| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | ఆశ్వాసాంత పద్యములు |
| ఉ. | సారసగేహినీ సుదృఢ సారసన ప్రవిమోక్షణక్రియా సార! సముజ్జ్వలస్మితరసా! రసవన్మధురాధరామృతా సార! సదానురాగ! ఘనసార సదాశివ హార సౌరకా సారసఖద్యశోవ్రజ! విసారసదృఙ్నయనామనోహరా! | 505 |
| కం. | అబ్జారిబంధునయన! జ యాబ్జారిగదాసి ధనురుదగ్ర శయాబ్జా! కుబ్జాతరుణీరమణ! క కుబ్జాత గజోపమారికుంభీంద్ర హరీ! | 506 |
| కవిరాజవిరాజితము | ఘనతరకారణ కల్మషకారణ కాయనికారణ కర్మపరా! సనకసనందన శక్తిజనందన సాధ్వభినందన సక్తమనా! జనితవినోదన! సక్త్యపనోదన! చారువినోదన! సర్వహరా! వినతసుదర్శన! విస్తృతదర్శన! విస్ఫుటదర్శనవేద్యపదా! | 507 |
| గద్యము | ఇది శ్రీమదనగోపాల కృపాలలితకటాక్షవీక్షాసమాసాదిత చతుర్విధానవద్య కవిత్వవిద్యావధానాధునాతన భోజరాజ సకలవిద్వజ్జనాభివర్ణితోదీర్ణ వితీర్ణి వైభవాధఃకృతరాజరాజ రాజయోగసామ్రాజ్య లక్ష్మీవిలాస ధురంధర ధరాధిపసభాంతరస్తవనీయ నయకళాయుగంధరబంధురమనీషావిశేషమంధాన వసుంధరాధర శోధితాగణిత గణితశాస్త్రరత్నాకర వినయాదిగుణరత్నాకర కంకంటివంశపయః పారావారపరిపూర్ణసుధాకరాప్పయామాత్య సంక్రందన నందన విజ్ఞానవిభవ విజితసనందన విష్ణుమాయావిలాసాభిధాన యక్షగాననిర్మాణప్రవీణతానిధాన పాపరాజప్రధానప్రణీతంబైన శ్రీమదుత్తరరామాయణంబను మహాకావ్యంబునందు సప్తమాశ్వాసము. |