| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - అష్టమాశ్వాసము |
| క. |
విద్యావిలాస! పార్థివ | విద్యాధర! నిఖిలరాజవిద్యానిధి! శీ తద్యుతి విశదయశః ప్రస | రద్యోతిత సర్వలోక! రాజమహేంద్రా! |
289 |
| స్వాగతము |
రాజరాజ! గుణరాజిత! రాజ | త్తేజ! రాజకులదీప! విశిష్టాం భోజమిత్ర! నృపపూజిత పాదాం | భోజ! భూవినుత! పుణ్యవరేణ్యా! |
290 |
| గద్య. | ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్ట ప్రణీతం బైన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబున ధృష్టద్యుమ్న ద్రౌపదీసంభవకథనంబును, గృష్ణద్వైపాయనసందర్శనంబును, గంగాతీరంబున నంగారపర్ణు నర్జునుండు జయించుటయుఁ, దాపత్యవసిష్ఠౌర్వోపాఖ్యానంబును, ద్రౌపదీస్వయంవరంబును, బంచేంద్రోపాఖ్యానంబును, ద్రౌపదీవివాహంబును నన్నది సప్తమాశ్వాసము. | 291 |