| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము |
| ఉ. |
మాన మదాదిదోష పరిమార్జన నిర్మల చిత్త భక్త స న్మానసలోల! వీత పరిమాణ విభూతి విశాల! శాంతతా హీన విదూర! విశ్వహితహేల విచార! నిరామయావ్యయ స్థానక సిద్ధిమంగళ విధాయక! వేద సభైకనాయకా! |
226 |
| క. |
అనపేక్షిత ఫలతా శో | భన మహనీయ క్రియా విపాకాత్మక రూ ప! నితాంత ధూత సంశ్రిత | జనపాపా! పరమ మిత్త్ర! సత్యాలాపా! |
227 |
| మాలిని |
తరుణ జరఠ భావ ద్రావణోదారమూర్తీ! హరణ కరణ నిర్మూలానతాభ్యంతరార్తీ! మరణ జనన దుఃఖోన్మాద హృత్పుణ్యకీర్తీ! చరణ కమల పూజాశాలి చిత్తానువర్తీ! |
228 |
| గద్యము | ఇది శ్రీమదుభయ కవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన శ్రీమహాభారతంబున నశ్వమేధ పర్వంబునందుఁ తృతీయాశ్వాసము. | 229 |
| అశ్వమేధపర్వంలోని మూడవఆశ్వాసం సమాప్తం. | ||