పురాణేతిహాసములు శ్రీమహాభారతము సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము
ఆశ్వాసాంతము
స్రగ్ధర సాయంప్రాతర్హుత ప్రజ్వలిత హుతవహస్వైరనిర్ధూతజాడ్య
స్ఫాయచ్చేతః ప్రసాద ప్రసృమరవిమలప్రౌఢబోధానుమోదీ!
మాయావ్యాపారదూరా! మఖతతిహృతినిర్మాణసంపాద్యమానా!
శ్రేయోరాజత్త్రిలోకాశ్రిత జనదురితక్షేపలీలావిలాసా!
134
క. సురనికరానందకరా! | సురారికాంతావిలాసశోభాపహరా!
కరుణాసక్తమనస్కా! | సరిద్వరా బర్హి బర్హ చారు శిరస్కా!
135
మాలిని అకలుష హృదయాభివ్యక్త! సర్వోపయుక్తా!
సకలనిగమవేద్యా! స్వాస్థ్యవిద్యోపపాద్యా!
ప్రకృతివికృతిభావప్రాప్త సాంఖ్య ప్రదీప్తా!
సుకృతమయ విలాసా! సుస్థిరానందభాసా!
136
గద్యము ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్య పుత్త్ర బుధా రాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన శ్రీమహాభారతంబున సౌప్తిక పర్వంబునందు సర్వంబును ద్వితీయాశ్వాసము. 137
శ్రీమదాంధ్ర మహాభారతంలో సౌప్తికపర్వం ముగిసింది.
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )