| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | మౌసలపర్వము - ఏకాశ్వాసము |
| క. |
మఱి కొంతసేపునకుఁ దె | ప్పిఱి లేచి ముకుందు మేను పెద్దయునుం బ్రొ ద్ది ఱియం గౌఁగిటఁ జేర్చెం | బఱివోయిన తాల్మి నూష్మబాష్పము లురులన్. |
163 |
| క. |
అనుచరులలోని భూసురు | లనునయవచనములఁ దేర్ప నతఁ డంకిలి దే ఱినమతితో నశ్రులు మఱి | యును గ్రమ్మం గరతలమున నొత్తుచుఁ జూచున్. |
164 |
| ఉ. |
‘ఏమిట నిట్టులయ్యె నొకొ? యిమ్మహితాత్మకుఁ’ డంచు నున్మిష ద్ధామములైన యంగములఁ దాఁ గలయం బరికించి యోగిహృ ద్యామల పాదపద్మగత మైన విశేషము చూచి రుద్రతే జోమయుఁ డైన సంయమి వచోగతి గాంచి సువిస్మితాత్ముఁడై. |
165 |
| క. |
అవికృతమును రుచిరమునై | యవయవములు నిదుర వోయినప్పటి క్రియ నుం డ వఱలు కృష్ణుని దేహం | బవిరత చక్షురభిముఖత నాలోకించెన్. |
166 |
| ఉ. |
అమ్మెయి నూరకుండ ననుయాయి జనమ్ములు పెక్కు లాడి చి త్తమ్ము కలంక దేర్చి యుచితక్రియకున్ మొగకొల్పి ‘బంధుసం ఘమ్ముల నిందుఁ దెత్తమొ? వికారవిదూర! యుపేంద్రు భవ్యదే హమ్మట గొంచుఁ బోదమొ? సమర్హవిధం బొకఁ డేర్పరింపుమా!’ |
167 |
| చ. |
అని యడుగంగ ‘దైవగతి నంబుధి పట్టణమాక్రమించు టె ద్దినమున నొక్కొ?’ యన్వగ మదిం జొనిపెం గురునాథ! యప్పు డ వ్వినుతగుణాభిరాముఁ డడవిం దమత్రిమ్మటఁ జన్నప్రొద్దు ల య్యనుచరకోటితోడఁ దెలియం దలపోయఁగ లెక్క దోఁచినన్. |
168 |
| క. |
మఱునాఁడ యగుట లెస్సగ | నెఱిఁగె; నినుం డపుడు వేఁడి యెడలిన దీప్తుల్ దుఱఁగలిగొనఁ బశ్చిమగిరి | చఱికి ననతి దూరమున విశదుఁడై తోఁచెన్. |
169 |
| సీ. |
దాని కజ్జనములుఁ దాను నుత్తల మంది | చర్చించి కార్యంబు చాయఁగాంచి ‘మనము కృష్ణునిఁ గని చనుదెంచినారమై | పురమున నివ్వార్త పుట్టకుండ నడచి యచ్చటి మాట లవి కొన్ని ఘటియించి | చెప్పి యీరేయి చెచ్చెరఁ బ్రయాణ మునకుఁ గృత్యములగు పనులెల్ల సమకట్టి | వేగంగ గ్రక్కున వెడలవలయుఁ |
|
| ఆ. |
గాని వెడలకున్న భానూదయంబున | వనధి పురము ముంచికొనిన గణన సేయరాని యట్టి సేగియుఁ బ్రయ్యుఁ బా | పంబు వగయు నెల్లభంగిఁ గలుగు. |
170 |