| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | మౌసలపర్వము - ఏకాశ్వాసము |
| సీ. |
అని పల్కి రప్పిండునందు రుక్మిణియు జాం | బవతియులోనగు పద్మముఖులు గొందఱు గోరిరి కురునాథ! యనుమర | ణమునకు బంధుజనంబులెల్ల శోకార్తులై రోదనాకులత్వము నొంది | రనుమృతికలనకు నమరియున్న యా బలదేవ మురాంతక మహిషుల | కతి విభవం బైన యానకల్ప |
|
| తే. |
నంబు నాకల్పరచనంబు నడపి నరుఁడు | చందనాగురుమయచితాసంవిధాన మాచరించి యర్హప్రకారాగ్ని విధి యొ | నర్చె మహనీయవిప్రజనంబుఁ బనిచి. |
204 |
| క. |
విను సత్యభామలోనగు | వనితాజను లధిక నియతి వనములకుఁ దపం బొనరింపఁ బూని కొందఱు | చని రవ్విధమున నలుప్తసత్కర్ముండై. |
205 |
| తే. |
అఖిలబంధు జనంబుల నాప్తజనుల | నర్హవాక్యప్రయుక్తి నూరార్చి యుచిత మార నామంత్రితులఁ జేసి యశ్రు లురులఁ | బోయె నా క్రీడి సాత్యవతేయుగుఱిచి. |
206 |