| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
తపము నిదానము ధర్మ | ప్రపంచమున కెల్ల; దానిఁ గ్రమమున వ్రతతం త్రపరాయణు లొనరింతు ర | ధిప! ఫలమూలాంబువృత్తిఁ దృప్తిఁ బొరయుచున్. |
413 |
| క. |
విను మశన నిగ్రహము దప | మను నభిధానంబు గల మహాధర్మము త ద్ధనవంతు చిత్తవశగతిఁ | జను నఖిల స్థావరములు జంగమతతులున్. |
414 |
| తే. |
పంచవిధవృత్తులగు మహాపాతకములు | లోనుగాఁ గిల్బిషము లెల్ల లుంఠితంబు లగుఁ దపంబున సత్యశౌచాదు లొలయు | నఖిలసిద్ధులు నఱచేత నావహిల్లు. |
415 |
| వ. | అనిన విని ‘దేవ పితృ భూదేవగణంబులు సత్యంబు ప్రశంసించుఁ దదీయ స్వరూపంబును నది దొరకొను తెఱంగును నెఱింగింపు’మని యడిగిన నజాతశత్రునకు శంతనుపుత్రుం డిట్లనియె. | 416 |