| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - పంచమాశ్వాసము |
| వ. | అనిన విని భరితాదరుండై వేదవ్యాస మునీశ్వరుం డమ్మహనీయున కిట్లనియె. | 36 |
| క. |
‘కాలములకు భూతములకు | నాలంబనభూత మగు మహామహిమఁ గ్రియా లీల వెలింగెడు నప్పర | మాలోకం బెందు నిష్క్రియాత్మక మయ్యెన్. |
37 |
| వ. | అది భావనీయంబు. | 38 |
| క. |
వినుము! నిమేషంబులు పదు | నెనిమిది యగుఁగాష్ఠ; గాష్ఠ లిరువదియుం దో డన పదియుం గళ; యఱువది | యును మున్నూఱుఁ గళలై ముహూర్తము నడచున్. |
39 |
| తే. |
మూఁడు పదులు ముహూర్తముల్ మోహదూర! | యగు నహోరాత్ర; మట్టివి యన్ని గూడ మాస; మవి రెండు ఋతు వను మహితసంజ్ఞఁ | బరఁగు; ఋతువు లాఱైన వత్సరము వత్స! |
40 |
| తే. |
అందు మూఁడేసి ఋతువుల కయననామ | కంబు లగు; నుత్తరాఖ్య మొకండు దక్షి ణాభిధాన మొక్కటియు గుణాభిరామ! | యవి యహస్సును రాత్రియు ననఁగఁ బరఁగు. |
41 |
| వ. | అది యోగిజనుల నిర్దేశంబు. | 42 |
| తే. |
అనఘ! యుత్తరదక్షిణాయనము లమ్మ | హాత్ము లగ్నియు ధూమంబు నండ్రు; మఱియు వినుము! శుక్లంబుఁ గృష్ణంబు ననుట గలుగు | సుగతి కగతికి హేతువు లగుటఁ జేసి. |
43 |
| క. |
నరుల నెలలు నేఁడులు ఁ బితృ | సురులకు దినము లగు నండ్రు సూరులు వరుసం బరఁగు కృత త్రేతా ద్వా | పర కలియుగ వత్సరముల భంగిఁ దెలిపెదన్. |
44 |
| వ. | ఆకర్ణింపుము. | 45 |