| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | అశ్వమేధపర్వము - చతుర్థాశ్వాసము |
| సీ. |
‘ఇవ్విషయంబున నెందుఁ బ్రసిద్ధతం | బరఁగెడు నట్టిది ధరణినాథ! వినుతేతిహాసంబు వినుము చెప్పెద; నగ | స్త్యుండు పండ్రెండేండ్లు సువ్రతాభి రతిఁ జేయు మహితాధ్వరమునకు దివ్యాను | భావంబు గలయట్టి పరమమునులు వేడ్క ఋత్విజులయి వెలయ నిజప్రౌఢి | నఖిల తంత్రంబులు నాచరింప; |
|
| తే. |
నా సమయమున వర్షింపఁ డయ్యె నింద్రుఁ | డోషధులు వికలత్వంబు నొందె; దానిఁ జూచి యత్తపోధను ‘లగస్త్యునకు నన్న | దానవిధు లెట్లు చెల్లునో తగు విధమున. |
261 |
| వ. | ఇతండు ద్వాదశవార్షికం బైన దీక్షా విశేషంబు నొందినవాఁడు; ధర్మమార్గాగతం బయిన ద్రవ్యంబు దక్కనొండు వినియోగింపండు; వానయుం గురియ; దని ముచ్చిరి తమలోఁ బలుకు పలుకులు ప్రతాపదీపితుం డగు నక్కుంభసంభవుం డాలించి వారలతో నిట్లనియె. | 262 |
| ఉ. |
‘న్యాయము గల్గి యధ్వరమునందు విఘాతము పుట్టకుండఁ దాఁ డోయదకోటిఁ బన్చి హరి తుష్టిగ వృష్టి యొనర్పకున్న నే నా యమరేంద్రతం గొని మహాద్భుత వృత్తి జగంబుఁ బ్రోచెదన్; మీయెదఁ జింత దక్కుఁడు సమిద్ధతపఃపరులార! నా దెసన్. |
263 |
| క. |
కాదేనిఁ ద్రిజగముల బహు | ళోదార ద్రవ్యకోటు లున్న యునికి మీ పాదముల పరిసరమునకుఁ | దే దొరఁకొను; నశ్రమమునఁ దెచ్చెద వానిన్. |
264 |
| తే. |
అంత చేయంగవలయునే యన్న ననఘు | లార! యుత్తర కురుభూము లారఁ బండి యున్నయవి; యాగ కాలోచితాన్నమునకు | వలయు ధాన్యముల్ తలఁపున వచ్చు నిందు.’ |
265 |
| వ. | అని పలికి వెండియు. | 266 |
| క. |
‘ఆ జాలియేల? నిర్మల | బీజహవిస్తంత్ర మేను బ్రీతి నొనర్పం గా జగతి వఱపునం జెడు | నే? జన్నము విఘ్నపడునె? యేటికి వగవన్.’ |
267 |
| సీ. |
అన విని ‘నీవు ధర్మాగతి సంసిద్ధ | వస్తుదాయిని; నిరవద్య తపము వ్యయముగా నీ కేల వాసవుపై కిన్క? నఖిల జగద్ధన మాహరించి కొననేల? యుత్తర కురుభూములందలి | ధాన్యంబు లేల? సన్మాన్యబీజ హుతములందు ఫలేచ్ఛ యోజింప నేల? మా | కై యిన్ని దెఱఁగులయందుఁ బాఱె |
|
| తే. |
నీదు చిత్తంబు; దీని వినిశ్చయముగఁ | జేసి సుఖి వగు; మేము మా చేసినట్టి సుకృతములఁ దెచ్చికొందుము సులభములుగ | వలయు నాహారములు; లోకవందనీయ!’ |
268 |
| మ. |
అని సల్లాపము సేయుచుండఁగ ననేకాంభోదజాలంబులన్ బనిచెం బెల్లుగ వర్షముల్ గురియఁగాఁ బర్జన్యుఁ డా ప్రొద్ద; తా నును నాచార్యుఁ బురస్కరించికొని నన్నుం గావవే యంచు న మ్మునిశార్దూలునిఁ గానవచ్చె వినయంబున్ భక్తియుం దోఁపఁగన్. |
269 |
| ఉ. |
వచ్చిన గారవించి, యనవద్యపు టర్చన లిచ్చి సంయముల్ మెచ్చఁగ శాంతసద్వచనలీలఁ బ్రమోద మొనర్చి యాతనిం బుచ్చె సురేజ్యయుక్తముగఁ బోఁడిగఁ గ్రమ్మఱ వేల్పువీటి కా సచ్చరితుండు; లోకమును సంతస మందె; వెలింగె జన్నమున్. |
270 |
| తే. |
క్రతు సమాప్తి సమయమున నతఁడు వినయ | భరితుఁఢై యోగ్యభంగి నప్పరమ మునుల కర్చ లిచ్చి యామంత్రణ మాచరింప | వారుఁ బ్రీతి నేఁగిరి నిజావాసములకు. |
271 |