| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
పరమేష్ఠికల్పుఁ డగు న | ప్పరాశరుసమాగమమునఁ బరమగుణైకా భరణకు ననవద్యమనో | హరమూర్తికి సత్యవతికి నమ్మునిశక్తిన్. |
43 |
| క. |
సద్యోగర్భంబున నహి | మద్యుతితేజుండు వేదమయుఁ డఖిలమునీం ద్రాద్యుఁడు వేదవ్యాసుం | డుద్యద్‌జ్ఞానంబుతోడ నుదితుం డయ్యెన్. |
44 |
| క. |
ఆ యమునాద్వీపమున న | మేయుఁడు కృష్ణుఁడయి లీలమెయిఁ గృష్ణద్వై పాయనుఁ డనఁ బరఁగి వచ | శ్రీయ్శుతుఁడు తపంబువలనఁ జిత్తము నిలిపెన్. |
45 |
| వ. | పరాశరుండు సత్యవతి గోరిన వరంబు లిచ్చి నిజేచ్ఛ నరిగె; నంతఁ గృష్ణద్వైపాయనుండును గృష్ణాజిన పరిధాన కపిలజటామండల దండకమండలు మండితుం డై తల్లిముందట నిలిచి కరకమలంబులు మొగిచి మ్రొక్కి ‘మీకుం బనిగలయప్పుడ నన్నుం దలంచునది; యాక్షణంబ వత్తు’ నని సకలలోకపావనుం డఖిలలోక హితార్థంబుగాఁ దపోవనంబునకుం జని, యందు మహాఘోరతపంబు సేయుచు. | 46 |
| ఉ. |
సంచిత పుణ్యుఁ డంబురుహసంభవునంశము దాల్చి పుట్టి లో కాంచితుఁ డైనవాఁడు నిఖిలాగమపుంజము నేర్పడన్ విభా గించి జగంబులందు వెలిఁగించి సమస్తజగద్ధితంబుగాఁ బంచమవేద మై పరఁగు భారతసంహితఁ జేసె నున్నతిన్. |
47 |