ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
పట్టాభిషేకము
యురువడి మఱునాఁటియుదయకాలమున
‘కరుదరు!’దనఁదెచ్చి రఖిలోదకములు.
2564చేతోవినిర్మల శిష్టు వశిష్ఠు,
గౌతమ జాబాలి కశ్యప కణ్వ
వామదేవాదులౌ వరమునీశ్వరుల
సామాదిబహువేదచతుర2565బోధకుల
భరతుండు రప్పించి భయభక్తులొప్పఁ
బరమసమ్మద వచోభంగులు మెఱయ:
“శ్రీరామునకు నభిషేకంబు సేయుఁ
డారూఢనియతితో.”నని పల్క వారుఁ
బూని మంగళతూర్యములు మ్రోయుచుండ
జానకీరాములఁ జదురొప్పఁ2566బిలిచి
రమణీయతర2567మైన రత్నపీఠమునఁ
గొమరొప్ప నిరువురఁగూర్చుండఁ2568బనిచి
మానితవేదోక్తమంత్రపూర్వకము
గా నభిషేకంబుఁ2569గరమొప్పఁజేయ
నా రామునౌఁదల నా పూర్ణవారి
ధార డగ్గఱునప్డు 2570తగఁజూడ నొప్పె
గీర్వాణముఖ్యులు గీర్తనల్‌ సేయఁ
బార్వతీసహితుఁడై ప్రణుతింప నొప్పు
నంగజహరుమౌళి నమలమై తొరుఁగు
గంగానదియుఁబోలెఁగమనీయమగుచు
నా తీర్థ2571ధారలు నంఘ్రుల2572కొలికి
భూతలంబున 2573నిండి పొలుపారెఁజూడ
హరిపాదమునఁబుట్టి యయ్యాదిగంగ
ధరణిపైఁబరగువిధం బచ్చుపడఁగఁ.
బరికింప రామభూపాలకుం డపుడు
హరుఁడు విష్ణుఁడుఁదాన యనుమాడ్కి నుండె.
మఱి పట్టభద్రుఁడై మనుజవల్లభుఁడు
నెఱయఁబట్టముతోడినిటలంబుతోడ
సరస జటారుణచ్ఛాయల2574మాని
కరమొప్పు శశిరేఖ గంగవీచికల
సరి2575దాటి నుదుటికి జాఱిన నొప్పు
హరునిచందంబున నలరెఁ2576జూపఱకు.
గరుడ వియచ్చర గంధర్వవరుల
సురసిద్ధసాధ్యులు సొరిదిమై నపుడు
చదల2577నుత్సవపటుజయజయధ్వనులు
గుదియక యందంద ఘోషించి రెలమి;
నప్పుడచ్చరలోలి నాడిరి ప్రీతి;
నప్పుడు పుత్తెంచె నమరవల్లభుఁడు
పారిజాతామలప్రసవ2578మాలికయు
హారంబుఁబ్రియమున ననిలునిచేత;
నమితమంగళమూర్తి యైన రాఘవుఁడు
గొమరొప్ప వానిఁగైకొనియె నీక్షించి.
వసుధ యెంతయు సస్యవతి యయ్యె2579నపుడు
కుసుమఫలంబులఁగొమరొప్పెఁదరులు;
ఘన2580తరగంధముల్‌ గాంచెఁబుష్పములు;
వినుతింప దిక్కులు విమలంబులయ్యె.
నప్పుడు రఘురాముఁ డక్షీణవిభవ
మొప్ప భూసురులకు నున్నతాత్ములకు
ననుపమతరభక్తి యంతరంగమునఁ
గొనకొని ముప్పదికోటులు ధనము
లక్షగుఱ్ఱంబులు లక్ష2581యేనుఁగులు
లక్షగోవులు నిచ్చె లలి నొప్పుమీఱ;
లలితదివ్యాంబరాలంకారతతులుఁ
బొలుపొందు కాంచనపుష్పమాలికయుఁ
గొలఁదిమీఱిన ప్రియోక్తులఁజేరఁబిలిచి
యెలమి సుగ్రీవున కిచ్చెఁబెం2582పొంద;
ఘనవజ్రవైడూర్య కనకాంగదంబు
లనఘుఁడంగదునకు నర్థితో నిచ్చె;
మహితోరుకేయూరమకుటంబు లొప్ప
సహజపుణ్యుఁడు విభీషణునకు నిచ్చె;
నమితబలోదాత్తుఁడగు వాయుజునకుఁ
గమనీయరత్నకంకణయుగంబిచ్చె;
నాలోలరుచినిచయానూనమైన
నీలహారముఁబ్రీతి నీలున కిచ్చె;
వలనొప్ప నవరత్నవరహార మొకటి
నలునకు నిచ్చె నానందముప్పొంగ.
నభిమతవేదియై యందఱఁజూచి
విభుఁడు వానరులకు వీరువారనక
ప్రకటదివ్యాంబరాభరణమాల్యంబు
లకలంకమహిమతో నందఱ కిచ్చె;
శారదనిర్మల చంద్రికానూన
హారంబు సీతకు నర్థితో నిచ్చె.
ధరణిజ హారంబుఁ దా వైచికొనక
కరముల ధరియించి కాకుత్థ్సుమోముఁ
జూచెఁ; జూచుటయు సుదతిచూపెఱిఁగి
యా చతురాత్మకుండనుమతించుటయుఁ
దన కృపా2583రసధార దనర నాహార
మనిలజుకంఠంబునం దొప్పఁబెట్టె.
నా నిర్మలోదారహారంబుఁబూని
యా నిర్మలాత్మకుఁడనిలనందనుఁడు
శారదాభ్రావలి సరిఁ జుట్టియున్న
మేరువుతెఱఁగున మెఱసెఁజూడ్కులకు.
నంత వసిష్ఠుని యనుమతి రాముఁ
డంతఃపురంబున కరిగి తల్లులకు
వరుసతో మ్రొక్క దీవన లిచ్చి;రపుడు
ధరణీతనూజ యత్తలకెల్ల భక్తి
2584సెలఁగంగ మ్రొక్కిన:“శ్రీదేవి ఠేవ
నల సరస్వతిభాతి నగజాతరీతిఁ
బతిభక్తి మతియు సౌభాగ్యంబుఁగాంతి
యతులకీర్తియును బెంపలరంగఁగలిగి
యినచంద్రులనఁగాంతి నెనయుపుత్త్రులను
గనుము నీ.”వని ప్రేమఁగౌఁగిటఁజేర్చి

  1. ↑ఆతతశుభచిత్తులైన వసిష్ఠ
  2. ↑మానసుల
  3. ↑దెచ్చి
  4. ↑నూత్న
  5. ↑బెట్టి
  6. ↑గ్రమ
  7. ↑తద్దయు
  8. ↑జలధార లంఘ్రుల
  9. ↑దొరిఁగి
  10. ↑ఁబర్వి
  11. ↑నూని, ఁబూని
  12. ↑దాఁకి
  13. ↑జూడ్కులకు
  14. ↑నుజ్జ్వలజయజయ శబ్దతతులు
  15. ↑మాలికలు, మంజరుల-హారముల్‌ ప్రియ
  16. ↑ఁజూడ-ఁగు
  17. ↑గంధబంధ
  18. ↑యుక్షములు
  19. ↑పెసగ
  20. ↑ధారమై తనరారుహార
  21. ↑చెలువార
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )