| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - పంచమాశ్వాసము |
| తరువోజ |
కురువంశ నిస్తారకుల ధర్మయుక్తిఁ గొడుకులఁ బడసి యి క్కురుకుంజరునకుఁ గరము మనఃప్రీతి గావించి పుణ్యగతికిఁ గారణమవై కమలాక్షి! నీవు దిరముగా నిష్టంబు దీర్చి; తే నిందు ధృతిఁ బతియిష్టంబు దీర్పన; కాన యరిగెదఁ బతితోడ నన్యలోకంబునం దైనఁ బ్రీతిసేయఁగఁ గాంతు ననియు. |
145 |
| వ. | ‘మఱియు మృగశాపభయం బెఱింగియు ని ట్లేమఱిన యతిప్రమత్తురాల; నే నిందుండి పుత్త్రుల రక్షింప నేర; నన్ను వారింప వలవదు; కొడుకుల నేమఱక రక్షించునది’ యని చెప్పి కుంతీదేవి వీడ్కొని మునిసహస్రంబునకు మ్రొక్కి మద్రరాజపుత్త్రి పతితోడన చితారూఢ యై యగ్నిశిఖల నపగత ప్రాణ యయ్యె; నంత నయ్యిరువుర యంగంబులు సంగ్రహించుకొని మహామునులు కుంతీదేవిం గొడుకుల నూరార్చి. | 146 |
| క. |
ధరణీరాజ్యవిభూతియు | పరిజనులను బాంధవులను బ్రజ విడిచి తప శ్చరణతపస్వుల తనకున్ | శరణం బని నమ్మి పాండుజనపతి నెమ్మిన్. |
147 |
| క. |
కొడుకుల నిందఱ కిల్లడ | యిడి పరలోకమున కరిగె; నెడసేయక యి ప్పుడ వీరలఁ గురువృద్ధుల | కడకుం గొని పోవ వలయు గజపురమునకున్. |
148 |