| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - తృతీయాశ్వాసము |
| చ. |
‘విను మొక బ్రాహ్మణుండు కులవృత్తము పెంపుఁ దొఱంగి బోయదా నినొకత నాలిఁ జేసికొని, నెమ్మిఁ గిరాతులఁ గూడి వేఁటకుం జనుఁ దిను మాంస మద్దురితసక్తుఁడు భోగపరుండు గావునన్ ధనము ఘటింపఁగాఁ దగు విధం బని చూచి వణిగ్జనంబుతోన్. |
472 |
| వ. | చెలిమిసేసి కొందఱు గోమట్లు బేహారంబు వెంట దేశాంతరంబునకుం జనఁ దానును వారితోడం గూడి పోవం బోవ గిరిగహన దుర్గమస్థలంబున నొక్క వనగజంబు. | 473 |
| ఆ. |
సాతులోని కుఱికి జనముల నున్మద | లీల నేలఁ బెట్టి కాలఁ జమరఁ జొచ్చుటయును భీతివిచ్చి నల్దిక్కులఁ | బఱచి రెల్లవారుఁ బటు రయమున. |
474 |
| క. |
ఆయనయుఁ గాందిశీకుం | డై యుత్తర దిక్కు వాఱె నతి దూరముగా; నా యెడ నొక మార్గము గని | పోయెను దాను నట పోవఁ బోవం గెలనన్. |
475 |
| తే. |
పొదల తఱచున జొంపమై పొడవుఁ బఱపుఁ | గలిగి వట్రువఁదనమునఁ జెలువు మిగిలి యున్న వటభూరుహముఁ గని యుల్ల మచట | నిలువఁ గోరిన నామ్రాని నీడఁ జేరి. |
476 |
| క. |
వనలతల కుసుమగంధము | గొని సుడివడు గాడ్పు డప్పిఁ గొండొక దేర్పం దనుపార నచటఁ గూర్చుం | డె నతం డట్లుండ నచ్చటికి లలితగతిన్. |
477 |
| వ. | ఒక్క మహాబకంబు వచ్చె; నది పద్మభవునకుం బ్రసాద పాత్రం బగుచు నాడీజంఘుండును రాజధర్ముండు నను పేళ్ళం బరఁగు; నాకొక్కెరకు నమ్మఱ్ఱి నివాసంబై యుండు నప్పక్షి యట్లేతెంచి యవ్విప్రునిం గాంచి ప్రియంబు దలకొను చూడ్కి నాదరించి. | 478 |
| క. |
‘ఎందుండి యేమి పనికై | యెందుల కరిగెదవు భూసురేశ్వర! ప్రీతిం బొందితి నినుఁ గని; తగియెడు | వింద వయితి నాకు; నీదు విధముం జెపుమా!’ |
479 |
| వ. | అని యడిగిన నతం ‘డేను మధ్యదేశీయుండ’ గౌతముండ నొక్క మహనీయ చరిత్రుని పుత్త్రుండ; నాలస్యంబున వేదాధ్యయనాది విప్రకర్మ విరహితుండ నయి కామలోలత్వంబున బోయత యిల్లాలుగా బోయలం గలిసియుండి, పేదఱికంబునకు నలసి బేహారంబు వెంట నొక్కసాతుం గూడి పరదేశంబున కరుగుచోట గిరి గహన దుర్గమ ప్రదేశంబున. | 480 |
| క. |
వనకరియొక్కటి యా సా | తునకుఁ గవిసి జనచయంబుఁ ద్రుంపఁ దొడఁగుడున్ విను మెల్లవారునుం గను | కనిఁ బఱచిరి భీతి నేను గాననభూమిన్. |
481 |
| ఆ. |
పఱచి దిక్కు దప్పి భాగ్యంబు కల్మి నీ | దైన నిలయమునకు నరుగుదేరఁ గంటి’ ననిన ‘మేలుగాక! నీ దారిద్ర్య | మపనయింతుఁ; జింత యపనయింపు. |
482 |
| వ. | అంతకు నియ్యాతిథ్యంబుఁ గయికొను’ మని రుచిమంతంబులగు మందాకినీ మీనంబులు సుపక్వంబులు సేసి, మధురంబు లగు వన్యఫలంబులు దెచ్చి తృప్తియగునట్లుగా నతనికి నాహారవిధి యొనర్చి, రాత్రి యగుటయుం బల్లవ పుష్పసాంద్రం బగు శయనంబు గల్పించి యబ్బకపతి యద్ధరణీసురుని తోడి సముచిత సల్లాపంబులను సుఖనిద్రను నా రాత్రి గడపి వేగుటయు, నవ్విప్రు నాలోకించి. | 483 |
| క. |
‘విను! మిత్రుండును రజతముఁ | గనకము బుద్ధియును నాల్గుకారణములు మ ర్త్యు ని దారిద్ర్యము వాయుట | కని దేవగురుండు సెప్పె నన్నిటిలోనన్. |
484 |
| క. |
మిత్రుం డెక్కుడు కాశ్యప | పుత్రుఁడనగు నేను నీకు భూసురవర! స న్మైత్రి యనుష్ఠించెద నటె | పాత్రము గాకుండుదే యపార శ్రీకిన్. |
485 |
| తే. |
నా సఖుండు విరూపాక్ష నామధేయుఁ; | డతని పురము మధువ్రజ; మదియు మూఁడు యోజనము లిచ్చటికి; దాని కుల్ల తెరువు | వట్టి వేచని యాదైత్యభర్తఁ గనుము. |
486 |
| క. |
కాంచి యతనితో నేఁ బు | త్తెంచితినని చెప్పు; మతఁ డతిప్రీతుండై కాంచనమును రత్నంబులు | నంచితుఁగాఁ జేసి యిచ్చు నప్పుడ నీకున్.’ |
487 |
| క. |
అని యప్పురి దెస సెప్పినఁ | జని యాతం డతనిఁ గాంచి సముచిత భంగిన్ వినిపించె రాజధర్మున | కనుగలమగు సఖుఁడ ననియు నతని పనుపునన్. |
488 |
| తే. |
అరుగుదెంచితి ననియు, ధనార్థిననియు, | నిట్లు వినిపించుటయు, రాక్షసేశ్వరుండు దేఱకొనఁజూచి, యాత్మ నిప్పాఱుఁ డధముఁ | డగుట దోఁచుచు నున్నది; యడుగ వలయు. |
489 |
| వ. | అని తలంచి. | 490 |
| క. |
‘కులమును విద్యయు వృత్తముఁ | గల రూ పెఱిఁగింపు’ మనినఁ గలఁగక తన్నుం దెలియంగఁ జెప్పె విప్రుం | డలఘుం డగు నసురపతియు నవికృతుఁ డగుచున్. |
491 |
| క. |
ఇతఁ డెట్టిఁ డైన నేమగు? | నతనికి సఖుఁ డట్టె బకమహత్తర సఖ్యం బితనిం బాత్రముఁ జేయదె! | యితనికిఁ దృప్తి యగునట్టు లిత్తు ధనంబుల్.’ |
492 |
| వ. | అని నిశ్చయించి యతనికి నాహార సంఛాదనంబులు సమీచీనంబుగా నిర్వర్తింపఁ దగువారి నియోగించి, మఱునాఁడు కార్తికపౌర్ణమాసియైన భూసుర సహస్రంబులు దన గృహంబునం బసిండిపళ్ళెరంబుల భోజనంబులు సేయను, బహుళ దక్షిణలు ప్రతిగ్రహింపనుం గల నైమిత్తిక క్రియానుష్ఠానంబులు గలిగిన నమ్మహాజనంబులలోఁ గలిపి యత్యంతాదరంబున. | 493 |
| క. |
మహనీయ బహుళపూజా | సహితంబుగ భోజనంబు సంతృప్తిగ న మ్మహితాత్ముండు నడపి దు | ర్వహ భారముగాఁగ గనకరాశియు మణులున్. |
494 |
| చ. |
కుడిచిన పళ్ళెరంబును నకుంఠిత హర్షముతోడ నిచ్చినం గడుముదమంది యెత్తికొని గాఢభరంబున మార్చి మోవఁగా మెడయును వీఁపు మూఁపులును మిక్కిలి నొవ్వునఁ గొంకు వోవ నె క్కుడు వెస నేఁగుదెంచెఁ గని కొక్కెర సమ్మదమంద మఱ్ఱికిన్. |
495 |
| తే. |
అట్లు సంతోషమునఁ దేలి యతని డప్పి | వోవ బకవల్లభుఁడు పక్షపుటయుగమున నల్ల వీచి యాహార సమర్పణంబు | సేసి నిసి యైన, సుఖనిద్ర సేయుచుండ. |
496 |