| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | అని కృతాంజలి యయి ‘మునీంద్రా! యీత్రిలోకంబులయందును మీ చూడనివి లే; వెందే నిట్టి యపూర్వంబైన సభ చూచి యెఱుంగుదురే?’ యని మయ నిర్మితం బయిన సభ చూపినం జూచి విస్మితుండయి నారదుండు ధర్మరాజున కి ట్లనియె. | 58 |
| క. |
భూనాథ! యిది యపూర్వ, మ | మానుషము, విచిత్ర రత్నమయ; మిట్టి సభన్ మానవలోకేశ్వరులం | దే నెన్నఁడుఁ జూచి వినియు నెఱుఁగ ధరిత్రిన్. |
59 |
| క. |
సురపతి యమ వరుణ ధనే | శ్వర కమలాసనుల దివ్యసభలెల్ల నరే శ్వర! చూచితి; నవి దీనికి | సరిగా వత్యంతవిభవసౌందర్యములన్. |
60 |
| వ. | అనిన విని ‘యవి యెట్టివి? వాని వినవలతు నానతిం’డని లోకపాల సభావిభవ శ్రవణ ప్రభూత కుతూహల చేతస్కుండై యడిగిన ధర్మరాజునకు నారదుం డి ట్లనియె. | 61 |