| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - చతుర్థాశ్వాసము |
| క. |
వీరశ్రీవనితాశ్రిత | భూరిస్థిర బాహుదండ! బుధనుత సుగుణా ధార! కలియుగపవిత్ర! పు | రారాతి పదాబ్జపూజనాసక్తమతీ! |
227 |
| మత్తకోకిల |
దండితాహితవీర! సూరినిధాన! దానవినోద! కో దండపార్థ! పరాక్రమ ప్రియధామ! దిక్పరిపూరితా ఖండ పాండు యశోనిధీ! పరగండభైరవ! వైరివే దండ గండ విదారి ఘోరతరాసి భాసిభుజార్గళా!. |
228 |
| గద్య. | ఇది సకల సుకవిజన వినుత నన్నయభట్టప్రణీతం బయిన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబున శ్రీమహాభారత కథాప్రారంభంబును, వ్యాసుజన్మంబును, దేవ ధైత్య దానవ ముని యక్ష పక్షి గంధర్వాది నానా విధభూత సంభవంబును, దదంశావతారంబును, రాజవంశోత్పత్తియు, యయాతిచరితంబును నన్నది తృతీయాశ్వాసము. | 229 |