| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ప్రథమాశ్వాసము |
| సీ. |
గరుడధ్వజుం డప్డు కరుణాసమేతుఁడై | యమ్మాగధుల కెల్ల నభయ మిచ్చి, మొగి జరాసంధుచే నిగృహీతులయి యున్న | పృథివీపతుల విడిపించి చెఱలు, మోక్షితు లైన సర్వక్షత్త్రియులచేత | సంశుద్ధరత్న పుంజములఁజేసి పూజితుండయి, తన తేజంబు వెలుఁగంగ | సహదేవు నజ్జరాసంధతనయు |
|
| ఆ. |
నోడ కుండు మని తదున్నత రాజ్యంబు | నందు నిలిపి, హృదయహారి వివిధ రత్నరాజి సుందరంబైన మగధేశు | రథముఁ దేరఁ బనిచె రమణతోడ. |
215 |
| వ. | ‘తొల్లి తారకాసుర సంగ్రామంబున నింద్రారూఢంబయిన దాని నింద్రువలన వసువను రాజు వడసె, వానివలన బృహద్రథుండు వడసె’ నని తద్దివ్యరథప్రభావంబు సెప్పుచు భీమార్జున సమేతుండయి యా రథం బెక్కి చక్రధరుం డఖిలరాజచక్రంబుతో నింద్రప్రస్థగమనోన్ముఖుండై గరుడనిం దలంచుడుఁ దత్‌క్షణంబ. | 216 |
| క. |
అనలప్రభాభిశోభిత | ఘనతర తనుదీప్తు లొప్పఁగా వచ్చి వడిన్ వినతాతనయుఁడు వినయా | వనతోరుశిరస్కుఁ డయ్యె వనజాక్షునకున్. |
217 |
| వ. | ఇట్లు వచ్చిన వైనతేయు నతిప్రీతిం దద్దివ్యరథసారథ్యంబునందు నియోగించి, మనోవాయు వేగంబునం గృష్ణ భీమ విజయు లింద్రప్రస్థపురంబు ప్రవేశించి రంత. | 218 |
| మ. |
‘జనసంత్రాసకరున్ మహోద్ధతు జరాసంధున్ హరిప్రేరణం బున భంజించెఁ బ్రభంజనాత్మజుఁడు; భూభుగ్వీరులం దన్నిరో ధన నిర్ముక్తులఁ జేసె; నింకఁ జతురంతక్షోణికిన్ ధర్మనం దను సామ్రాజ్యము పూజ్యమయ్యె’ నని మోదం బంది రుర్వీజనుల్. |
219 |
| క. |
‘ఆయుధనిహతుఁడు గాని య | జేయు జరాసంధు భీమసేనుఁడు విజయ శ్రీ యెసఁగ నోర్చెఁగా క | త్యాయత భుజశక్తి నొరుల కలవియె?’ యంచున్. |
220 |
| క. |
పురజను లాశ్చర్యంబునఁ | గర మనురాగమునఁ బరమ కౌతుకమునఁ జూ చిరి బోరన వచ్చి వృకో | దర దామోదర సురేంద్రతనయులఁ బ్రీతిన్. |
221 |
| వ. | కృష్ణభీమ విజయు లిట్లు విజయ విభాసితులయి వచ్చి ధర్మరాజునకు మ్రొక్కి జరాసంధు బంధనంబువలనం దమచేత మోక్షితులైన మహీపతుల నెల్లం జూపిన. | 222 |
| క. |
సవినయ నతోత్తమాంగుల | నవనీశుల నందఱను యథార్హప్రియగౌ రవమునఁ బూజించి కురు | ప్రవరుఁడు తద్దేశములకుఁ బరువడిఁ బంచెన్. |
223 |