| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - సప్తమాశ్వాసము |
| సీ. |
అనవద్యు వేదవేదాంగ విశారదు | జప హోమ యజ్ఞ ప్రశస్తు సత్య వచను విప్రోత్తము వర్గచతుష్టయ | సాధనసఖు సదాచారు సూరి సేవ్యుఁ బురోహితుఁ జేసిన భూపతి | యేలు నుర్వీతలం బెల్ల; నిందుఁ బరలోకమునఁ బుణ్యపరుల లోకంబులు | వడయు; జయస్వర్గఫలము సూవె |
|
| ఆ. |
రాజ్య; మదియు నుర్వరాసురవిరహితుఁ | డయిన పతికిఁ గేవలాభిజాత్య శౌర్యమహిమఁ బడయ సమకూరునయ్య తా | పత్య! నిత్యసత్యభాషణుండ!. |
61 |
| వ. | మీరు ధర్మానిలశక్రాశ్వినులవరంబునం బాండురాజునకుం గుంతీమాద్రులకుం బుట్టినవారలు ధర్మవిదులరు; వేదవేదాంగ ధనుర్వేదపారగుం డయిన భారద్వాజు శిష్యుల; రఖిలలోకహితులరుం గావునం బురోహిత రహితులరై యుండఁ దగదు. | 62 |
| ఆ. |
పాండుపుత్త్ర! నీవు బ్రహ్మచర్యస్థుండ | వగుటఁ జేసి మన్మథార్తు నన్ను నొడిచి తిందు రాత్రి యుద్ధంబు సేసి; కా | మోపభోగనిరతుఁ డోటు వడఁడె? |
63 |
| వ. | మఱియుఁ గామ ప్రవృత్తుం డయ్యును మహీపతి మహీసురవరపురస్సరుం డగు నేని యెల్ల యుద్ధంబుల శత్రుల జయించు. | 64 |
| ఉ. |
వేదము వేదియుం గలుగు విప్రవరేణ్యుఁ డగణ్యపుణ్య సం పాది పురోహితుం డయినఁ బాపము పొందునె భూపతిం బ్రతా పోదయ! కాన మీదగు గుణోన్నతికిం దగ ధర్మతత్త్వ సం వేదిఁ బురస్కరింపుఁడు పవిత్రచరిత్రు మహీసురోత్తమున్. |
65 |
| తే. |
అనిన వానికి నర్జునుం డనియె ‘మమ్ము | ననఘ! తాపత్యు లని పల్కి తతిముదమున నేము కౌంతేయులము మఱి యెట్లు సెప్పు | మయ్య తపతి కపత్యుల మైన తెఱఁగు’. |
66 |