| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము |
| మ. |
పరమాయుః పరమార్థసిద్ధి పరమ ప్రావీణ్య సంపాద నా దర సంభావిత భక్తలోక! నిగమాంతస్ఫీత హర్మ్యా గ్ర సం చరణ ప్రౌఢమయూర! చిత్రమహిమా! సర్వాత్మ విజ్ఞాన సం పరిపాక ప్రకటాకృతీ! శమదమోద్భావాహిత స్వీకృతీ! |
447 |
| క. |
యమనియమాద్యష్టాంగ | క్రమాభ్యసన నిర్మథిత వికార సుచేతః కమలామోద మయాత్మా! | సమతా రాహిత్య శస్య! సర్వనమస్యా. |
448 |
| మాలిని |
సమధిక నిరవద్య స్వైరనిత్య ప్రభుత్త్వా! విమల మహిమ హేలావిర్భవత్సర్వ సత్త్వా! నమదమలినచిత్తౌన్నత్య దీవ్యన్మహత్త్వా! దమమహిత తపస్సద్భావ సంవేద్యతత్త్వా! |
449 |
| గద్యము | ఇది శ్రీమదుభయ కవిమిత్త్ర, కొమ్మనా మాత్యపుత్త్ర, బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతం బైన శ్రీమహాభారతంబున శాంతి పర్వంబునందు ద్వితీయాశ్వాసము. | 450 |
| శాంతిపర్వంలో ద్వితీయాశ్వాసం సమాప్తం. | ||