| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - తృతీయాశ్వాసము |
| ఆ. |
అట్లు దాఁ కుటయు బకాంతకుఁ డంత్యకా | లాంతకుండు వోలె నలిగి బొమలు ముడివడంగ నొక్క వెడఁ దయమ్మునఁ దల | నఱికి వైచి పెలుచ నవ్వె నధిప! |
72 |
| వ. | ఇట్లు సునాభుండు వడుట గనుంగొని కోపాటోపంబునఁ దత్సోదరులగు నాదిత్యకేతుండును, నపరాజితుండును, బహ్వాశియుఁ, బండితుండును, గుండధారుండును, విశాలాక్షుండును, మహోదరుండును వృకోదరుపై నొక్కపెట్ట కదిసి పెక్కు విధమ్ములగునమ్ములం బెక్కింట నొప్పించిన నప్పాండవ వీరుండు రోషాతిభీషణుండై యేరికిం దేఱి చూడ రాక పటుభల్లంబున, నతినిశితక్షురప్రముఖంబున, శితప్రదరంబున, శాతక్షురికాముఖంబున, దీప్తార్ధ చంద్రాంబకంబున, ఖరనారాచంబునఁ గ్రూరబాణంబునఁ నక్కుమారసప్తకంబు సమవర్తి సమీపంబున కనిచినం దక్కటికుమారు లుక్కుదక్కి వెఱఁగుపడి యంతంత నొదిఁగిన. | 73 |
| తే. |
‘నాఁడు సభ నాడినంతయు నేఁడ చేయు | నట్టు లున్నాఁడు మొనతల ననిలసుతుఁడు విదురుపలుకులు దలకూడె వేయు నేల? | యనుచు వెఱఁ జూచుచుండిరి మనుజపతులు. |
74 |
| క. |
‘నీవు తనూజుల దుర్విన | యావేశం బుడుపవైతి వది దుర్దశలం గావింప నింకఁ జావక | పోవచ్చునె వారి కనిలపుత్రుని చేతన్. |
75 |
| వ. | అది యట్లుండె నప్పుడు సుయోధనుండు దనచుట్టు నున్న యోధవీరులం గలయం గనుంగొని భీమసేను మార్కొనం బంచి భీష్ము కడకుం జని శోకగద్గదకంఠుం డగుచు నతనితో ని ట్లనియె. | 76 |
| ఉ. |
‘ఇమ్మెయిఁ గిట్టి వాయుసుతుఁ | డేపునఁ గోలుమసంగి పొంగి నా తమ్ములఁ జంపఁగా నకట! | తప్పక చూచెదు గాని రోషశో కమ్ములు లేవు తోడుపడఁ | గా దని నిల్చితొ యున్నవారు నొ క్కుమ్మడిఁ జావఁ గోరి యిటు | లూరక యుండితొ కౌరవోత్తమా!’ |
77 |
| వ. | అనిన విని నదీసూనుండు దాను నెదురు శోకించి యతని కి ట్లనియె. | 78 |
| క. |
‘ఇది మున్న యేను ద్రోణుఁడు | విదురుండును జెప్పినదియ విన వప్పుడు బె ట్టిదు లగుపాండుతనూజుల | కెదు రై నిర్జింప వశమె? యీశున కైనన్. |
79 |
| తే. |
మనకుమారులలోన నయ్యనిలతనయు | బారి కగపడువాని నెవ్వారి కైనఁ గావఁ దలకొన శక్యంబు గాదు మనకు | నడలఁ బనిలేదు దీనికి నధిపతనయ! |
80 |
| క. |
వీరస్వర్గము ధనముగఁ | బోరుము నీ వింక నొండుబుద్ధు లుడుగు మేఁ బోరెద నోపినమెయిఁ దెగి | పోరఁగ జయమైన దానిఁ బోఁ ద్రోచెదమే! |
81 |
| వ. | అనియె నని చెప్పిన విని వైచిత్రవీర్యుండు. | 82 |
| తే. |
‘గురుఁడు భీష్ముడుఁ గలుగంగఁ గురుకుమారు | లిట్టు వొలిసెదరే మున్నయింతవట్టు! దల్లియును నేనుఁ జెప్పినఁ బొల్ల సేసి | దాని ఫల మిప్పు డా సుయోధనుఁడు గనియె. |
83 |
| వ. | ఇంక నమ్మాటలాడుట గతజలసేతుబంధనంబు దానిం జాలింపు మట్లు కురుకుమారులచావు గనుంగొని గాంగేయకుంభసంభవులు పదంపడి యేమి సేసి రని యడుగుటయు, సూతనందనుం డంబికా నందనున కిట్లను, భీష్ముండు భయంకరాకారుం డై మారుతిపయిం దేరు వఱపె, నతనిం గని ధర్మనందనుండు సేయివీచిన ధృష్టద్యుమ్నశిఖండిసాత్యకులు దలకడచి యతనితోఁ దలపడి రంతకు మున్న దుర్యోధనుపనుపునఁ గవిసిన రథికులమీఁదం జేకితాన ద్రౌపదేయసహితంబుగా సవ్యసాచి యడరె. నభిమన్యుండును హైడింబుండును ధార్తరాష్ట్రులదెసం దఱిమి రిత్తెఱంగున మూఁడు గట్టిమొత్తమ్ములు బెట్టిదంబు సేయ మన బలంబులుం బోక పెనంగుచుండె; నట్టియెడ. | 84 |
| క. |
ద్రోణాచార్యుఁడు ద్రుపద | క్షోణీశ్వరుమోహరంబు సుడివడ దివి గీ ర్వాణులు గీర్తింపఁగఁ బటు | బాణపరంపర లనేకభంగులఁ బఱపెన్. |
85 |
| క. |
కరిఘటలు మీఁద భీముఁడు | సరభసముగ నేయునారసంబుల మ్రో డై ధరఁ బడి రూపఱినను దిన | కరుకరములఁ దమము విరియుగతిఁ దోఁచె నృపా! |
86 |
| క. |
అఱిముఱి గుఱ్ఱపుదడముల | కుఱికి కవలు రౌద్రరసమహోగ్రాకృతు లై నఱకిన నచ్చట రథములు | వఱపఁగరాదయ్యె నుభయబలయోధులకున్. |
87 |
| తే. |
నరుఁడు రథికజనంబుపై సరభసముగ | నేయఁ గేయూరహారతత్కాయశకల వితతి నిల యొప్పె రాలినవివిధ పుష్ప | పుంజమునఁ బొల్చు నుద్యానభూమి వోలె. |
88 |
| వ. | అప్పు డిరావంతుండు. | 89 |
| క. |
తురగనికరంబుతోడం | గురుసైన్యము దఱియఁ జొచ్చుకోల్తల సూడం గర మొప్పె ఘనవిహంగో | త్కరముపయిం గవియు డేగతండంబుగతిన్. |
90 |
| వ. | ఇ ట్లుక్కు మిగిలి యెక్కినయర్జుననందనుం గనుంగొని శకునితమ్ములు శుకుండును, శర్మవంతుండును, వృషకుండును, నార్జవుండును, గజుండును, గవాక్షుండును, గుఱ్ఱపు మొత్తంబులతో నగ్గలిక నతనిపై వాహనంబులం బఱపి పిఱుదివియక రాయిరాయి దాఁకినట్లు దాఁకి రయ్యిరువాఁగును విచిత్రంబుగాఁ బోర నయ్యార్వురు గాంధారకుమారులు నయ్యిరావంతుం బొదివి సెలకట్టెలవాట్ల డొంకెనపోట్ల నొప్పించిన బరిగోలలపోటులు దాఁకినం గినిసిన గంధగజంబు చందం బై. | 91 |
| ఆ. |
అతఁడు ధన్వి యగుట నశ్వంబుఁ దొలఁగ దాఁ | టించి తిరిగి యా కడిందిమగల నారసములు పెక్కు నాటించి నొప్పించి | వెగడుపఱిచె సురలు వొగడుచుండ. |
92 |
| వ. | అట్టియెడ. | 93 |
| క. |
మునుపోటులఁ బడినొచ్చుటఁ | దనగుఱ్ఱము వడినఁ బడక ధరణికి లంఘిం చెను వెఱపు లేక పే రు | క్కునఁ బటుఖడ్గంబు వెఱికికొనుచు రయమునన్. |
94 |
| వ. | ఇట్లు భూచారి యయిన భుజగరాజదౌహిత్రుం జూచి యేచి యా సుబలసూనులు సుట్టుముట్టి. | 95 |
| క. |
పొడువఁగ వ్రేయఁగ నతఁడుం | గడునుఱ వగు నేర్పు కడిమికలిమిం దనపైఁ బడకుండఁ గృపాణమ్మునఁ | గడుఁజిత్రపుగతుల జడిసెఁ గైదువు లెల్లన్. |
96 |
| వ. | ఆ రౌతులు వీఁడు గాలుమానిసి యగుటం జేసి మనకు నొప్పింప వెరవుగాదయ్యెడు’ నను దుర్విచారంబున. | 97 |
| ఆ. |
ఆర్వురును గడంగి హయముల డిగి పటు | ఖడ్గదీప్తు లడరఁ గదియుటయును బ్రమరి తిరిగి వారిఁ బండ్రెండుదునియలు | సేసి క్రీడికొడుకు సెలఁగి యార్చె. |
98 |
| క. |
వెక్కస మందుచుఁ గురుపతి | రక్కసుతో ననియె ‘నియ్యురగ దౌహిత్రుం డొక్కఁడ మన సైన్యంబు | ల్సక్కడఁచుచు నున్నవాఁ డలంబుస! కంటే.’ |
99 |