| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - పంచమాశ్వాసము |
| వ. | జనకుని కడకు మాండవ్యుండు వచ్చి వితృష్ణత్వశిక్షఁ గోరిన న మ్మేదినీశ్వరుం డాదరభరితుండై. | 374 |
| సీ. |
‘అర్థముల్ దుఃఖదోషాకరంబులు విను | మేమిటిపై నాశ లేమిఁ జేసి పొరయవు నను దుఃఖములు మునినాయక! | మిథిల గాలంగ నేమియును నాకుఁ గాలని య ట్లుండెఁ; గామసుఖంబును | దివ్య సుఖంబునుఁ దృష్ణ విడుచు సుఖముఁ బోలునె? యర్థసులభత తోడన | గోవుతోఁ బెరిఁగెడు కొమ్ములట్లు |
|
| తే. |
తృష్ణ దానును పెరుఁగుఁ; దదీయ శక్తి | మమత గలుగు మా బంధులు మా ధనములు మా నివాసంబు లనమి మమత్వ మెదఁ ది | రంబు గాకున్న నింకుఁ దృష్ణాంబురాశి. |
375 |
| క. |
దొరకొన్న ననుభవించుచు | దొరకొనమికిఁ జింతనొంది దురపిల్లక ని ర్భరుఁడై యున్ననుఁ దృష్ణకుఁ | జొరవచ్చునె యతని మనసు సువ్రతశీలా! |
376 |
| తే. |
విడువరాదు దుర్మతులకు నొడలు ముదియఁ | దాను ముదియదు ప్రాణాంతమైన రోగ మనఘ! తృష్ణ వర్జితకాముఁడై నతండు | దానిఁ బోఁద్రోచి సౌఖ్యసాంద్రత్వ మొందు. |
377 |
| క. |
శోక ప్రమదాది ద్వం | ద్వాకులుఁ డవుఁ గాక శాంతి నంతఃకరణ శ్రీకిఁ బరిరక్ష సేయుము; | నీకు వితృష్ణత్వసౌఖ్యనిత్యత గలుగున్.’ |
378 |
| క. |
అని చెప్పిన నమ్ముని య | మ్మనుజపతిం బ్రస్తుతించి మనము ప్రశాంతిం బనుపడఁగఁ బ్రీతి వీడ్కొని | చని వర్తిల్లెను వితృష్ణసరణిఁ గుమారా! |
379 |