| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
ఘనపక్షానిలచలితా | వనిరుహములవలనఁ దొరఁగు వరపుష్పచయం బనిమిషజయార్థ మరిగెడు | వినతాసుతుమీఁదఁ బుష్పవృష్టియ పోలెన్. |
79 |
| వ. | ఇట్లమృతహరణార్థంబు గరుడండు గగనంబున కెగసిన, నట దేవలోకంబునందు. | 80 |
| మాలిని |
సురపతిసభఁ జూడం జూడ నంగారవృష్టుల్ గురిసెఁ గులిశధారల్ గుంఠితం బయ్యె, దిక్కుం జరమదము లడంగెన్, సర్వదిక్పాలకాంతః కరణములు భయోద్వేగంబునన్ సంచలించెన్. |
81 |
| వ. | ఇట్టి మహోత్పాతంబులు పుట్టిన, సురపతి బృహస్పతిం జూచి, ‘యిది యేమి నిమిత్తం?’ బని యడిగిన, దాని నంతయు నెఱింగి బృహస్పతి సురపతి కి ట్లనియె. | 82 |
| సీ. |
బ్రహ్మణ్యుఁ డగు కశ్యపబ్రహ్మవరమున | వినతకుఁ బుట్టిన యనఘమూర్తి వాలఖిల్యులదయ వరపక్షికులమున | క్రిందుఁ డై పరఁగిన యిద్ధతేజుఁ, డుదధిలో నున్న యత్యుగ్రనిషాదుల | నారంగ మ్రింగిన ఘోరవీరుఁ, డిభకచ్ఛపముల రోహిణశాఖతో నెత్తి | కొని దివిఁ బఱచిన యనిలవేగి. |
|
| తే. |
వీఁగి తనతల్లిదాస్యంబు నీఁగఁబూని | తడయ కమృతంబు గొనిపోవఁ గడఁగి వచ్చెఁ; గామరూపసంపన్నుండు, గామగమనుఁ | డతఁడు నీకు నసాధ్యుండు శతమఖుండ! |
83 |