| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - అష్టమాశ్వాసము |
| క. |
అనవుడు నిద్దఱుఁ దమలోఁ | బొనుపడ కొండొరులతోడ భుజబలు లలుకన్ ఘనవజ్రతనులు దాఁకిరి | తనరఁగ నటఁ గొండ గొండఁ దాఁకినభంగిన్. |
111 |
| క. |
విపరీతమతిని సుందుఁడు | నుపసుందుఁడుఁ దాఁకి పొడిచి రొండొరుతోడం గుపితాత్ము లయి తిలోత్తమ | నెపమున దృఢముష్టిఘాతనిర్ఘాతములన్. |
112 |
| క. |
అన్యోన్యప్రియభాషణు | లన్యోన్యహితైషు లసుర లన్యులపోలెన్ మన్యుపరిప్రేరితు లై | యన్యోన్యాభిహతిఁ జనిరి యమపురమునకున్. |
113 |
| క. |
ఇంతుల నిమిత్తమున ధృతి | మంతులుఁ బొందుదురు భేదమతి గావున మీ రింతయు నెఱింగి యొండులు | చింతింపక సమయ మిందు సేయుఁడు బుద్ధిన్. |
114 |