| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
కడువడిఁ జని యంతంతం | బుడమిఁ బడిన కరులగములు వొరలుటకతనన్ వడముడి యరిగిన తెరు వే | ర్పడఁ గని వేవేగ రథము వఱపెం గదియన్. |
369 |
| వ. | ఇట్లు భీమసేనుఁ జేరం బోయి. | 370 |
| క. |
‘ఇదె యేనుఁ గూడ వచ్చితిఁ | బదిలుఁడ వై పోరు మింక బకమర్దన! యీ కదిసిన వీరులనెల్లం | గుదియించెద’ ననుచుఁ గవిసెఁ గురువితతిపయిన్. |
371 |
| క. |
అత్తఱి నీ తనయుం డెలుఁ | గెత్తి రథికవరులతోడ నిట్లను నీదు ర్వృత్తునిఁ బొదువుఁడు భీముని | యుత్తలపా టుడుపుకడఁక నుడుపుఁడు గడిమిన్.’ |
372 |
| వ. | అనిన విని యోధవీరులగు కుమారులు నొకపెట్ట ధృష్టద్యుమ్నుం బొదివిన నతండుఁ ద్రోణదత్తప్రమోహన బాణంబున వారి నందఱ నిశ్చేష్టితులం జేసిన నప్పుడు దప్పి దీర్చుకొన నెడగని యనిలనందనుం డొక్క మడువున మధురశిశిర జలంబులఁ బానంబు సేసి యుల్లసిల్లి యా ద్రుపదపుత్త్రుం గూడికొనియె నట్టియెడ నాచార్యుండు గయ్యంబు సేయుమునుమున ధృష్టద్యుమ్నుండు దొలంగిన తెఱపిం గదియఁ బాంచాలపతిఁ దఱిమిన నప్పు డగ్గురుండు నవ్వుచు. | 373 |
| తే. |
అస్త్రవర్షంబుఁ గురియంగ నతఁడు పూర్వ | వైరబంధంబుకతన దుర్వార మైన యతని రోషంబు సైరింప నలవిగాక | జడిసి పోయిన నాతండు శంఖమొత్తె. |
374 |
| వ. | ఇట్లు ద్రోణుండు ద్రుపదుం దెరల్చి ధృష్టద్యుమ్ను చనినవల నరసి తదీయ ప్రమోహనమార్గణమూర్ఛితం బయిన శూరలోకంబు నాలోకించి కరంబు రయంబునఁ బోయి. | 375 |
| క. |
వినుతప్రజ్ఞాబాణం | బున మోహనబాణశక్తి వోఁ జేసిన సం జనిత ప్రాణోజ్జ్వలు లై | యనికిం గ్రమ్మఱ గడంగి రయ్యోధవరుల్. |
376 |
| వ. | ఇవ్విధంబున నాచార్యు ప్రాపునం జేసి యేచి నీ కొడుకులు పవనద్రుపదుల కొడుకులపై నడరినం గని యుధిష్ఠిరుండు గేకయు లేవురను ద్రౌపదేయులను ధృష్టకేతునిం జూచి మీ రభిమన్యుండు ముంగలిగా రథంబులు వఱపి భీమసేన ధృష్టద్యుమ్నులకుఁ దోడుపడుం డని పంచిన. | 377 |
| క. |
ఆ పన్నిద్దఱు సైన్యా | టోపసమేతముగఁ గవియుడును బాంచాల క్ష్మా పాలుసుతుఁడు భీముఁడు | నేపారిరి నీదుసేన యెసకం బడఁగన్. |
378 |
| వ. | తదవసరంబున. | 379 |
| తే. |
‘క్రందుఁ గయ్యంబులోన నరాతిభయద | బాహువిక్రమ! నీ విట్లు పాదచారి వగుట వల దని కేకయునరద మెక్కఁ’ బనిచె భీమునిఁ బాంచాలపతిసుతుండు. |
380 |
| క. |
అప్పుడు మధ్యందినమున | నొప్పినయినుతోడఁ జాల నొర వచ్చి గురుం డప్పాండవబలములపైఁ | దెప్పదెరలఁ గురిసె శరతతిం దీవ్రముగన్. |
381 |
| చ. |
కనుఁగొని పార్షతుం డపుడు గట్టుపకాసయి వీఁకఁ దాఁకినం దునిమె నతండు తద్ధనువుఁ దోడన పెక్కు శరంబు లేసె నా తని మెయి నొండువిల్లు ద్రుపదక్షితిపాలసుతుండు గ్రక్కునం గొని శరసప్తతిం గురిసి కోపముఁ బెంచిన నాతఁ డుగ్రతన్. |
382 |
| క. |
ఆ విల్లు ద్రుంచి రౌద్రర | సావేశంబొప్ప నాలుగమ్ముల రథవా హావలిని సూతు నొక్కట | దేవగణము వొగడ వసుమతిం బడ నేసెన్. |
383 |
| మ. |
విరథుండై యభిమన్యు తేరిపయికిన్ వేగంబ పాంచాలభూ వరసూనుం డరుగం దదీయబల మోర్వం జాల కొక్కుమ్మడిన్ మరలంబాఱె నతండు వాయుసుతుఁడున్ మానింప మానింప న ప్డు రథానీకముతోడ భీముఁ బొదివెన్ భూమీశ్వరుం డుద్ధతిన్. |
384 |