| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
కడవఁబడి మున్ను వహ్నిం | గడుకొని పడినవియ కాని కద్రూసుతులం బడనీ నింక; నవశ్యము | నుడిగింతును సర్పయాగ; మోడకుఁ డింకన్. |
219 |
| వ. | అని యాస్తీకుండు వాసుకి ప్రముఖుల నాశ్వాసించి, సకలవేదవేదాంగపారగు లయిన విప్రవరులతో జనమేజయ సర్పసత్త్ర సదనంబునకుం జనుదెంచి, స్వదేహకాంతి సభాంతరంబెల్ల వెలుంగుచుండ స్వస్తివచనపూర్వకంబుగా ని ట్లని స్తుతియించె. | 220 |
| మ. |
రజనీనాథకు లైక భూషణుఁడ వై, రాజర్షి వై, ధారుణీ ప్రజ నెల్లన్ దయతోడ ధర్మచరితం బాలించుచుం, దొంటి ధ ర్మజు నాభాగు భగీరథున్ దశరథున్ మాంధాతృ రామున్ రఘున్ విజయుం బోలితి సద్గుణంబుల జగద్విఖ్యాత పారీక్షితా! |
221 |
| తరలము |
కువలయంబున వారి కోరిన కోర్కికిం దగ నీవు పాం డవకులంబు వెలుంగఁ బుట్టి, దృఢంబుగా నృపలక్ష్మితో నవనిరాజ్యభరంబు దాల్చిన యంతనుండి మఖంబులం దివిరి యిష్టధనంబు లిచ్చుటఁ దృప్తు లైరి మహాద్విజుల్. |
222 |
| ఉ. |
అమ్మనుజేంద్రుఁ డైన నలుయజ్ఞము, ధర్మజురాజసూయయ జ్ఞమ్ముఁ, బ్రయాగఁ జేసిన ప్రజాపతియజ్ఞముఁ, బాశపాణియ జ్ఞమ్మును, గృష్ణుయజ్ఞము, నిశాకరుయజ్ఞము నీ మనోజ్ఞ య జ్ఞమ్మును నొక్కరూప విలసన్మహిమం గురువంశవర్ధనా! |
223 |
| చ. |
వితతమఖప్రయోగవిధివిత్తము, లుత్తమధీయుతుల్ జగ న్నుత సుమహాతపోధను, లనుగ్రహనిగ్రహశక్తియుక్తు లీ క్రతువున ఋత్విజుల్, కమలగర్భసమానులు పూర్వదిక్పతి క్రతువున యాజకోత్తములకంటెఁ బ్రసిద్ధులు సర్వవిద్యలన్. |
224 |
| శా. |
విద్వన్ముఖ్యుఁడు, ధర్మమూర్తి, త్రిజగద్విఖ్యాతతేజుండు కృ ష్ణద్వైపాయనుఁ డేగుదెంచి, సుతశిష్యబ్రహ్మసంఘంబుతో సద్వంద్యుండు సదస్యుఁ డయ్యె ననినన్ శక్యంబె వర్ణింప; సా క్షాద్విష్ణుండవు నీవు భూపతులలోఁ గౌరవ్యవంశాగ్రణీ! |
225 |
| ఉ. |
ఆర్తిహరక్రియాభిరతుఁ డై, కృతసన్నిధి యై, ప్రదక్షిణా వర్త శిఖాగ్రహస్తముల వహ్ని మహాద్విజదివ్యమంత్రని ర్వర్తితహవ్యముల్ గొనుచు వారిజవైరికులేశ! నీకు సం పూర్తమనోరథంబులును, బుణ్యఫలంబులు నిచ్చుచుండెడున్. |
226 |
| వ. | అని జనమేజయు, నాతని యజ్ఞమహిమను, ఋత్విజులను, సదస్యులను, నగ్నిభట్టారకు ననురూప శుభవచనంబులఁ బ్రస్తుతించిన నాస్తీకున కందఱును బ్రీతు లయి; రంత జనమేజయుం డాస్తీకుం జూచి ‘మునీంద్రా! నీ కెద్ది యిష్టంబు దానిన యిత్తు, నడుగు’ మనినఁ గరంబు సంతసిల్లి యాస్తీకుం డి ట్లనియె. | 227 |
| ఉ. |
మానిత సత్యవాక్య! యభిమన్యుకులోద్వహ! శాంతమన్యుసం తానుఁడ వై దయాభినిరతస్థితి నీవు మదీయబంధు సం తానమనోజ్వరం బుపరతంబుగ, నాకుఁ బ్రియంబుగా మహో ర్వీనుత! సర్పయాగ ముడివింపుము; కావుము సర్పసంహతిన్. |
228 |
| చ. |
అనిన సదస్యులందఱుఁ బ్రియంబున ‘నిట్టి విశిష్ట విప్రము ఖ్యునకు మహాతపోధనునకుం దగుపాత్రున కెద్ది యిచ్చినన్ ఘనముగ నక్షయం బగును గావున నీ ద్విజనాథుకోర్కిఁ బెం పున వృథ సేయఁగాఁ దగదు భూవలయేశ్వర! యిమ్ము నెమ్మితోన్.’ |
229 |
| వ. | అనిన సర్వజనానుమతంబుగా జనమేజయుం డాస్తీక ప్రార్థనం జేసి సర్పయాగం బుడిగించె; నయ్యవసరంబున. | 230 |
| మ. |
అతులోర్వీసురముఖ్య మంత్రహుత మాహాత్మ్యంబునన్ వాసవ చ్యుతుఁ డై ముందర తక్షకుం డురువిషార్చుల్ దూల వాత్యారయో ద్ధతి నుద్ధూతవివర్ధితాయతబృహద్దావాగ్నివోలెన్ విచే ష్టితుఁ డై మేఘపథంబులం దిరుగుచుండెన్ విస్మితుల్‌గా జనుల్. |
231 |
| క. |
ఆతని నత్యుగ్రానల | పాతోన్ముఖుఁ డైన వానిఁ బడకుండఁగ ‘నో హో తక్షక! క్రమ్మఱు’ మని | యాతతభయుఁ గ్రమ్మఱించె నాస్తీకుఁ డెడన్. |
232 |
| మ. |
‘జననీశాపభయప్రపీడితమహాసర్పేంద్రులన్ సర్పయా గనిమిత్తోద్ధత మృత్యువక్త్రగతులం గాకుండఁగాఁ గాచె’ నం చును నాస్తీకమునీంద్రు నందుల సదస్యుల్ సంతసం బంది బో రనఁ గీర్తించిరి సంతతస్తుతిపదారావంబు రమ్యంబుగన్. |
233 |
| క. |
ఒనర జరత్కారు మునీం | ద్రునకు జరత్కారునకు సుతుం డైన మహా మునివరు నాస్తీకుని ముద | మునఁ దలఁచిన నురగభయముఁ బొందదు జనులన్. |
234 |
| వ. | మఱియు నయ్యాస్తీకు చరితంబు విన్నవారికి సర్వపాపక్షయం బగు నని. | 235 |