| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆశ్రమవాసపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
అ య్యద్భుతపువృత్త మమ్మెయిఁ జెల్లిన | ధృతరాష్ట్రమేదినీపతి తపస్వి గణము సవినయంబుగా నిజస్థానయా | నమునకు నామంత్రితముగఁ జేసి యాశ్రమభూమికి నరిగెఁ దోడన పాండు | రాజనందనులును రా నుదాత్త తేజు సత్యవతీ తనూజు మున్నిడికొని | యప్పు డమ్మునిపతి యతనితోడ |
|
| తే. |
‘నీవు వేదశా స్త్రార్థముల్ భావితాత్ము | లగు మునీంద్రులచేఁ జెవులార వింటి, కంటి తనయుల నీ కన్న కంటె నొప్పి | యుండుదురు వారు దివిసౌఖ్యయోగ మెసఁగ. |
130 |
| ఉ. |
కావున నింక వారికయి కౌరవసత్తమ! యుమ్మలింప కా త్మావిల భావముం దపము నగ్గలికం బెడఁబాపు నిన్ను సం భావనఁ గొల్చి యొక్కనెల పాండవముఖ్యుఁడు నిల్చె నిష్ఠమై నీ వనభూమి; నీ వసుమతీశ్వరుఁ బొమ్మనఁ గాదె వీటికిన్?’ |
131 |
| వ. | అని చెప్పిన నప్పౌరవోత్తముం ‘డట్ల చేసెద’ నని పలికి యమ్మునిసత్తమునకుం బ్రణమిల్లి ‘భవదీయకృపా విశేషం బునం గృతార్థుండనైతి’ నని యతని నామంత్రితుం జేసినం, బాండవులుం దగ నప్పరమముని వీడ్కొని; రయ్యం దఱను దీవించి యమ్మహాత్ముం డంతర్హితుం డయ్యెఁ; దదనంతరంబ. | 132 |
| సీ. |
ఆంబికేయుండు ధర్మాత్మజుఁ జిత్తసం | ప్రీతి మోమునఁ దోఁపఁ బేరఁ బిలిచి ‘వసుమతీకార్య నిర్వహణంబు పెద్దకొ | ల్వున నుండి నీ వనుదినము నడప కునికి కర్తవ్యమే? వినుకులు భీష్మాది | మహితులచేత సమగ్రభావ మొందినయవి యింక నుపదేశ మేమియు | వలవదు; రంధ్ర మొవ్వని జనంబు |
|
| తే. |
వేచు; ననుజానుగతుఁడవై వేగపొమ్ము | దారయుతముగఁ బురికి నుదారచరిత! నీ కతమ్మున మున్న నా శోక మెల్లఁ | బాసెఁ, దేజంబు సౌఖ్యానుభవముఁ గంటి. |
133 |
| చ. |
‘తపమునెడన్ మదీయమతి తత్పర గావున దాని కోర్తు నీ వపగతఖేదమానసుఁడ వై నను నిం దతినిష్ఠ నొందఁ బం చి పురజనంబు సమ్మదముఁ జెందఁగ సైనికు లుల్లసిల్లఁగా నృపవర! యేఁగి రాజ్య భరనిర్వహణం బొనరింపు’, నావుడున్. |
134 |
| సీ. |
ధర్మతనూజుఁ డాతని తోడ నిట్లను | ‘నధిప! భీమాదుల నరుగఁ బనుపు పుడమి రక్షింప; నీ యడుగులకడ నేను | నిలిచి మా తల్లుల నిన్నుఁ గొలిచి యంచితతపమున కనుగుణం బైనట్టి | శుశ్రూషణము సేయుచును దపోని యతితోడ నుండెద; ననవుడు గాంధారి | యి ట్లనఁ దగు ‘నన్న ‘యీవ కావె |
|
| తే. |
కురుకులమునకు సంరక్షకుఁడవు; నీవు | తండ్రులకుఁ బిండ మొసఁగఁ గర్తవు; భవజ్జ నకునిపంపు చేయుము; భూజనము దలంక | కుండఁ బొ; మ్మది ప్రియము మా యుల్లములకు.’ |
135 |
| వ. | అని పలికిన, నప్పాండవాగ్రజుండు పాండురాజాగ్రమహిషితో నిట్లనియె. | 136 |
| ఆ. |
‘ఇట్లు మీరు నన్ను నెంతయుఁ దఱిమిన | విపినభూమి మిమ్ము విడిచి పోవ నియ్యకొనదు నాదుహృదయంబు; మునువోలెఁ | గలుగ దిపుడు రాజ్యకాంక్ష నాకు. |
137 |
| క. |
విను పాంచాలురు మాత్స్యులు | వనితా జనశేషులైరి; వారలు లేమిన్ జననీ! శూన్యంబై తోఁ | చినయది రాజ్యంబు నాదు చిత్తంబునకున్. |
138 |
| వ. | అట్లుంగాక. | 139 |
| క. |
సమరము దీఱినకోలెను | శమనిరతా! నా మనంబు సారతపమునన్ రమియింపఁ గోరు యుష్మ | త్సమధిక తపమునకు నేను సందడి సేయన్.’ |
140 |
| సీ. |
అన విని సహదేవుఁ డతనితో ‘నేఁ దప | మాచరించెద; వీర లందఱకును శుశ్రూష సేయు చియ్యాశ్రమంబున’ నన్న | నక్కుమారునిఁ గుంతి యక్కుఁ జేర్చి ‘వలవదు మీరు రా వలఁతులై మామీఁది | భక్తి నింపెసఁగ నీ పలుకు నెట్లు పలుక మీ యునికి తపమునకు విఘ్నంబ | కాక యెఱిఁగి మీర లెల్లభంగి |
|
| ఆ. |
మాకు నియమవిధి సమాచరణములపై? | నింత యెఱిఁగి మీర లెల్లభంగి నరుగు టొప్పుఁ గాని కురుకులోద్వహు మాట | గొనక యునికి చనదు తనయులార! |
141 |
| వ. | ‘మీకు సర్వకార్యంబుల యెడను శుభంబులయ్యెడును; బోయి రం’ డనిన నజాతశత్రుండు మఱియొండు వలుకం బుయిలోడి ధృతరాష్ట్రునితోడం’ దపోమహనీయులైన మిమ్ముం గొలిచి గత కల్మషుండ నైతి మీ యాజ్ఞాపనంబు దలనిడికొని పురంబునకుం బోయి వచ్చెద’ ననుటయు నక్కురువృద్ధుం డతని దీవించుచు నాలింగనంబు చేసి, భీమసేను సాంత్వన వచనంబులం బ్రీతుం గావించి కౌఁగిలించుకొని, గాండీవిం గొనియాడి సంశ్లేషం బాచరించి, కవల సంభావించి పరిరంభణంబు నిర్వర్తించిన, నయ్యేవురు నతని పాదంబులకుఁ బ్రణమిల్లి యాశీర్వాదంబులు వడసి. | 142 |
| సీ. |
అతిభక్తి గాంధారి యడుగుల కెఱఁగిన | నద్దేవి వారల నక్కుఁ జేర్చి దీవించె; వారుఁ గుంతీ చరణంబులు | ఫాలముల్ వొందంగఁ బ్రణతు లైనఁ దప్పక గ్రుచ్చి యందఱ నొక్క కౌఁగిటఁ | బొదివి యాశీర్వాదములు గ్రమమున నర్మిలిపెంపున నలరుమనంబుతో | వేర్వేఱ యిచ్చె నా వీరజనని |
|
| తే. |
ద్రుపద పుత్త్రికా ప్రభృతి వధూజనములు | తగు తెఱంగుల మామ నత్తలను వీడు కొనిరి వారును వారు నగ్గురు జనముల | నల్ల వలగొని చనిరి నృపాగ్రగణ్య! |
143 |
| క. |
చని పరిజనములుఁబౌరులు | ననుమోదము తోడఁ గొలువ నరిగిరి నగరం బునకున్ గన్నుల పండువు | జనపదముజనం బొనర్ప జనసంస్తుత్యా! |
144 |
| వ. | అరిగి సముచిత వర్తనంబుల నుండిరి; కొంతకాలంబు చనిన నొక్కనాఁడు నారదమునీంద్రుం డనుజనహితుం డై యున్న ధర్మతనయుకడకుఁ జనుదెంచిన, నజ్జననాథుండు దమ్ములుం దానును నమ్మహాత్మునకు భక్తిం బ్రణమిల్లి యాసనార్ఘ్య పాద్యాదిసత్కారంబు లొనర్చి తదీయ సమీపంబున నాసీనులై; రతని వదనంబు విలోకించి వినయం బెసంగ నమ్మహీపతి ‘మహా భాగ! యెందుండి రాక! యేదేశంబులఁ జరించితిరి? నేను మీకు నేమిపని సేయుదుఁ జెప్పుం ‘డనిన నప్పరమసంయమి యప్పుడమిఱేనితోడ. | 145 |