| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ప్రథమాశ్వాసము |
| శా. |
భక్తాంభోరుహ బాలసూర్య! దనుజ ప్రధ్వంసనాచార్య! సు వ్యక్తావ్యక్త నిజప్రకార! సదయ వ్యాపార! దాంతిక్షమా సక్త నిత్య స్వీకృత! వేదపరిషత్సంస్తుత్య! మాయా విని ర్ము క్త ద్యోతన! తార్‌క్ష్యశాక్వర మహామూర్తి స్ఫురత్కేతనా! |
398 |
| క. |
భవదుఃఖ భరనిరాస | ప్రవీణ! నానాభిధాన! పారాశర్య స్తవనీయ ఓరుగంటి గుణ నిధాన! స | మవబోధ నిరంతరా విదాత్మాధీనా! |
399 |
| మాలిని |
ప్రకృతి పురుష యోగీ! భక్తతాత్పర్య రాగీ! సకృప హృదయపద్మా! శాంతి చిత్తైక సద్మా! వికృతి రహితమూర్తీ! విశ్వభూత ప్రవర్తీ! సుకృత ఫలమయాత్మా! సుస్థిరానంద వర్త్మా! |
400 |
| గద్యము | ఇది శ్రీమదుభయ కవిమిత్త్ర కొమ్మనామాత్య పుత్త్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన శ్రీమహాభారతంబున శాంతి పర్వంబు నందుఁ బ్రథమాశ్వాసము. | 401 |
| శాంతిపర్వంలో ప్రథమాశ్వాసం సమాప్తం. | ||