| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | ‘కావున నీ విక్కుమారునిం దోడ్కొని నీపతిపాలికి నరుగు’ మని మహాతపోధను లైన తన శిష్యులం గొందఱఁ దోడువంచిన, శకుంతలయు దౌష్యంతిం దోడ్కొని దుష్యంతుపాలికి వచ్చి సకలసామంతమంత్రిపురోహిత ప్రధానపౌరజనపరివృతుండై యున్న యారాజుం గనుంగొని. | 67 |
| క. |
గురునాశ్రమంబునను ము | న్నరుదుగఁ బతివలనఁ గనిన యనురాగము నా దరణము ననుగ్రహంబును | గరుణయు సంభ్రమము నపుడు గానక యెడలోన్. |
68 |
| క. |
ఎఱుఁగ డొకొ నన్ను; నెఱిఁగియు | నెఱుఁగని యట్లుండునొక్కొ; యెడ దవ్వగుడున్ మఱచెనొకొ! ముగ్ధు లధిపులు | మఱవరె బహుకార్యభారమగ్నులు కారే. |
69 |
| చ. |
తలఁపఁగ నాఁడు పల్కినవిధం బెడఁ దప్పఁగ వీడె నొక్కొ చూ డ్కులు విరసంబులై కరము క్రూరము లైన నిమిత్త మేమియో? కలయఁగఁ బల్కరించి రుపకారులు నై రని నమ్మియుండఁగా వలవదు బుద్ధిమంతులు నవప్రియు లైన ధరాధినాథులన్. |
70 |
| వ. | అని తలంచి చింతాక్రాంత యై శకుంతల వెండియు నాత్మగతంబున. | 71 |
| క. |
మఱచినఁ దలఁపింపఁగ నగు; | నెఱుఁగని నాఁ డెల్లపాట నెఱిఁగింప నగున్; మఱి యెఱిఁగి యెఱుఁగ నొల్లని | కఱటిం దెలుపంగఁ గమలగర్భుని వశమే. |
72 |
| వ. | అయినను వచ్చి మిన్నక పోవంగాదు కావున నాపూర్వవృత్తాంతంబెల్ల నెఱింగించి యే నిక్కుమారుం జూపుదు’ నని మనంబున నిశ్చయించి శకుంతల యా రాజున కి ట్లనియె. | 73 |
| క. |
జననాథ! వేఁట నెపమున | గొనకొని కణ్వాశ్రమమునకున్ వచ్చి ముదం బున నందు నాకు నీయి | చ్చిన వరము దలంపవలయుఁ జిత్తములోనన్. |
74 |
| క. |
బాలార్కతేజుఁ డగు నీ | బాలుఁడు నీకొడుకు వీనిఁ బౌరవకుల ర త్నాలంకారు నుదార గు | ణాలయు యువరాజుఁ జేయు మభిషేకముతోన్. |
75 |