| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము |
| ఉ. |
రాజకులాగ్రగణ్య! మృగరాజపరాక్రమ! రాజరాజ! వి భ్రాజితశుభ్రకీర్తి పరిపాండుర సర్వదిగంతరాళ! ఘో రాజి ముఖోపలబ్ధ విజయ ప్రమదాశ్రిత బాహుదండ! ని స్తేజిత వైరివీర! కులదీప! మృడప్రియ! విష్ణువర్ధనా! |
161 |
| క. |
ఆదిక్షత్త్ర చరిత్ర! ధ | రాదేవాశీఃపరంపరావర్ధిత ని త్యోదయ! సత్యోదిత! విమ | లాదిత్యతనూజ! విక్రమాదిత్యనిభా! |
162 |
| తోటకము |
నిరవద్య! నరేశ్వర! నిత్యనిరం | తర ధర్మమతీ! గుణధామ! జగ త్పరిపూరిత కీర్తి విభాసి! విభా | కరతేజ! నృపోత్తమ! కాంతినిధీ! |
163 |
| గద్య. | ఇది సకల సుకవి జన వినుత నన్నయభట్ట ప్రణీతం బైన శ్రీ మహాభారతంబునం దాదిపర్వంబున ననుక్రమణికయును, బౌష్యోదంక మాహాత్మ్యంబును, భృగువంశకీర్తనంబు నన్నది ప్రథమాశ్వాసము. | 164 |