పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - తృతీయాశ్వాసము
సముద్ర సరిత్సంవాదము (సం. 12-114-2)
తే. ‘ఉదధి సుఖగోష్ఠి నున్నపు నదులతోడ | ‘మీ తటంబుల తరువులు మీరు వొంగి
తఱిమిపాఱినఁ గూలు వేతసము లేల | పెఱికిపో వవి మీ కేమి ప్రియ మొనర్చె?
86
వ. వాని నున్మూలింప మీకు శక్యంబు గామిం జేసియో వానికిం జేటు వాటిల్ల; దిది యేమి?’ యనవుడు నదులందు గంగ యిట్లనియె. 87
క. ‘బిగు వెడలక నిలిచి పడున్‌ | నగములు వేతసచయంబు నమ్రంబై పె
ల్లగు మా వేగము గడపి యె | సఁగు బూర్వస్థితిన బ్రదుకు సమకూరంగన్‌.
88
వ. అనియె నా ప్రబ్బలిచెట్ల తెఱంగు కనికొని. 89
ఆ. అరి నృపాలు పెంపు నాత్మీయశక్తియు | నెఱిఁగి మూర్ఖవృత్తి నెదురుపడక
యుచిత వృత్తి నతని యుద్ధతి మేవడిఁ | గడపి హీనబలుఁడు సెడక నిలుచు.
90
వ. అనిన విని యుధిష్ఠిరుండు ‘దగుపదంబులకుఁ గులవంతు లగు పరిజనులు దొరకొనకున్న నరనాథుం డేమి సేయం గలవాఁ? డని యడిగిన నప్పుడమిఱేనికి భీష్ముం డిట్లనియె. 91
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )