| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
శరములు గురుపతిమీఁదం | గురిసిన నతఁ డతని మేనఁ గ్రూరాస్త్రంబుల్ సరభసమున నింపఁగ స | త్వరముగ నాద్రుపదసుతుఁడు దచ్చాపంబున్. |
25 |
| వ. | తుండంబులు గావించి. | 26 |
| క. |
మఱియు నొక విల్లు గొను న | త్తెఱపిన విరథుఁడుగఁ జేయ ధృతిఁ గరవాలం బుఱక గొని విభుఁడు నేలకు | నుఱికి యతనిమీఁద నడరె నుగ్రాకృతియై. |
27 |
| వ. | అట్టియెడ సౌబలుండు రయంబున నెయిది యన్నరపతిం దనరథంబు మీఁదికిఁ దిగిచికొని పోయె. సాత్యకి యలంబుసుని నలఘు విశిఖ వృష్టిం బొదివిన నద్దనుజుం డర్ధచంద్రబాణంబున దద్బాణాసనంబు దుండంబులు సేసి యంగమ్ముల వాలమ్ములు గీలించి మాయ లొనర్చి యతిఘోరంబుగాఁ బేర్చిన నా శినివంశవరుం డచలుం డై యైంద్రాస్త్రప్రయోగంబున నమ్మాయ మాయించి యతని వెగడుపఱచిన నతఁడు వెఱచఱచి పఱచిన నయ్యాదవసింహుండు సింహనాదంబు సేసి కురుబలంబులపయిం గవిసెనప్పుడు. | 28 |
| క. |
కృతవర్మ యేచి మారుత | సుతుపయిఁ దఱుముటయుఁ నతఁడు సూతునిఁ దురగ ప్రతతిం బడనేసి మహో | ద్ధతి మార్గణమయముసేసెఁ దద్గాత్రంబున్. |
29 |
| వ. | ఇట్లు విరథుండును విశిఖక్షతదేహుండు నై యతం డేదు వెన్‌రిఁగి నట్లు నీదు మఱందియగు వృషకు నరదంబుమీఁది కరిగె, ననిలతనయుండును మనగజఘటలపైఁ బటురయంబునం దనరథంబుఁ బఱపె’ ననిన విని ధృతరాష్ట్రుండు సంజయున కి ట్లనియె. | 30 |
| క. |
‘విఱుగుట నొచ్చుట మనదెసఁ | దఱచుగ నాడెదవు పాండుతనయులబల మే డ్తెఱ దఱుఁగక పెనఁగుట పలు | మఱుఁ జెప్పెద వకట! యేమి మాయయొ తలఁపన్. |
31 |
| వ. | అనిన విని సంజయుం డతని కిట్లను ‘మనవారు దా మోపినభంగిఁ బెనంగుదురు. సముద్రంబుసొచ్చిన యేఱులుంబోలెఁ బాండవసేనం జొచ్చి తమ దర్పంబులు మెఱయలే రది తప్పుగాఁ గొనరాదు. నీ తప్పునఁ బాటిల్లిన చేటునకు శోకింపం బని లేదు. సమరప్రకారం బవధరింపు మవంతిదేశాధీశులగు విందాను విందులం బటుబాణపరంపరలం గప్పి యుధామన్యుం డేచి యనువిందు విరథుం జేసిన నతండు విందు స్యందనం బెక్కుటయు, నప్పాంచాలవంశవరుండు. | 32 |
| క. |
విందుని సారథి నొక కో | లం దునిమిన వాహములు గలంగంబడి పా ఱెం దేరు దిగిచికొని మగు | డం దద్బలమెల్లఁ దల్లడముఁ బొందె వడిన్. |
33 |
| వ. | అట్టి సంకులసమరంబున. | 34 |
| క. |
భగదత్తు నేనుఁ గడరిన | వెగడునఁ బాండవులమొనలు విఱుగుటయు మహా నగ మేటివేగ మాఁగిన | పగిది ఘటోత్కచుఁడు దాని పరు వుడిగించెన్. |
35 |
| సీ. |
దనుజేంద్రు నిలుచుట గని సైన్య మెప్పటి | యట్టుల పురికొని యనికిఁ జొచ్చె నాఘటోత్కచుఁడు బాణావళి వఱపిన | భగదత్తుఁ డదియెల్ల మగుడఁ జేసి పటుతోమరంబులు పదునాలు గడరింప | నవి ద్రుంచి డెబ్బది యమ్ములేసి యసుర యార్చినఁ బేర్చి యాతఁడు విరథుఁ జే | సిన వాఁడు శక్తి వైచిన నతండు |
|
| తే. |
నడుమఁ దునుమాడి వడిఁ బెక్కునారసముల | నొంప దైత్యుండు నముచి నిలింపపతికిఁ బాఱిన ట్లోడి పాఱె నబ్బలము గడిమి | నెగచెఁ బ్రాగ్జ్యోతిషాధీశుఁ డిభముఁ బఱపి. |
36 |
| ఆ. |
శల్యుమీఁద గవలు శరవృష్టి గురిసిన | నగుచు, విరథుఁ జేసె నకులు నతఁడు వార లప్పు డొక్క తే రెక్కి యడరిన | రౌద్ర మెసఁగ నొంచె మద్రవిభుఁడు. |
37 |
| చ. |
ధృతి బలుపొప్ప నిల్చి సహ | దేవుఁడు వ్రేఁకని నారసంబు గ్రూ రత నుర మాడనేయ నది | రక్తము సోఁకక యుచ్చిపోవుడున్ మృతుఁడునుబోలెఁ దేరిపయి | మేటిమగండగు మద్రమేదినీ పతి వడినం గలంగె నర | పాలక! కౌరవరాజ సైన్యముల్. |
38 |
| వ. | ఇట్లు మూర్ఛితుం డయినశల్యుం జూచి సారథి రథంబు దొలంగందోలికొనిపోయినం గనుంగొని కవలు సింహనాదంబు సేసి, శంఖంబులఁ బూరించి రంతం గమలబాంధవుండు దివసమధ్యోపేతుం డయ్యె నట్టి సమయంబున యమసూనుండు శ్రుతాయువుపైఁ దొమ్మిదియమ్ములు నిగిడించిన నతండు వాని మగిడించి నిశాతసాయకసప్తకంబు శరీరంబున గ్రుచ్చినం గోపించి యుధిష్ఠిరుండు వరాహకర్ణశరాసారంబున వాని వక్షస్ స్థలంబు వ్రచ్చి వెడందవాతియమ్మునం గేతువుం దునిమిన నతండు. | 39 |
| ఉ. |
వెండియు నేడు బాణములు వే తొడి ధర్మజు నొవ్వ నేయ నా తండు మహోగ్రకోపమునఁ దత్తురగంబులఁ జంపి తద్ధను ర్దండముఁ ద్రుంచి తత్తనువు రక్తమయంబుగఁ జేయ వాఁడు భీ తుండయి పాఱె నీబలము దూలఁగ నబ్బల ముబ్బి క్రాలఁగన్. |
40 |