| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - చతుర్థాశ్వాసము |
| చ. |
ఇది మునినాథ కన్య యని యెంతయు నిఃస్పృహవృత్తి నున్ననా హృదయము రాజపుత్త్రి నని యిక్కమలాక్షి నిజాభిజాత్య సం పద నెఱిఁగించినన్ మదనబాణపరంపర కిప్పు డుండ నా స్పద మయి సంచలించె నళిపాత వికంపిత పంకజాకృతిన్. |
51 |
| వ. | అనుచు మదనాతురుం డయి దుష్యంతుండు దనయం దక్కోమలియనురాగం బుపలక్షించి యి ట్లనియె. | 52 |
| క. |
ఈ వల్కలాజినములకు | నీ వన్యఫలాశనముల కీ విటపకుటీ రావాసములకు నుచితమె | నీ విలసిత రూపకాంతి నిర్మలగుణముల్. |
53 |
| ఉ. |
ఈ మునిపల్లె నుండు టిది యేల కరం బనురాగ మొప్పఁగా భామిని! నాకు భార్య వయి భాసురలీల నశేషరాజ్య ల క్ష్మీ మహనీయ సౌఖ్యముల మేలుగ నందు మనిందితేందుపా దామలతుంగహర్మ్యముల హారిహిరణ్మయ కుట్టిమంబులన్. |
54 |
| సీ. |
‘బ్రాహ్మంబు దైవంబుఁ బరఁగ నార్షంబుఁ బ్రా | జాపత్యమును రాక్షసంబు నాసు రంబు గాంధర్వంబు రమణఁ బైశాచంబు | నను నెనిమిది వివాహములయందుఁ గడుఁ బ్రశస్తములు సత్‌క్షత్త్ర వంశ్యులకు గాం | ధర్వ రాక్షసములు ధర్మయుక్తి; నీకును నాకును నెమ్మిఁ బరస్పర | ప్రేమంబు గాముండు పెంపఁదొడఁగెఁ |
|
| ఆ. |
గాన యెడయుఁ జేయఁగా నేల? గాంధర్వ | విధి వివాహ మగుట వినవె యుక్త’ మనిన లజ్జఁ జేసి యవనత వదన యై | యాలతాంగి యిట్టు లనియెఁ బతికి. |
55 |
| క. |
కరుణానిరతులు ధర్మ | స్వరూపు లింతకు మదీయజనకులు సనుదెం తురు; వారు వచ్చి నీ కి | చ్చిరేని పాణిగ్రహణము సేయుము నన్నున్. |
56 |
| వ. | అనిన దానికి దుష్యంతుం డి ట్లనియె. | 57 |
| తే. |
తనకు మఱి తాన చుట్టంబు, తాన తనకు | గతియుఁ, ద న్నిచ్చుచోఁ దాన కర్త యనఁగ వనజనేత్ర! గాంధర్వవివాహ మతి ర | హస్యమును నమంత్రకమును నగుచు నొప్పు. |
58 |
| వ. | అని దుష్యంతుండు గాంధర్వవివాహస్వరూపంబు చెప్పి శకుంతల నొడంబఱిచిన నది యి ట్లనియె. | 59 |
| చ. |
నరనుత! నీ ప్రసాదమున నా కుదయించిన నందనున్ మహీ గురుతర యౌవరాజ్యమునకున్ దయతో నభిషిక్తుఁ జేయఁగా వరము ప్రసన్నబుద్ధి ననవద్యముగా దయసేయు నెమ్మితో; నిరుపమకీర్తి! యట్లయిన నీకును నాకును సంగమం బగున్. |
60 |
| వ. | అనిన విని శకుంతల కెంతయు సంతోషంబుగా దాని కోరిన వరంబిచ్చి, గాంధర్వవివాహంబున నభిమతసుఖంబు లనుభవించి, యక్కోమలి వీడ్కొని ‘నిన్నుఁ దోడ్కొనిరా నస్మత్ప్రధానవర్గంబుఁ గణ్వమహాముని పాలికిం బుత్తెంచెద’ నని యూఱడ నొడివి దుష్యంతుండు నిజపురంబునకుం జనియె; నిట శకుంతలయుఁ దనచేసినదాని మునివరుం డెఱింగి యలిగెడునో యని వెఱచుచుండె; నంత నమ్మహాముని వనంబుననుండి కందమూలఫలంబులు గొని చనుదెంచి, లలితశృంగారభావంబున లజ్ఞావనతవదనయు నతిభీతచిత్తయు నైయున్న కూఁతుంజూచి, తన దివ్యజ్ఞానంబున నంతవృత్తాంతంబు నెఱింగి, క్షత్త్రియులకు గాంధర్వవివాహంబు విధిచోదితంబ యని సంతసిల్లి శకుంతల కి ట్లనియె. | 61 |