| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - షష్ఠాశ్వాసము |
| సీ. |
ఉత్తమక్షత్త్రియుం డొరులదుఃఖంబులు | దలఁగంగఁ బుట్టిన ధర్మశీలుఁ; డలయక మృత్యుభయం బైనచో విప్రుఁ | గాచి సత్పుణ్యలోకములు వడయు; ధన్యుఁడై క్షత్త్రియు దయఁ గాచి బుధలోక | కీర్తనీయంబగు కీర్తి వడయు; వైశ్యశూద్రులఁ గాచి వసుధాతలస్థిత | సర్వప్రజానురంజనము వడయు; |
|
| ఆ. |
ననఘ! సన్మునీంద్రుఁ డయిన వేదవ్యాసు | వలన దీని నిక్కువముగ వింటి; బ్రాహ్మణులకుఁ బ్రియము పాయక చేయంగఁ | గాన్ప చూవె పుణ్యకర్మఫలము. |
286 |
| క. |
జననుత! బ్రాహ్మణకార్యము | సనఁ జేసిన బ్రాహ్మణప్రసాదంబున నీ కును నీతమ్ములకును నగు | ననవరతశ్రీసుఖాయురైశ్వర్యంబుల్. |
287 |
| వ. | అనిన విని ధర్మతనయుండు గుంతీదేవి కారుణ్యబుద్ధికి బ్రాహ్మణభక్తికి ధర్మనిత్యతకు సంతసిల్లి తానును భీమసేను నియోగించె; నంత భీముం డవ్విప్రున కి ట్లనియె. | 288 |
| ఆ. |
కడుపునిండఁ గుడువఁ గానమి రేయెల్లఁ | గన్నువొందకున్నఁ గరము డస్సి యున్నవాఁడ; నాకు నోపుదురేని యా | హారతృప్తిసేయుఁ; డట్టు లయిన. |
289 |
| ఆ. |
‘బలము పెద్ద గలిగి పాపిష్ఠు రక్కసుఁ | జంపి యిప్పురమున జనుల కెల్ల హర్ష మే నొనర్తు’ ననవుడు విప్రుఁడు | దానుఁ జుట్టములును దత్‌క్షణంబ. |
290 |
| తరలము |
పలుదెఱంగుల పిండివంటలుఁ బప్పుఁ గూడును నేతికుం డలు గుడంబు దధిప్రపూర్ణఘటంబులుం గొనివచ్చి యీ నలఘుసత్త్వుఁడు మారుతాత్మజుఁ డన్నిటన్ గతఖేదుఁడై బలము గల్గి కడంగె నప్పుడు బ్రాహ్మణార్థము సేయఁగన్. |
291 |