| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ప్రథమాశ్వాసము |
| క. |
అనుపమధనరాసులు గొను | చును ననురాగమున రాజసూయమఖాలో కన కౌతూహలపరు లయి | చనుదెంచిరి భీష్ముఁదొట్టి సద్బంధుజనుల్. |
285 |
| వ. | ఇట్లు వచ్చిన భీష్మ ధృతరాష్ట్ర విదుర ద్రోణ కృపాశ్వత్థామ సోమదత్త కర్ణ భూరిశ్రవశ్శల్య శకుని సైంధవ దుర్యోధన దుశ్శాసన వికర్ణాదుల నెల్లం బ్రియసత్కారంబులం బూజించి వారలతో ధర్మరా జి ట్లనియె. | 286 |
| ఆ. |
మీ యనుగ్రహమునఁ జేయంగఁ గడఁగితి | నిమ్మహాధ్వరంబు నెమ్మితోడ దీని నిందఱును ననూనంబుగాఁ బూని | పెంపు మెఱసి నిర్వహింపవలయు. |
287 |
| వ. | అని వారల యనుగ్రహంబు వడసి హిరణ్య రజత రత్న దక్షిణా దాన విషయంబులందుఁ గృపాచార్యునిఁ, గృతాకృత పరిజ్ఞానంబునందు భీష్మద్రోణులను, సకల వస్తు వ్యయంబునందు విదురుని, నానాదేశాగతులైన రాజులు దెచ్చి యిచ్చిన యుపాయనంబులు గైకొన దుర్యోధనుని, భక్ష్యభోజ్యాది వినియోగంబునందు దుశ్శాసనుని నియోగించి. | 288 |