| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - సప్తమాశ్వాసము |
| సీ. |
ధరణీశ నందనుల్ ద న్నతిప్రీతితోఁ | జూచుచు నుండంగ సుందరాంగి తోయజదళనేత్ర ద్రుపదరాజాత్మజ | కమనీయ గజరాజగమనలీలఁ జనుదెంచి సురరాజసన్నిభు నభినవ | యౌవనోద్భాసితు నసితరత్న రుచిరాంగు నంగజరూపు ధనంజయుఁ | దనచేతి సితపుష్పదామకమునఁ |
|
| ఆ. |
బొలఁతి ముదముతోడఁ బూజించె; నట్టియు | త్సవముఁ జూచి దాని సైఁప కపుడు కౌరవేంద్రుఁ డాదిగాఁ గల భూపతు | లెల్ల నలిగి కలయు నేపు రేఁగి. |
189 |
| మత్తకోకిల |
ఏల రాఁ బనిచెన్ మహీశుల నెల్లఁ జుట్టమపోలె ము న్నేల సత్కృతిఁ జేసె నిందఱ? కిమ్మహారథు లుండఁగా నేల కన్యక నిచ్చె విప్రున కిందు నేఁడు శఠుండు పాం చాలుఁ, డిప్పుడ వీని నిర్గతసత్త్వుఁ జేయుద మాజిలోన్. |
190 |
| క. |
తన విద్య పేర్మి నృపనం | దనఁ బడసెను విప్రుఁ; డితని తప్పే? కడుదు ర్జునుఁ డీ ద్రుపదుఁడు నృపతుల | ననయంబున మెచ్చఁ డయ్యె నతిగర్వితుఁడై. |
191 |
| వ. | ‘ఏమిదోషంబు సేసియు బ్రాహ్మణుండు వధ్యుండు గాఁడు; మన రాజ్యంబును నర్థంబును బ్రాహ్మణార్థంబ; కావున న వ్విప్రుతోడి దేమి? యని ద్రుపదుపయి నెత్తుదెంచిన, ద్రుపదుండును కడుభీతుం డై బ్రాహ్మణుల మఱువు సొచ్చె; నిట్లు శరణాగతుం డయిన ద్రుపదు నోడకుండు మని బ్రాహ్మణులు దమ తమ దండాజినంబు లెత్తికొని ప్రతిబలంబులపయి వీచుచున్నంత, వారలం జూచి నగుచు నర్జునుం డి ట్లనియె. | 192 |
| క. |
కడఁగి మదీయాస్త్రము లని | యెడు పటుమంత్రముల నిప్పు డీ నృపురిపుల న్కడిఁది విషాహుల దర్పం | బుడిగించెదఁ దొలఁగి చూచుచుండుఁడు మీరల్. |
193 |