| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - అష్టమాశ్వాసము |
| వ. | కావున వ్రతదానంబు నా కనుగ్రహింప వలయు’ నని మ్రొక్కి యర్జునుం డగ్రజు వీడ్కొని గురుజనానుమతుం డై యఖిలవేదవేదాంగపారగు లైన బ్రాహ్మణులు ననేకశాస్త్రవిదు లయి వివిధకథాకథనదక్షు లయిన పౌరాణికులును దనకు సహాయులుగా నరిగి సకలతీర్థసేవచేయుచు నయ్యైతీర్థంబులందు. | 124 |
| ఆ. |
ధరణిసురుల గురులఁ బరమయోగుల మహా | భాగు లయిన యట్టి భాగవతుల రాజవంశవరుఁడు పూజించుచును వారి | వలనఁ బుణ్యకథలు వెలయ వినుచు. |
125 |
| క. |
గంగాధర పింగజటా | సంగమ మంగళ విశాల చటుల తరంగన్ గంగానది సేవించెను | గంగాద్వారమున విగతకల్మషుఁ డగుచున్. |
126 |
| వ. | అందు నిత్యంబును గంగాస్నానంబు సేసి తత్తీరంబున హోమంబు సేయుచు వాసవసుతుండు మహీసురవర సహితుం డయి కొన్ని దివసంబులు వసియించి, యొక్కనాఁడు ప్రభాతంబ విధిపూర్వకంబునం గృతాభిషేకుం డయి దేవర్షి పితృతర్పణంబులు సేసి. | 127 |