| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - షష్ఠాశ్వాసము |
| క. |
వ్యసనవివర్జిత! మాన | వ్యసగోత్రపవిత్ర! విష్ణువర్ధననృప! స ప్తసముద్రముద్రితాఖిల | వసుధాజనగీతకీర్తి! వాసవమూర్తీ!. |
260 |
| వనమయూరము |
రాజకులశేఖర! పరంతప! వివేక | భ్రాజిత! జగద్వలయభాసురసముద్య త్తేజ! నిరవద్య! యువతీమదన! వీరో | గ్రాజివిజయా! త్రిభువనాంకుశ! నరేంద్రా. |
261 |
| గద్య. | ఇది సకలసుకవిజనవినుతనన్నయభట్టప్రణీతం బైన శ్రీ మహాభారతంబునం దాదిపర్వంబున ధృతరాష్ట్ర పాండురాజుల వివాహంబును, బాండురాజదిగ్విజయంబును, బాండవధార్తరాష్ట్రసంభవంబును, బాండురాజు నిర్యాణంబును, గృపద్రోణజన్మకథనంబును, గుమారాస్త్రవిద్యాగ్రహణంబును నన్నది పంచమాశ్వాసము. | 262 |