| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
తలపడి నానాస్త్రము ల | గ్గలికం గురియుటయు నతఁడు కాండము లా ఱి ట్టలమైన యలుక నాతని | లలితోరస్ స్థలమునం గలయ నాటించెన్. |
320 |
| చ. |
తెరలక లక్ష్మ ణుండు దృఢదీప్తశరావలి పార్థుపట్టిపైఁ దొరఁగఁగఁజేసినం గినిసి తొల్త హయంబులఁ జంపి సారథిన్ ధరఁ బడ నాతఁ డేసె విరథత్వము నొందియు నీదు మన్మఁ డు ద్ధురగతి శక్తి వైవ నది ద్రుంచె మహేంద్రునిమన్మఁ డమ్ములన్. |
321 |
| ఆ. |
శక్తిఁ ద్రుంచి తీవ్రసాయక హతదేహుఁ | జేయఁ దొడఁగు నతని చేతి బలుపు సూచి కృపుఁడు రాజసుతుఁ దన తేరిపై | నిడి తొలంగఁ దెచ్చె నెల్లఁ జూడ. |
322 |
| క. |
కురురాజు యోధవీరులఁ | బురికొలుపుచు భీష్ముఁ డపుడు పోరికి నడరం గరిహయనరశరనిబిడత | ధరణి జలదనిబిడగగనతలముం బోలెన్. |
323 |
| ఉ. |
సాత్యకి యప్పు డేచి శరజాలము చిత్రలఘుస్ఫుటత్వ సాం గత్య విరాజమానముగఁ గౌరవసేనఁ గలంగఁ జేసి యౌ ద్ధత్యమునం దనర్చిన నుదాత్తమనస్కుఁడు సౌమదత్తి యా హుత్యభిరామవహ్ని క్రియ నుజ్జ్వలుఁ డై వెసఁ దాఁకె నాతనిన్. |
324 |
| చ. |
తలపడి యంత్య కాల శిఖిదారుణభంగి నమేయమార్గణా ర్చులు వరగించుడున్ భయము సొచ్చి జనార్దనుతమ్ముతోడి యో ధులు పిఱుసన్నఁ దత్సుతులు దోర్బలదుర్దములై పదుండ్రు న గ్గలి నెదిర్చి యి ట్లనిరి కౌరవసత్తముతో నుదగ్రతన్. |
325 |
| క. |
‘భూరిశ్రవసుఁడ! యెక్కటి వీర | వినోదంబు సలుపు వేడుకమెయి దు ర్వారత వచ్చితి మొక్కరుఁ గోరి | కొనుము సంగరమునకున్ మాలోనన్.’ |
326 |
| చ. |
‘అన విని నవ్వి యొక్కఁడు మదస్త్రబలంబున కోర్వఁ డోపినన్ సునిశిత బాణముల్ వఱపి సూరెల నందఱు నొక్కపెట్ట యే పు నెఱపుఁ’డన్న నా రథికపుంగవు లేయ నతండు నమ్ము లె ల్లను దునుమాడి వారిఁ జటులస్ఫురితాంబక వృష్టి ముంచినన్. |
327 |
| క. |
పొలి వోని శౌర్య రేఖం | జెలఁగుచు వార్‌ష్ణేయు లతనిఁ జేడ్పడఁ బెక్క మ్ముల నొవ్వ వేసినం గడు | నలిగి శరాసనము లెల్ల నాతఁడు ద్రుంచెన్. |
328 |
| క. |
కోదండదశకశీఘ్ర | చ్ఛేదం బొనరించి యపుడ శిరములు పదియున్ భూదేవికి బలిగా ని | ష్పాదించెన్ గౌరవేంద్రుబలములు సెలఁగన్. |
329 |
| వ. | ఇట్లు వడిన కొడుకులం గని వృష్ణివీరుండు. | 330 |
| చ. |
వగపును గోపముం గదుర వైరిబలంబు దలంకఁ దేరు పై నొగనొగ దాఁకఁగాఁ బఱపి నుగ్గుగఁ గౌరవసూతు నేసి బె ట్టుగఁ దురగంబులం దునుముడున్ వెస నాతఁడు నట్ల చేసెఁ బా టిగఁ గరవాలముల్ గొని వడిన్ దిగి నేలకు దాఁటి రిద్దఱున్. |
331 |
| వ. | అట్టి సమయంబున. | 332 |
| ఆ. |
వేగ మెయిది వృష్ణివీరు భీముఁడు గురు | వీరుఁ గురువిభుండు గారవమున వెనుకఁ జనఁగఁ దివిచి తనతన రథముపైఁ | బెట్టికొనుచుఁ దొలఁగఁ బ్రీతిఁ జనిరి. |
333 |
| వ. | అంత. | 334 |
| క. |
‘అపరాహ్ణసంగతుండగు | తపనుంగని పొద్దు గ్రుంకెఁ దడ వేఁగుదు రీ రిపు లని కడంగి నరుఁ డ | స్త్ర పరంపర వఱపి నీదు రథికుల నెల్లన్. |
335 |
| వ. | నిహతులం జేయుచు విహరించుచున్నం గనుంగొని. | 336 |
| క. |
సైరింపక యేడ్తెఱఁ గురు | వీరాగ్రణి యిరువదేనువేల రథంబుల్ పోరికిఁ బురికొలిపిన వి | స్ఫారగతిం గూడి కవిసెఁ బార్థునిమీఁదన్. |
337 |
| క. |
కడు వెసఁ గవిసినయవి గ | వ్వడి బాణజ్వాల లడర వడి దావాగ్నిన్ మిడుతలు వొలిసిన క్రియఁ బొడి | పొడి యయ్యెం గురుబలంబు పొం గడఁగంగన్. |
338 |
| క. |
కిరణంబు లడఁగి యంతకు | నరుణత్వము మెఱయఁ దరణి యపరాద్రిశిర స్ఫురణను నధికరణాలం | కరణం బొనరించుటయును గాంగేయుఁ డెదన్. |
339 |
| క. |
‘శ్రాంతం బయ్యెను వాహన | సంతానం బెల్ల నిపుడు సంధ్యాసమయం బింతట నేఁటికి నని సా | లింతము గా కింకఁ బోర లెస్సై యున్నే?’ |
340 |
| వ. | అని తలంచి కుంభసంభవాది యోధముఖ్యుల కెఱింగించి బలంబులఁ దివియ నియమించి. | 341 |
| క. |
సమరక్రీడన లీలం | దమక తమక తనిసి మరలి తమతమ యావా సములకు నరిగి రుభయసై | న్యములజనంబులును దీవియలు వెలుఁగంగన్. |
342 |
| తే. |
రెండు వీళ్ళ జనంబులు రేలు వివిధ | హృద్యసంగీతములను సాహిత్యమధుర లలితగోష్ఠీ వినోదంబులను బ్రమోద | భరితు లై ప్రొద్దు వుత్తురు భరతముఖ్య! |
343 |