| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - సప్తమాశ్వాసము |
| శా. |
రాజత్కీర్తులు వచ్చి కాంచి రనఘుల్ రాముండు గృష్ణుండు న య్యాజామీఢు నజాతశత్రు నృపలోకారాధ్యు నుద్యద్గుణ భ్రాజిష్ణుం దమ మేనయత్త కొడుకున్ బాలార్కతుల్యోజ్జ్వల త్తేజున్ భ్రాతృచతుష్కమధ్యగతుఁ గౌంతేయాగ్రజున్ ధర్మజున్. |
217 |
| వ. | కని త మ్మెఱింగించి యతిస్నేహంబున నయ్యుధిష్ఠిరునకుం గుంతీదేవికి మ్రొక్కి భీమార్జుననకుల సహదేవులం గౌఁగిలించుకొని, పరమసమ్మదరసపూరితహృదయు లై యున్న, వారల కుశలం బడిగి ధర్మరా జి ట్లనియె. | 218 |
| క. |
ఒవ్వమిఁ గౌరవులకుఁ గడు | దవ్వయి మఱి విప్రవేషధారుల మయి మ మ్మెవ్వరు నెఱుంగకుండఁగ | నివ్విధమున నున్న నెట్టు లెఱిఁగితి రీరల్. |
219 |
| వ. | అనిన నగుచు వాసుదేవుం డి ట్లనియె. | 220 |
| ఉ. |
అంబుజమిత్రుఁ డంబుదచయాంతరితుం డగుడుం దదీయ తే జంబు జగజ్జనంబులకు శక్యమె కప్పఁగ; మీరు గూఢభా వంబున నున్న మీదగు నవారితతేజము భూజనప్రసి ద్ధం బగుఁ గాక; దానిఁ బిహితంబుగ నెవ్వరుఁ జేయనేర్తురే. |
221 |