| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ప్రథమాశ్వాసము |
| ఉ. |
వీరుఁడు ధర్మజుండు పదివేవురు విప్రుల కొప్పఁ బాయసా హారము భక్తిఁ బెట్టి మఱి యందఱకుం జెఱు వేయునేసి వి స్తారయశుండు ధేనువుల ధర్మవిధిన్ మణి ముద్రికాద్యలం కార దుకూల పుష్పఫల గంధయుతంబుగ నిచ్చి లీలతోన్. |
15 |
| వ. | అనుజసహితుం డయి దైవజ్ఞదత్తశుభముహూర్తంబున ధౌమ్యాదిభూసురాశీర్వాదపుణ్యాహనాదంబు లెసంగ సభాప్రవేశంబు సేసి యంత. | 16 |
| ఉ. |
మంచిగ భూరి భూసుర సమాజమునెల్లను భక్తితోడఁ బూ జించి, యభీష్టదానములు సేసి, ధనార్థులఁ దన్పి దిక్కులన్ నించె యశంబు; బంధులకు నెయ్యురకున్ హృదయప్రియంబు గా వించె విభూతి యేర్పడఁ బవిత్రుఁడు ధర్మసుతుండు నెమ్మితోన్. |
17 |
| వ. | తదవసరంబున. | 18 |
| మ. |
మదమాతంగ తురంగ కాంచన లసన్మాణిక్య గాణిక్య సం పద లోలిం గొని వచ్చి యిచ్చి, ముదమొప్పం గాంచి, సేవించి, ర య్యుదయాస్తాచల సేతుశీతనగ మధ్యోర్వీపతుల్ సంతతా భ్యుదయున్ ధర్మజుఁ దత్సభాస్థితు జగత్పూర్ణ ప్రతాపోదయున్. |
19 |
| వ. | మఱియును | 20 |
| సీ. |
సుబల మార్కండేయ శునక మౌం జాయన | మాండవ్య శాండిల్య మందపాల బక దాల్భ్య రైభ్యక భాలుకి జతుకర్ణ | గౌతమ కౌశిక కణ్వ కుత్స సావర్ణి పర్ణాద సత్య గోపతి గోప | వేష మైత్రేయ పవిత్రపాణి ఘటజాను కాత్రేయ కఠకలాప సుమిత్ర | హారీత తిత్తిరి యాజ్ఞవల్క్య. |
|
| ఆ. |
వాయుభక్ష భార్గవ వ్యాస జైమిని | శుక సుమంతు పైల సువ్రతాదు లయిన మునులు నేము నరిగితి మెంతయు | రమ్యమయిన ధర్మరాజుసభకు. |
21 |
| వ. | అమ్మహామునుల నెల్ల నతిభక్తిం బూజించి లబ్ధాశీర్వచనుండై ధర్మతనయుండు వారలవలన ధర్మకథలు వినుచుఁ దమ్ములుం దానును సుఖంబుండునంత నొక్కనాఁడు. | 22 |