప్పఁబడసి వినయరసావేశవివశుఁడై పలికె: “నేను మీ దగుసేమ మేమియు నరయ గానఁ;2497గానకుఁబోయి కాలంబు దడసెఁ. గలవుకదా? మీకుఁగందమూలములు, ఫలములు, జలము; లపాయంబు లేక యెల్లతెఱంగుల నెప్పుడు సెడక చెల్లుఁగదా? మీకు శిష్టకృత్యంబు.” లనవుడు మునినాథుఁడా రామచంద్రు వినయవాక్యంబులు నిష్ఠఁబాలింపఁ గలవె సంకటములు; గలవె దుఃఖములు; గలవె బాధలు పుణ్యకర్ముల కెందు? నిత్యసత్యోన్నత! నీ ప్రసాదమున నత్యంతసుఖుల మై యఖిలధర్మములు సలుపుచు వేదోక్తసముచితక్రియలు సలుపుచుఁ దపములు సలుపుచండుదుము. నీ విందు విచ్చేసి నెమ్మి నేఁబనుపఁ గా వీడుకొనిపోయి క్రమ్మఱ నిందు విచ్చేయు నీ లోని వృత్తాంతమెల్ల నచ్చుగాఁబొడగంటి నధ్యాత్మదృష్టి. నరయ నీ చేసిన యద్భుతక్రియల నరిది యనుష్ఠింప నా దివ్యులకును. నీవరణ్యములకు నిష్ఠ దీపింపఁ బోవుట మొదలుగా భోగంబు లుడిగి ఘనజటాభారవల్కలము2498లు దాల్చి పనివడి భరతుండు భక్తి వాటించి నీ పాదుకలయందు నిఖిలరాజ్యంబు రూపించి నిలిపె నారూఢమానసుఁడు; చెప్ప నక్కజమైన చిత్తానురక్తి నెప్పుడు నీ రాక కెదురు వీక్షించు. నీవు నీ తమ్ముని నెయ్యంబుఁదలఁచి వేవేగఁ2499బ్రోవ భావింపంగవలయు. వనవాసమున డస్సి వచ్చినవాఁడ, వనఘ! మా యాశ్రమమందు నేఁడుండి భూపాల! నీ వెల్లిప్రొద్దునఁగదలి మాపంపు గైకొని మఱిపొమ్ము; విందు గావింతు.”నని చెప్పి ఘనతపోమహిమ నా వేళ రాముఁ డత్యాశ్చర్యమంద నా మహామునివరుఁడాత్మలోపలను గామధేనువుఁగుతుకముతోడఁదలఁప మిలమిలమెదలెడిమృదుతరాన్నమును ఫలములు ఘృతము సూపము లపూపములు సరవితో శాకముల్ శర్కరల్ పెరుఁగుఁ బరమాన్నమును నాన2500వాలును జుంటి తేనియల్ 2501శిఖరులుఁదియ్యఁజూఱులును బానకంబంబళ్లుఁబచ్చళ్లు జున్ను వరుగులు వడియముల్ వాసనోదకము లురుతరరుచి నొప్పునూరుఁగాయలును మొదలైన వా వేల్పు మొదవు గల్పింప ముదమునఁగపిదైత్యముఖ్యులతోడ నచ్చపుభక్తితో నా రామచంద్రుఁ డిచ్చ మెచ్చుచు భుజియించి2502యున్నంత నా భరద్వాజుఁడిట్లనియె రామునకు: “శోభనగుణధామ! సుగుణాభిరామ! యేము నీకొక వరంబిచ్చెద 2503మిపుడు; కామింపు మనుటయుఁగరములుమొగిచి: “పోఁడిగా సాకేతపురము చుట్టునను మూఁడుయోజనములు మునినాథ!వినుఁడు: ఏచి తలిర్చుచు నెల్లకాలమును బూచుచుఁబండుచు భూజంబు లుండ వరమిండు; మఱియొండువరము నేనొల్లఁ గరుణింపు.”మనవుడుఁగరుణించెమౌని. యాయీగిఁజరితార్థులైరి వానరులు మాయని హృదయసమ్మద2504మునఁబొంగి యప్పుడు రఘుపతి యనిలనందనునిఁ దప్పక చూచి యుదాత్తుఁడై పలికె:[వా.రా. సర్గ 128] “నతులసత్త్వోన్నతి నత్యంతవేగ రతి శృంగిబేరపురంబున కరిగి భూరిమానసు గుహుఁబుణ్యాత్ముఁగాంచి మారాక యతనికి మఱి యెఱిఁగించి యా యున్నతాత్ముచే నట వోవుత్రోవ ధీయుక్తి నెఱిఁగి నందిగ్రామమునకు నరిగి మా భరతున కతిశుభవ్రతున కురుదయారతునకు నున్నతాత్మునకు నేము వచ్చితి మని యెఱిఁగించి రమ్ము; పో, మారుతాత్మజ! పొమ్ము.”నావుడును మారుతాత్మజుఁడును మానుషవేష ధారియై యరిగి యత్యంత వేగమున గంగాతరంగిణిఁ గడఁకతో దాటి, శృంగిబేరమునకుఁ జెచ్చెరఁ బోవఁ బరహితాత్మకుఁడైన పరమేశురాక యరసి కానక గుహుఁడాత్మలోపలను: “నన్నేలు శ్రీరామ నరలోకవిభుని సన్నుతపదపంకజంబులు గొలిచి పోలేక నిలిచితి భూరిదుర్గముల నే లీల మెలఁగిరో? యెందున్న వారొ? శరభభేరుండ రాక్షసవహ్నిభుజగ గరళబాధలచేతఁగ్రాఁగిరో? కాక లేకున్న వ్రతము సెల్లినమీఁద మగుడి రాకయుండునె రఘురాముండు? వలికి తప్పునె? కార్యంబు దప్పె. నే నింక నిప్పుడే సొదసొచ్చి యెనయుదు రాము.’ నని మనంబున నున్న యాందోళ ముడిగి తన సతీసుతులును దమ్ములుఁదాను సొరిది గుండమునందు సొదఁబేర్చి మిగుల దరికొల్ప ననల ముదగ్రమై మండ 2505నరలేనిభక్తితో నా గుహుండపుడు ధరణీశుఁడగు రాముఁదలఁపులో నిలిపి యయ్యగ్నిలోఁజొర నరుగుదేరంగ నయ్యెడ హనుమంతుఁడడ్డమై నిలిచి: “యుడుగక తన వ్రతంబొనరఁజెల్లించి పుడమిఱేఁడిదె వచ్చు; బొంకుగా దెల్లి; పదపడి యగ్నిలోఁబడిన శ్రీరాము పదముల యా.”నంచుఁబలికిన నాతఁ డనిలజునకు మ్రొక్కి యా రామురాక కనుచరసహితుఁడై హర్షంబునొందెఁ. బరగ నగ్గుహుడు సంభావింప నరిగి యురుపుణ్యనిధి సరయూనది దాటి పోవ నందిగ్రామమున భరతుండు పావనచరితుండు భావంబులోన: “నా రామలక్ష్మణు లవనినందనయు నే రీతినున్నారొ? యేమైనవారొ? యెన్నిన పదునాలుగేండ్లును నయ్యెఁ; గ్రన్నన రాముఁడిక్కడికి రాఁడేమొ? మోసపోయితి; నాఁడె మునివృత్తి రాము భాసురకోమల పాదపద్మములు నా సుమిత్రాపుత్త్రుఁ2506డర్థితోఁగొలిచి యాస మీఱఁగఁ దోన యరిగినరీతి నరుగలేనైతి? నే నా రాముఁబాసి ధరణి నే విధమునఁదనువు ధరింతుఁ.? “బదునాలుగేండ్లును బరిపూర్ణమైన సదయుఁడై రఘుపతి సనుదేక యున్న ఘనమైనసొదఁబేర్చి కడఁకతోఁజొత్తు.” నని నిశ్చయంబుగా నాడినప్రతిన హితమతి రిత్తవోనిత్తునే?’యనుచు మతి నిశ్చయము సేసి మంత్రులకనియె: “శాత్రవమదహారి శౌర్యసంపన్నుఁ బాత్రు శత్రుఘ్నునిఁబట్టంబుఁగట్టుఁ; డే నగ్నిలోఁజొచ్చి యేఁగెద రాముఁ గానంగ:”ననిన నా ఘనుఁజూచి యపుడు శత్రుఘ్నుఁడిట్లను:“జగతీతలేశ! ధాత్రి నాకేల? యీ తనువు నాకేల? నీ పాదములుగొల్చి నీ తోడఁగూడి యేపారఁగా నేను నేఁగుదెంచెదను.” అని కృతనిశ్చయులైన వారలను గనుఁగొని భీతులై కలఁగి రందఱును |